Friday, 11 August 2017 14:53

వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!

Written by 
Rate this item
(0 votes)

asaluరాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు కొట్టింది.

మొన్నటి వరకు జిల్లాలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, తమకు సీటు ఖాయమని కొందరు నాయకులు లెక్కలేసు కుంటూ గడిపారు. ఇలా ఆశపడ్డ వారిలో అధికార తెలుగుదేశంపార్టీ నాయకు లతో పాటు ప్రతిపక్ష వైకాపాకు చెందిన వాళ్లు కూడా వున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరం కేం ద్రంగా మూడు అసెంబ్లీలు ఏర్పడుతాయనే ప్రచారం జోరుగా నడిచింది. 2009లో జరిగిన విభజన ద్వారానే నెల్లూరు అసెంబ్లీ నెల్లూరు నగరం, నెల్లూరురూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి. సీట్లు పెంచడం అంటూ జరిగితే నెల్లూరులో మూడో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవ కాశం వుంటుందని, మైనార్టీలు ఎక్కువుగా వుండే నియోజకవర్గం సీటు తనకే వస్తుం దనే ఆశతో మేయర్‌ అజీజ్‌ వుండిపో యాడు. అలాగే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు కూడా సీట్లు పెరిగితే ఎలాంటి విభేదాలు లేకుండా తమకు టిక్కెట్లు వస్తాయనే నమ్మకంతో ఇంతకాలం వున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ సీట్లు పెరగవని తేల డంతో నాయకులు డీలా పడిపోయారు.

Read 857 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter