19 August 2017 Written by 

విషజ్వరాలతో నగరం విలవిల!

chetta chadaramనెల్లూరు నగరంలో మున్నెన్నడూ లేనంతగా విషజ్వరాలు జనాన్ని గడగడ వణికిస్తున్నాయి. నగరమంతా ఎక్కడ చూసినా మురుగు గుంతలతో, పారిశుద్ద్యం పరమ అద్వాన్నంగా ఉండడంతో దోమలు పెరిగిపోయి ప్రజలు నానా రకాల వ్యాధులకు గురవుతున్నారు. అయినా, అధికారగణం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. అటు కార్పొరేషన్‌ కానీ, వైద్యఆరోగ్యశాఖ కానీ ఈ విషజ్వరాలను నివారించడానికి ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ప్రతి సీజన్‌లోనూ సీజనల్‌ వ్యాధులు, విషజ్వరాలు మరింతగా ప్రబలిపోతున్నాయి.

ఇటీవల నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసమని ఎడాపెడా తవ్వేస్తున్న గుంతలతో రోడ్లన్నీ మురుగ్గుంటలుగా..అవే దోమల గుంతలుగా మారిపోయాయి. వీధుల్లో మురుగునీటి ప్రవాహాలు వెల్లువెత్తుతున్నాయి. 'ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతివీధి సమస్తం మురుగు ప్రవాహం'..అన్నట్లుగా అంతా దుర్గంధమే. చిన్న వాన కురిసినా చాలు, ఇక నెల్లూరు రోడ్ల మీద నడవాలంటేే సర్కస్‌ చేయాల్సివస్తోంది. ఏ వీధి చూసినా మురుగుదిబ్బలు.. చెత్తకుప్పలతో నిండిపోవడంతో నగరమే ఒక మురికికూపంగా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నా, ఆచరణలో నానాటికీ దుర్గంధం పెరిగి పోతుండడమే తప్ప పారిశుద్ద్య పరిస్థితి బాగుపడిందే లేదు. అంతేకాక, సైడుకాలువల కోసం తవ్విన గుంతల్ని పూడ్చే పనులు నామమాత్రంగానే ఉండడంతో నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ వీధి చూసినా ఇదే వేదన. బాగున్న రోడ్లన్నీ గుంతలమయం చేశారని, రేపో మాపో వచ్చి బాగుచేస్తారులే అనుకుంటే రోజులు గడిచినా ఆ గుంతలు పూడ్చేవారే కరువయ్యారని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. అతుకులు గతుకులుగా, గుంతలు మిట్టలుగా తయారైన రోడ్లను చూసి ఈ నగరవీధులకు ఎంత దుస్థితి పట్టిందో కదా అని వాపోతున్నారు. నగరంలో దోమలు ఎంతగా ప్రబలిపోయి వీరవిహారం చేస్తున్నా దోమలను నివారించే ఫాగింగ్‌ యంత్రాలు మాత్రం కనిపించడం లేదు. ఉన్నతాధికా రులు ఎప్పుడో ఒకసారి కఠినంగా ఆదేశించిన రోజున మాత్రం ఆ సిబ్బంది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారే తప్ప నగరంలో పారిశుద్ద్యాన్ని క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడం లేదు. నగరంలోని ట్రంకు రోడ్డు, స్టోన్‌హౌస్‌పేట, పెద్దబజారు, చిన్నబజారు, మూలాపేట, రంగ నాయకులపేట, బాలాజీనగర్‌, దర్గామిట్ట, వేదాయపాళెం ఇలా ఏ ప్రధాన ప్రాంతంలోని వీధుల్లోకెళ్ళినా అపారిశుద్ద్యమే. చివరికి కలెక్టర్‌ కార్యా లయం చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా పరమ అధ్వాన్నంగా చెత్తకుప్పల మయంగా దర్శనమిస్తున్నాయి. వానొస్తే నీరంతా ఆ గుంతల్లోనే నిల్వ ఉండడంతో, అవి మురుగునీటి గుంటలుగా మారుతుంటాయి. ఒక్కోసారి ఆ ప్రాంతాల్లో మంచినీటి పైపులు పగిలిపోయి ఉంటే ఆ మురుగంతా ఆ పైపుల్లోకి వచ్చేస్తుంటుంది. రోడ్డు మధ్యలోనే ఉన్న ఆ గుంతలు అటు వాహనాల రాకపోకలకు, ఇటు పాదచారులకు ఎంతో ఇబ్బందిగా ఉన్నా నిత్యం అనేకమంది అధికారులు కూడా ఆ దారుల్లోనే వాహనాల్లో

వెళ్తున్నా, చూసీ చూడనట్లు వెళ్తుంటారే తప్ప ప్రజల బాధలు అస్సలు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ఎన్నివిధాలుగా చెప్తున్నా గతుకుల మయంగా ఉన్న రోడ్లను బాగుచేసిందీ లేదు.. ఆ గుంతలను సక్రమంగా పూడ్చిందీ లేదు. ఇదీ దుస్థితి. ఇక ఆ గుంతల్లోని మురుగంతా రోజుల తరబడి వాహనాల తొక్కిడితో బురదగా మారి, అదే ఎండకు ఎండి..చివరికి మట్టిగా మారి.. దానిపాటికదే గాలిలో... ధూళిలో కలసిపోవాల్సిందే తప్ప ఇక మరో మార్గాంతరం ఉండడం లేదు. తద్వారా ఏర్పడుతున్న ఆ దుర్గంధపూరిత వాతావరణానికి, ఆ కాలుష్యానికి సమీప ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, రోగనిరోధకశక్తి బలహీనమైపోయిన వృద్ధులు లేనిపోని వ్యాధుల బారినపడుతూ నానా బాధలు పడుతున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు వైరల్‌ ఫీవర్స్‌తో పాటు, డయేరియా, డెంగ్యూ తదితర ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం ఉండడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క నగరంలోనే కాక, జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో, గ్రామాల్లోనూ, ప్రతి పంచాయితీలోనూ ఇదే పరిస్థితి. పారిశుద్ద్య పరిరక్షణకు నిధులున్నా సిబ్బంది, అధికారులు అనేకమంది ఉన్నా పారిశుద్ద్య పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా నగరంలో విషజ్వరాలు మరింతగా ప్రబలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, పారిశుద్ద్యాన్ని పరిరక్షించకపోవడంతో, ఎక్కడ చూసినా దుర్గంధమే తాండవిస్తోందని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనేకరకాల వ్యాధుల బారినపడి ఆసుపత్రులకు వెళ్తే ఆ పరీక్షలు ఈ పరీక్షలని అధికమొత్తంలో డబ్బు గుంజేసుకుంటున్నారని, ఈ బాధలనుంచి తమను కాపాడేదెవరని ప్రజలు మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా, జిల్లా కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు నగరంలోని వీధులను, ప్రధానరోడ్లను స్వయంగా పరిశీలించి, గుంతలు పూడ్పించి రోడ్లను బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలను తీవ్ర ఆందో ళనకు గురిచేస్తున్న విషజ్వరాలను నివారించడానికి, అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ద్య పరిస్థితిని వెంటనే మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter