19 August 2017 Written by 

ఆటోలకు ఆంక్షలు

autosనెల్లూరు నగరంలో ప్రజలకు సమస్యగా, పోలీసులకు సవాల్‌గా వుండేది ట్రాఫిక్‌. భారత్‌కు చైనాతో డోక్లామ్‌ సరిహద్దు వివాదమన్నా పరిష్కారమవుతుందేమోగాని, ఈ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం అంత సులభంగా లభించదు.

నెల్లూరు నగరంలో 70శాతం ట్రాఫిక్‌ అయ్యప్పగుడి, ఆత్మకూరు బస్టాండ్‌ల మధ్య వున్న ట్రంకురోడ్డు పైనే నడుస్తుంది. ఇటీవలకాలంలో మినీబైపాస్‌ రోడ్డు మీదకు ట్రాఫిక్‌ డైవర్ట్‌ కాబట్టి ట్రంకురోడ్డుపై కొంత ఒత్తిడి తగ్గింది. లేకుంటే ట్రంకురోడ్డులో ట్రాఫిక్‌ ఇంకా నరకంగా వుండేది. నెల్లూరులో ట్రాఫిక్‌కు ప్రధాన కారణం ఆటోలు. గతంలో దాదాపు 200 టౌన్‌బాస్సులుండేవి. ఆటోలు పెరిగి అవి తగ్గిపోయాయి. ఇప్పుడు నెల్లూరులో వున్నన్ని ఆటోలు మెట్రోసిటీలో కూడా వుండవేమోననిపిస్తుంది. ట్రంకురోడ్డులో ఎప్పుడు చూసినా ఆటోల ర్యాలీ జరుగుతున్నట్లుగా వుంటుంది. ట్రాఫిక్‌ను సరిదిద్దడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆటోలపై దృష్టిపెట్టారు. ఆటోలకు కొన్ని ఆంక్షలు విధించారు. ఆటోలకు పోలీసుస్టేషన్‌ల వారీగా నెంబర్లు ఇస్తారు. ప్రయాణీకులను పరిమితికి మించి ఎక్కించుకుంటే ఇక భారీ జరిమానాలు కట్టాల్సిందే! ఆటో కెపాసిటి ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే. కాని, ఏ ఆటోలోనూ ఐదారు మందికి తక్కువ వుండరు. ఇక నిర్మాణ పనులకు కూలీలను తీసుకెళ్లే ఆటోలలో అయితే పదిమందికి తక్కువ వుండరు. దీనిపై పోలీ సులు ఇక గట్టిగా వుంటారు. పరిమితికి మించి ఎక్కిస్తే కేసులే! నగరంలో ఆటోలకు ఒక పద్ధతి పాడూ లేకుండా నడుస్తుంటాయి. ప్రయాణీకుడు చెయ్యెత్తితే నడిరోడ్డు మీద కూడా ఆటోలను ఆపేసి ఎక్కించుకుంటుంటారు. దీనివల్ల వెనుకవైపు ఎంతో ట్రాఫిక్‌ ఆగిపోతుంది. ఇకనుండి నిర్ణీత స్టాపింగ్‌లలో మాత్రమే ఆటోలను నిలిపి ప్రయాణీకులను ఎక్కించుకోవాల్సి వుంటుంది. ఆటో యజమానులు తమ ఆటోలను లైసెన్స్‌ లేని వారికి ఇచ్చినా, మైనర్లకు ఇచ్చినా యజమానులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలైన ముత్తుకూరు, టి.పి.గూడూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, బుచ్చి, నెల్లూరురూరల్‌ మండలం, వెంకటాచలం, పొదల కూరు మండలాలలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజూ వేలసంఖ్యలో ఆటోలు ప్రయాణీకులతో నెల్లూరు నగరంలోకి ప్రవేశిస్తుంటాయి. నగరంలోని ట్రాఫిక్‌పై ఇవి అదనపు భారం. ఈ ప్రాంతాల ఆటోలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా మండలాల వైపు నుండి వచ్చే ఆటోలను నగర శివార్లలోని ప్రాంతాల వరకే అనుమతిస్తారు. పరిధి దాటి లోపలకు వస్తే చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ట్రంకురోడ్డుపై కొంతవరకన్నా ఆటోలు తగ్గుతాయి. ఈ నిబంధ నలను ఖచ్చితంగా అమలు చేస్తే కొంతవరకన్నా నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter