19 August 2017 Written by 

శీలపరీక్షకు సిద్ధమైన శ్రీధర్‌

kotamజిల్లా రాజకీయాలలోనే కాదు, బహుశా దేశ రాజకీ యాలలోనే ఇదో సంచలనం. శాసనసభ్యుల జీతాలు పెంచ డాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలోనే వ్యతిరేకించి కొత్త వొరవడికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలంటూ బహిరంగంగా ప్రజలమధ్య కొచ్చి ఏకంగా జిల్లా పోలీసు యంత్రాం గాన్నే నేరుగా కలసి సవాల్‌ విసరడం అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరురూరల్‌ శాసనసభ్యుడిగా తాను గెలిచిన నాటి నుండి ప్రజల వాడిగా నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రజల నాడిగా తనదైన పంధాలో తన భవిష్యత్‌ ప్రగతికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాసేవకు అధికారపార్టీయే అవసరం లేదని, సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధి వుంటే ప్రతి పక్షంలో వున్నా పరవాలేదని రుజువుచేస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్న ఎమ్మెల్యే లలో మొదటి స్థానంలో వుంటాడు శ్రీధర్‌.

ఇటీవల జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవ హారం సంచలనమైన విషయం అందరికీ తెలిసిందే. బెట్టింగ్‌ బాబుల భరతం పడ తానని చెప్పి జిల్లాకి క్రొత్తగా వచ్చిన ఎస్‌.పి పి.హెచ్‌.డి.రామకృష్ణ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తన పనితనాన్ని కూడా చూపాడు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల వారినీ పట్టి లోపలేశాడు. ఈ క్రమంలోనే శ్రీధర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిని సైతం పోలీసులు అరెస్టు చేసారని, అనంతరం జరిగిన విచా రణలో ఓ వైసిపి ఎమ్మెల్యేకి 40లక్షలు ముట్టజెప్పినట్లుగా శ్రీధర్‌ ముఖ్య అను చరుడు వెల్లడించాడని ఓ ప్రముఖ దిన పత్రిక ప్రత్యేకశీర్షికలో వార్తను ప్రచురిం చింది. ఇక్కడే శ్రీధర్‌కి మండింది. గాలి వార్తలు, గాసిప్‌ వార్తలు ప్రచురించడం సబబు కాదంటూ

ధ్వజమెత్తాడు. తన అనుయాయుడిని విచారిస్తే ఓ ఎమ్మెల్యే పేరు చెప్పాడంటూ వచ్చిన వార్తపై సీరియస్‌ అయ్యాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో ప్రజలకు చెప్పాలంటూ పట్టుపట్టాడు. ఒకవేళ అది తన పేరే అయినా నిరభ్యంతరంగా బయటపెట్టాలని తాను తప్పు చేసుంటే ఉరిశిక్షకైనా సిద్ధమని తన అనుచరగణంతో ఎస్పీ కార్యాలయం ముందు ప్రత్యక్షమైపోయాడు.

అసలు తమ విచారణలో ఏ శాసనసభ్యుడి పేరూ రాలేదని, ఇదంతా ఓ దినపత్రిక అత్యుత్సాహంతో చేసిన తప్పుడు ప్రచారమే నని జిల్లా ఎస్పీ తేల్చిపారేశాడు. ఎవరో వ్రాసిన నిరాధార వార్తతో ప్రజలను తప్పుదోవ పట్టించడం, అనవసర మైన అభూత కల్పనలతో ప్రజాప్రతినిధుల ప్రతిష్ట దిగజార్చటం సమంజసం కాదని బహిరంగంగానే ఖండించాడు.

అరెస్టు చేసింది శ్రీధర్‌రెడ్డి అనుచరుడిని కాబట్టి ఆ ఎమ్మెల్యే శ్రీధరే అయ్యుంటాడేమోనన్న వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. పత్రికలో వచ్చిన క్షణం నుండీ ఈ విషయమే మాట్లాడుకుంటుం డిన మేధావుల బాణి మారింది. ''శెభాష్‌'' శ్రీధర్‌ అంటూ శాసన సభ్యుడిని కీర్తించడం మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులపై నిరా ధారమైన ఆరోపణలు రావడం సహజమే. ఆ ఆరోపణలకీ తనకీ సంబంధం లేదంటూ ఓ ప్రకటన పారేసి తమ పని తాము చేసుకుపోవడమూ సహజమే... కానీ శ్రీధర్‌ అలా చేయలేదు. విషయాన్ని నిగ్గు తేల్చాలంటూ పట్టుపట్టాడు. అటు జిల్లా పోలీసు యంత్రాంగాన్నే కాదు ఇటు మీడియాని సైతం నిలదీశాడు. తనని జీరో చేద్దామని ప్రయత్నించినవారి చేతనే హీరో అనిపించుకున్నాడు.

ప్రజాప్రతినిధులంటే అవినీతికి వారధులు కాదు, రాజకీయ నాయకులంటే అక్రమాలకు సారధులు కాదు. నిజమైన ప్రజాసేవ కోసం, నిజమైన సమాజ ప్రగతి కోసం పాటుపడేవాళ్ళూ వుంటారు. ఒక్కసారైనా శాసనసభ్యుడ్ని కావాలన్నది ఒకప్పటి శ్రీధర్‌ జీవి తాశయం. కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ శాసనసభ్యుడిగానే వుండాలన్నది ఇప్పటి శ్రీధర్‌ ఆకాంక్ష. మరి అలాంటి లక్ష్యం వున్నవాడు తప్పు చేస్తాడా..? అనవసరమైన రొంపిలో కాలు పెడతాడా? ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, కోట్ల ఆస్తులు కూడబెట్టిన పెద్ద తరం అండ లేకుండా కేవలం స్వశక్తితో, స్వంత ప్రాభవంతో విద్యార్థి నాయకుడి నుండి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్‌రెడ్డి గురించి రాజకీయ మేధావులు వేసుకుంటున్న ప్రశ్నలివి.

ఒక మంచి సంప్రదాయానికి శ్రీధర్‌ శ్రీకారం చుట్టాడని చెప్పాలి. ప్రజాప్రతినిధులెవ్వరైనా తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదు అని రుజువయ్యే వరకు పోరాడాలన్నది ఆయన పిలుపు. రాబోయే తరాలలో ఇదొక మంచి ప్రారంభం, రేపటి రాజకీయ నేతలకు ఇదొక మంచి స్ఫూర్తిదాయక సంఘటన. తన ఆశయాలపైన, తాను నమ్ముకున్న సిద్ధాంతాలపైన, తాను పాటిస్తున్న నైతిక విలువలపైనా నమ్మకంతో శాసనసభ్యుడిగానే తన చివరి శ్వాస తీసుకుంటానన్న శ్రీధర్‌ కోరిక నెరవేరాలని ఆశిద్దాం!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
  • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
    నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
  • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
    కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
  • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
    ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter