19 August 2017 Written by 

18-08-2017 రాశిఫలాలు

rasi 18

1Ariesమేషం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యా ర్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. చెల్లింపులు సకా లంలో జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూ లత, కొత్త వస్తువులు, పరికరాలు కొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినా ధనానికి ఇబ్బందులుండవు.

 

2Taurusవృషభం

ఇతరులకు సహాయ పడటం, ఉద్యోగులకు అధి కారులతో సానుకూలత ఉంటుంది. పరుషంగా మాట్లా డటం, అనవసర విషయాలలో జోక్యం చేసికొనడం చేయకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కోర్టు కేసులందు అనుకూలత, బిడ్డల విద్యా వివాహ విష యాలపై ప్రయత్నాలు జరుపుతారు. అనుకున్న కార్యక్ర మాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.

 

3Geminiమిధునం

వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వల్ల చిన్న ఇబ్బందులుండవచ్చును. కొత్త వస్తువులు కొనడం, వాహన రిపేర్లుండగలవు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. వ్యాపార, వృత్తి జీవనం కలిగినవారు కొత్త పథకాలు గూర్చిన ఆలోచనలు, ఆదాయమున స్వల్ప పెరుగుదల ఉంటుంది.

 

4Cancerకర్కాటకం

స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేసికొనడం మంచిది. చేపట్టిన పనులు సానుకూలమైనను, ఇతరుల విమర్శలకు గురి కావలసి వస్తుంది. ఆర్ధిక వ్యవహారా లను ఇతరుల సలహాలతో నిర్వహించడం మంచిది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. ఆరోగ్యం ఫరవా లేదు. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు.

 

5Leoసింహం

కుటుంబ వ్యక్తులకు కొద్దిపాటి అనారోగ్య బాధ లుంటాయి. అనుకోని ప్రయాణాలుండటం, షేర్‌ మార్కెట్‌ నిరుత్సాహపరచడం జరుగుతుంది. కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అవ కాశాలు దొరకగలవు. అధికార వర్గాలకు స్థాన చలనం, పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఫరవా లేదు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

6Virgoకన్య

ఉద్యోగులకు ప్రజలతో అధికారులతో సత్సంబం ధాలు ఏర్పడతాయి. కొంతవరకు ఋణ సమస్యలు పరిష్కారం కాగలవు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉన్నది. ఇతరులకు సహాయపడతారు. తెలియని విష యాలలో తలదూర్చవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపకాలు పెరగడం వల్ల, అనుకున్న పనులు సరిగా చేయలేక టెన్షన్‌ పడుతుంటారు.

 

7Libraతుల

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పైనబడగలవు. ప్రముఖులను కలవడం, అనుకోని ప్రయాణాలుంటాయి. ఉద్యోగార్ధులకు చిరు అవకాశాలు దొరకగలవు. స్థిరా స్తుల వృద్ధికి వ్యాపారవృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు, అభివృద్ధి తగ్గుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

 

8Scorpioవృశ్చికం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆదాయం తగ్గవచ్చును. శుభకార్య ప్రయత్నాలలో నేర్పరి తనంతో వ్యవహరించండి. దూర బంధువులను ప్రముఖ వ్యక్తులను కలుసుకొంటారు. విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు దొరకగలవు. ఒకటి రెండు అనవసర ఖర్చులు పైనబడగలవు. అనుకున్న పనులు, చేపట్టిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించలేకపోవచ్చు.

 

9Sagittariusధనుస్సు

కోర్టు వ్యవహారాలు టెన్షన్‌ కలిగిస్తాయి. కుటుం బంలో చిన్న చిన్న విభేదాలు కలుగవచ్చును. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో ఆందోళనగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలలో వెనుక బడతారు. తొందరపాటు వ్యవహారాలతో ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన తీరుగా ఉండవు. ఆదాయం తగ్గుతుంది.

 

10Capricornమకరం

ఉద్యోగులకు అధికారుల నుండి వత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు దొరకడం, విలువైన సామాగ్రిని కొనడం, అనుకోని దూర ప్రయాణా లుంటాయి. సభలు, సమావేశాలలో ప్రముఖంగా వ్యవహ రిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పాత కేసులు, కోర్టు వ్యవహారాలలో ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ప్రయత్నాలు చేస్తారు.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆదాయం సామాన్యం. ముఖ్య వ్యక్తులను కలువలేక పోవచ్చును. కొత్త కాంట్రాక్టులు, కొత్త ఏజన్సీలకు ప్రయత్నాలు చేయండి. జరిగిపోయిన విషయాలు గుర్తు చేసి ఇతరులను బాధపెట్టవద్దు. రావలసిన బాకీలు వసూలు కాగలవు. కుటుంబసభ్యులలో సరైన అవగాహన లేక అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చును.

 

12Piscesమీనం

కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు చేయడం, క్రయ విక్రయాలు నిర్ణయం కావడం జరుగుతుంది. విద్యార్థు లకు మంచి అవకాశాలు దొరకడం, అనుకూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆశించినంత ఆదాయముండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ రాబడి ఉండదు. చెల్లింపులు సకాలంలో చెల్లిస్తారు.

 Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter