rasi 23

1Ariesమేషం

ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేక పోవచ్చును. దూర ప్రయాణాలు వాయిదా పడటం, శుభకార్య ప్రయత్నాలకు ఆటంకాలుండటం జరుగు తుంది. చిన్న వ్యాపారాలకు ఆదాయం ఫరవాలేదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి.

 

2Taurusవృషభం

గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు సమా వేశాలలో గుర్తింపు గౌరవం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, విద్యార్థులకు మంచి ప్రగతి, జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి పరంగా జీవనం కలవారికి ఆర్ధికస్థితి కొంత బాగుంటుంది. వ్యాపార వర్గాలకు మంచి అభివృద్ధి ఆదాయముంటుంది.

 

3Geminiమిధునం

వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసికొంటారు. ఉద్యోగార్ధులకు మేలైన అవకాశాలుండకపోవచ్చును. కుటుంబసౌఖ్యం బంధు సఖ్యత బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగ స్వామ్యాలకు అవకాశాలు లభించగలవు. అవసరాలకు మాట రూపేణ, డబ్బు రూపేణ సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ప్రయాణాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు రావలసిన బాకీలు లభించడం, పని భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు జరపకుండా జాగ్రత్తపడాలి. బిడ్డల విద్యా శుభకార్య విషయాలందు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. రావలసిన బాకీలు కొంత అందుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

5Leoసింహం

పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యావృద్ధి కలదు. ఆదాయం పెరిగి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

6Virgoకన్య

కోర్టు వ్యవహారాలలో అనుకూలత తక్కువ. పట్టు దలతో అనుకున్న పనులు సాధించుకొంటారు. అనుకోని ఖర్చులు పైనబడగలవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టుబడులు జరుపుతారు. చిన్న వ్యాపారాలు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది.

 

7Libraతుల

ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసి కొనండి. గృహ వస్తు వాహన రిపేర్లు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్య పనులు వాయిదా వేసుకొంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య అవకాశాలు, ఆదాయం ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగ సౌఖ్యం, కొత్త ఉద్యోగావకాశాలు దొరకడం జరుగవచ్చును. కొత్త పరిచయాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, దూరప్రయాణాలు వాయిదా పడటం జరుగు తుంది. పరుష ప్రవర్తన, తొందరపాటు మాటలు తగ్గించు కొనాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. స్థిరాస్తుల లావా దేవీలు జరుపుతారు. సమస్యాత్మక విషయాలలో సంప్ర దింపులు, చర్చలు జరిపి పరిష్కారం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు స్థాన మార్పులు, పని భారం బాగుం టుంది. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగండి. శరీరానికి గాయాలు తగలవచ్చును. కొంతమంది మిమ్మల్ని పరోక్షంగా కించపరచవచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగ మించి, రాబడి పెరుగుతుంది. వృత్తి జీవనంలో సామాన్య అవకాశాలుంటాయి. బిడ్డలకు అభివృద్ధి బాగుంది.

 

10Capricornమకరం

సమస్యలు సక్రమంగా సర్దుబాటు కాగలవు. పారి శ్రామిక వర్గాలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కలదు. ఆస్థుల లావాదేవీలు వాయిదా పడతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆశించినంత ఎక్కువ ఆదాయముండదు. బ్యాంకు ఋణాలు లభించడంలో కాలయాపన జరుగవచ్చును.

 

11Aquariusకుంభం

ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమర్ధవంతంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకు తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండి సర్ధుబాటు కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులను జాగ్రత్తగా నెరవేర్చుకుంటారు. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉమ్మడి వ్యాపారాలకు లీజులకు అవకాశాలు దొరుకు తాయి. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ ఉంటుంది. బంధువర్గాన్ని కలుసుకొంటారు. ప్రయాణా లుంటాయి. పైకి తీవ్రత లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందు లుంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి.

tdp congressవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చచ్చిపోయింది. తన గోతి తానే తవ్వుకుంది. తన నెత్తిన తానే మట్టి పోసు కుంది. ఇదీ చాలామంది అభిప్రాయం. కాని, లోతుగా పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ చచ్చిపోలేదు... తెలుగుదేశం రూపంలో బ్రతికొచ్చింది.

'యముడికి మొగుడు' సినిమాలో ఇక చనిపోతాడనుకున్న 'చిరంజీవి' పాత్రధారి శరీరంలోకి యమలోకంలో వున్న మరో చిరంజీవి ఆత్మను ప్రవేశపెడతారు. 2014 ఎన్నికల సమయంలోనూ రాష్ట్రంలో ఇదే జరిగింది. అప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ చిక్కి శల్యమైపోయింది. అంతకుముందు ఐదేళ్లలో వై.యస్‌. ప్రజా పాలన దెబ్బకు శిథిలమైపోయింది. చాలా చోట్ల అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. అటువంటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ పాలిట సోనియాగాంధీ ఇటలీ దేవత అయ్యింది. ఆంధ్రుల పాలిట దెయ్య మైంది. రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశంకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయాలలో మనుగడ లేదు అనుకున్న చంద్రబాబుకు రాజకీయ పునర్జన్మనిచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బ్రెయిన్‌డెడ్‌కు గురై, కోమాలో వున్న తెలుగుదేశంకు తన గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్ళు దానం చేసింది. దాంతో కాంగ్రెస్‌ ఆత్మ, అవయవాలు అన్నీ కూడా తెలుగుదేశంలో అంతర్భాగమై, ఆ పార్టీ కోమా నుండి కోలుకుంది. ఒకరకంగా చెప్పాలంటే సోనియాగాంధీ తన బిడ్డలైన కాంగ్రెస్‌వాళ్ళను చంపుకుని, పరాయి బిడ్డ లైన చంద్రబాబు, కేసీఆర్‌లను ముఖ్య మంత్రులను చేసిందనే చెప్పవచ్చు. ఇందులో ఆమెకు ప్రత్యక్ష పాత్ర లేకపో యినా, రాష్ట్ర విభజన ద్వారా ఆమె తీసు కున్న నియంతృత్వపు విధానాలే దీనికి కారణమయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పుడున్నది ఎన్టీఆర్‌ ఆశయాలకనుగుణంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక లాంటి పార్టీ కాదు. తెలుగుకాంగ్రెస్‌ పార్టీ... కాంగ్రెస్‌ ఆత్మతో, కాంగ్రెస్‌ అవయవాలతో మనుగడ సాగి స్తున్న పార్టీ. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్‌ నాయకులే దిక్కయ్యారు. ఆ పార్టీ గెలుపుకు దోహదం చేసింది కాంగ్రెస్‌ నాయకులే! చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గంలోను, నామినేటెడ్‌ పదవు ల్లోనూ వారిదే హవా! సోనియాగాంధీకి రెండుసార్లు కేంద్రంలో తమను గద్దెనెక్కిం చడానికి ఏపి నుండి మెజార్టీ లోక్‌సభ సీట్లు అందించిన వై.యస్‌. కుటుంబం కంటే కూడా చంద్రబాబే ఎక్కువయ్యాడు. చంద్రబాబుతో కలిసే జగన్‌ను కేసుల్లో ఇరికించి ఇబ్బందులపాల్జేసారు.

ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. చంద్ర బాబు మాత్రం అవసరమైతే అధికారం కోసం కాంగ్రెస్‌తో కూడా పొత్తుపెట్టుకు నేటట్లున్నాడు. ఎందుకంటే ఆయన బ్లడ్‌లో కాంగ్రెస్‌ వుంది. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం స్వచ్ఛమైన తెలుగుదేశం నేతగా మొదలైంది. చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే మొదలైంది. కాబట్టి ఆ లక్షణాలు ఎక్కడికీ పోవు. ఎన్టీఆర్‌ ఫీల్డ్‌లో వున్నంతవరకు, వెన్నుపోటుకు గురి కానంతవరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చాడు. కాని, చంద్రబాబు చేతిలోకి రాగానే 1996లో ఆయన చేసిన మొదటి పని కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం. 2009 ఎన్నికల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రధానపార్టీ కాబట్టి ఆయన ఆ పార్టీతో ఫైట్‌ చేస్తూ వచ్చాడు. 2014 ఎన్నికల నుండి సీన్‌ మారింది. రాష్ట్రంలో వైసిపి ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. ఇప్పుడాయన కాంగ్రెస్‌తో స్నేహం చేసినా ఇబ్బంది లేదు. తెలంగాణలో ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏతో డైవోర్స్‌ అయ్యింది. ఇక కలవక పోవచ్చు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు చంద్రబాబు మీద పగబట్టి వున్నారు కాబట్టి వాళ్ళు చేసేది చేయకమానరు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ఇంకో 5ఏళ్ళు కేసుల భయం లేకుండా గడపొచ్చు. ఆ దిశగానే చంద్రబాబు స్నేహ గీతం మారుస్తున్నట్లుగా సమాచారం.

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న, ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయం. నారా లోకేష్‌ ఒక పుస్తకం పట్టుకుని అటు ఇటు తిరుగుతూ... ''దివంగతులైన వారి పుట్టినరోజును జయంతి అనియు, మరణించిన రోజును వర్ధంతి అనియు'' అందరు... అని పదే పదే చదువుతున్నారు. లోకేష్‌ను చంద్రబాబు కుర్చీలో కూర్చుని బెత్తం పట్టు కుని చదివిస్తున్నాడు. అప్పుడే ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌బాబు లోపలకు వచ్చాడు. సార్‌, అబ్బాయి చదివి చదివి అలసిపోయినట్లున్నాడు. హెల్త్‌ డ్రింక్స్‌(బీరు) ఏమన్నా తెప్పించమంటారా? అని అడిగాడు. నీ డ్రింక్స్‌ ఏమీ అవసరం లేదు, గంటకోసారి వాళ్ళమ్మ బూస్ట్‌ అందిస్తుందిలే అని చంద్రబాబు చెప్పాడు. మళ్ళీ జవహర్‌ వుండి... లోకేష్‌బాబు... చదువుకునే రోజుల్లోనే ఇంత శ్రద్ధగా చదువుంటే ఏ ఐఏఎస్సో, ఐపిఎస్సో అయ్యుండేవాడయ్యా అని అన్నాడు. చంద్రబాబుకు ఆ మాటతో తిక్కరేగింది. చదువుకుని వుంటే ఐఏఎస్‌ అయ్యేవాడు, శ్రద్ధగా చదువుకోకపోబట్టి ఐఏఎస్‌లకు బాస్‌ అయ్యాడు... అని చెప్పాడు. వెంటనే జవహర్‌... దీన్నిబట్టి చదువుకోకపోవడమే మేలంటారా... మరి రాష్ట్రంలో ఇన్ని స్కూళ్లెందుకు, చదువుకోండని చెప్పి స్కాలర్‌షిప్‌ లెందుకు. మంచి ఫలితాలు రావాలంటూ అయ్యవార్ల మీద ఒత్తిళ్లెందుకు. చదువుకోకుంటే అందరూ మన లోకేష్‌బాబులాగా అభివృద్ధి చెందుతారు కదా అని చెప్పాడు. చంద్రబాబుకు కోపం అరికాల్లో కొచ్చింది. తమాయించుకుని నీతో ఈ సబ్జెక్ట్‌పై మళ్ళీ తాపీగా డిస్కషన్‌ చేస్తాను, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మీరు ఏదో ఫ్రెస్టేషన్‌లో ఉన్నట్లున్నారు, మీకు కూడా రెండు హెల్త్‌ డ్రింక్స్‌ పంపించమంటారా? రిలాక్స్‌ అవుదురు అని జవహర్‌బాబు అడిగాడు. చంద్రబాబు రెండు చేతులు జోడించి మీతో మళ్ళీ మాట్లాడుతానని పంపించేసాడు. అప్పుడే మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు వచ్చారు. వాళ్ళ ముఖాలు కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లాగా వెలిగి పోతున్నాయి. ఏంటి విషయం అని చంద్రబాబు అడిగాడు. దానికి నారాయణ... ప్రత్యేకహోదా ఉద్యమం విషయంలో మీరు పడుతున్న బాధ చూడలేకేమో, మన పవన్‌ కళ్యాణ్‌ గుంటూరులో మీటింగ్‌ పెట్టాడు. జగన్‌ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని డైవర్ట్‌ చేస్తాడు. జగన్‌ అవినీతి మీద విమర్శలు చేస్తాడు. దాంతో వైకాపా వాళ్ళు హోదా ఉద్యమాన్ని వదిలేసి పవన్‌ను తిట్టడానికి మళ్ళుకుంటారు. మీకు ఏ సమస్యా వుండదు అని చెప్పాడు. చంద్రబాబు వెంటనే డిజిపి ఆఫీసుకు ఫోన్‌ చేసాడు. పవన్‌ కళ్యాణ్‌ మీటింగ్‌కు వెంటనే పర్మిషన్‌ ఇవ్వాలని ఆదేశించాడు. తర్వాత మంత్రులు ముగ్గురితో... పవన్‌ సభకు ఏర్పాట్లు చూడండి... స్టేజీ గట్టిగా వుండాలి. పవన్‌ మంగళగిరిలో మాట్లాడితే వెంకటగిరిలో వినిపించేలా మైక్‌సెట్లు ఏర్పాటు చేయండి, అన్ని జిల్లాల నుండి కార్యకర్తలు రావడానికి బస్సులు, కార్లు ఏర్పాటు చేయండి, జనం తగ్గే పరిస్థితి వుంటే మన కార్యకర్తలను కూడా తరలించండి, జన సమీకరణకు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేయండి, మందు, బిర్యాని సప్లయ్‌ చేయండి... ఈ మీటింగ్‌తో జగన్‌కు దిమ్మ తిరగాలి... మన 'చంద్రజ్యోతి', 'ఈరోజు' టీవీ 9-9=99, ఏసిడిటి, నంగి టీవీ, టీవీ 2.5లకు కూడా సమాచారమివ్వండి... అన్ని టీవీలలో పవన్‌ సభ ప్రత్యక్ష ప్రసారం కావాలి. పత్రికలలో పవన్‌దే బ్యానర్‌ ఐటమ్‌గా రావాలి. పవన్‌ మనోడే అంతా మంచిగా జరిగిపోవాలి అని చెప్పాడు. అలాగే చేస్తాం సార్‌ అంటూ నారాయణ, పత్తిపాటి,

ఉమలు అక్కడ నుండి లేచారు.

్య్య్య్య్య

మంగళగిరిలోని కాజా వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ. పవన్‌ వేదికెక్కాడు. అభిమానులు కేరింతలు కొట్టారు. టీవీలన్నీ ఆ సభను ప్రత్యక్షప్రసారం చేయసాగాయి. పవన్‌కళ్యాణ్‌ చొక్కా జేబులో నుండి ఓ పేపర్‌ తీసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఆవేశంతో మాట్లాడసాగాడు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. 2019 ఎలక్షన్‌లలో జగన్‌ను ఓడించడానికి నియోజకవర్గానికి పాతిక కోట్లు లెక్కన ఖర్చు పెడతారట. ఇన్ని కోట్లు వీళ్ళకు ఎక్కడనుండి వచ్చాయి. ఇది అవినీతి సొమ్ము కాదా? లోకేష్‌ అవినీతి చంద్రబాబుకు కనపడడం లేదా?... అంటూ చంద్రబాబు మీద, ఆయన కొడుకు లోకేష్‌ మీద తీవ్ర విమర్శలు చేసాడు. చంద్రబాబు అనుకూల ఛానెల్స్‌ అన్నీ కూడా ఇది ఆయన కాన్సెప్ట్‌లో భాగమేననుకుని మక్కీకి మక్కీ లైవ్‌ ఇచ్చాయి. టీవీలలో పవన్‌ ప్రసంగం చూసి చంద్రబాబు షాక్‌ తిన్నాడు. ఈ పవన్‌కు ఏమైంది... ఎందుకిలా జరిగింది... ఎందుకు అతను అడ్డం తిరిగాడు... ఇదే ఆలోచనతో ఆందోళన చెందసాగాడు.

్య్య్య్య్య

సభ ముగించుకుని పవన్‌ తన ఇంటికి వచ్చాడు. అప్పుడే ఫోన్‌ రింగయ్యింది. ఆన్‌ చేసాడు. అవతల నుండి చంద్రబాబు... ఏం పవన్‌ నీకు ఏం తక్కువ చేసామని మా మీద విరుచుకుపడ్డావ్‌, నువ్వు అడిగినట్లే అన్నీ చేస్తున్నాం కదా, మరి మామీద ఎందుకు అన్ని విమర్శలు చేసావ్‌ అని నిష్టూరంగా అడిగాడు. దానికి పవన్‌... అదేంటి సార్‌, మీరు పంపించిన స్క్రిప్టే కదా నేను చదివింది అని అన్నాడు. ఆ మాటకు బాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. నేను ఆ స్క్రిప్ట్‌ పంపడమేంటి.. జగన్‌ను తిడుతూ వ్రాసిన స్క్రిప్ట్‌ కదా నీకు పంపించింది అని చంద్రబాబు అన్నాడు. అప్పుడు పవన్‌ ఆలోచనలో పడ్డాడు. సినిమా స్టైల్‌లో రివర్స్‌ లోకి వెళ్ళాడు.

్య్య్య్య్య

ప్రత్యేకహోదాపై పవన్‌ ఏర్పాటు చేసిన జెఎఫ్‌సి సమావేశానికి

ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జయప్రకాశ్‌నారాయణ, చలసాని శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. మీటింగ్‌ అయ్యాక అందరూ హడావిడిగా లేచారు. ఆ లేవడంలో ఉండవల్లి, పవన్‌లు ఒకరికొకకరు గుద్దుకుని వారి చేతుల్లోని ఫైళ్ళు ఎదురెదురుగా కిందపడ్డాయి. అలా ఇద్దరూ వంగి తీసుకోవడంలో ఉండవల్లి ఫైల్‌ పవన్‌ చేతిలోకి, పవన్‌ ఫైల్‌

ఉండవల్లి చేతిలోకి వచ్చింది. చంద్రబాబును తిట్టడానికి ఉండవల్లి వ్రాసుకున్న స్క్రిప్ట్‌ అలా పవన్‌ చేతుల్లోకి వెళ్ళి గుంటూరు సభలో తూటాలా పేలింది.

్య్య్య్య్య

ఫ్లాష్‌బ్యాక్‌లో విషయం అర్ధం కావడంతో పవన్‌ నాలుక్కరుచుకుని... పొరపాటు జరిగింది చంద్రబాబు గారు, పొరపాటున ఉండవల్లి స్క్రిప్ట్‌ను చదివేసాను, ఈసారి అలా జరగనివ్వనులే అని అన్నాడు. ఇక జరిగేదే ముంది... జరగాల్సింది జరిగిపోయింది. ఉండవల్లి నీ పక్కన చేరినప్పుడే అనుకున్నాలే... ఇలాంటిదేదో వుంటుందంటూ చంద్రబాబు విసురుగా ఫోన్‌ కట్‌ చేసాడు.

tdp logoఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి వాటి ప్రభావాన్ని బీజేపీ మీదకు తోసేయవచ్చు. రెండోది పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల నుండి ఇక తెలుగు తమ్ముళ్ళే పోటీ చేయవచ్చు. అది లోక్‌సభ అయినా, శాసనసభ అయినా, జడ్పీటీసీ అయినా, మున్సిపల్‌ వార్డు మెంబర్‌ అయినా!

ప్రతి ఎన్నికలలోనూ పొత్తులో భాగంగా బీజేపీకి ఒకటి, అరా సీట్లివ్వడం, ఆ పార్టీ ఓడిపోవడం జరుగుతూ వస్తోంది. 1985లో టీడీపీ-బీజేపీ పొత్తుకు బీజం పడింది. ఆ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆత్మకూరు సీటిచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా వెంకయ్యనాయుడే ఓడిపోయాడు. 1989ఎన్నికల్లోనూ మళ్ళీ పొత్తు ధర్మంగా ఆత్మకూరునే ఆ పార్టీకిచ్చారు. ఈసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి కర్నాటి ఆంజనేయరెడ్డి గెలిచినంత పనిచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు తెగిపోయింది. మళ్ళీ 1999 ఎన్నికల్లో కలిసారు. ఆ ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యే టి.రమేష్‌రెడ్డికి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నెల్లూరు సీటును బీజేపీకి ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా డేగా నారసింహారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పతనం అప్పుడే మొదలైంది. మళ్ళీ 2004 ఎన్నికల్లోనూ పొత్తులో భాగంగా నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు నెల్లూరు అసెంబ్లీ సీటును, అలాగే ఆత్మకూరు అసెంబ్లీ సీటును బీజేపీకివ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో మూడు చోట్లా పరాభవమే! 2009 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకున్నా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నెల్లూరురూరల్‌ సీటును సీపీఎంకు ఇవ్వడం తెలిసిందే! ఇక్కడా సీపీఎం ఓడిపోయింది. 2014 ఎన్నికలకొచ్చే సరికి మళ్ళీ బీజేపీతో పొత్తు ముడిపడిపోయింది. ఈసారి తిరుపతి లోక్‌సభ, నెల్లూరురూరల్‌ అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. రెండు చోట్లా పరాజయమే!

ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీలో వున్న ఆశావహులను పక్కనపెడుతూ బీజేపీకి సీట్లిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు రావడంతో ఆ సమస్య లేదు. ఆ పార్టీకి సీట్లిచ్చే పని లేదు. కాబట్టి తెలుగుదేశం నాయకులకే ఆ సీట్లు దక్కనున్నాయి.

రాజకీయములందు..ఓట్ల రాజకీయములు వేరయా!.. అన్నట్లు ఇప్పుడు కొత్తగా కర్నాటకలో రాజకీయాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల రాజకీయాలను రసవత్తరంగా నడిపేందుకు ఉరకలు వేస్తోంది. కర్నాటకలో బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, మతపరమైన మైనార్టీ హోదాను కల్పించే 'వ్యూహం'పై అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా కర్నాటకలో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెరలేపినట్లయింది. కర్నాటక మంత్రివర్గం లింగాయత్‌ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిసూ తాజాగా చేసిన తీర్మానం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు ప్రారంభం కావడంతో సర్వత్రా రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఎందుకంటే కర్నాటకలో లింగాయత్‌లు రాజకీయంగా ఎంతో ప్రధానమైన పదవుల్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు పదిహేనేళ్ల పాటు లింగాయత్‌లే అక్కడ ముఖ్య మంత్రులుగా ఏలారు. అంత ప్రాభవ వైభవాలు లింగాయత్‌లకు ఉన్నాయి. జనాభాలో సుమారు 17 శాతం దాకా ఉన్న లింగాయత్‌లు దాదాపు నూరు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే, లింగాయత్‌ సామాజిక వర్గాన్ని మతంగా గుర్తిస్తూ వారికి మత పరమైన మైనార్టీ హోదాను కల్పించాలన్న రిటైర్డ్‌ జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌ కమిటీ సిఫారసులకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, దానిని త్వరలో కేంద్రానికి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి సంతోషిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లింగా యత్‌లు సంబరాలు చేసుకుంటున్నారు కూడా. అయితే, వీరశైవులు మాత్రం ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణలు కూడా జరిగాయి. ఏదేమైనా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కర్నాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తదుపరి మరింత విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు కూడా కర్నాటక ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే, లింగాయత్‌లు-వీరశైవుల ఈ రిజర్వేషన్ల విధానానికి బిజెపితో సహా పలు హిందూ సామాజికవర్గాలు తొలి నుంచి దూరంగానే ఉంటున్న నేపథ్యంలో, తాజాగా కర్నాటకలో సిఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ బిజెపి విమర్శల బాణాలను ఎక్కుపెట్టింది. రాజకీయ అవసరాల కోసం కర్నాటక ప్రభుత్వం కులాలను, మతాలను విభజిస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సిద్ధరామయ్య నిప్పుతో చెలగాట మాడుతున్నారని, ఇది మంచిది కాదని బిజెపి హితవు పలుకుతోంది. అసలు వీరశైవులు- లింగాయత్‌లు ఒకటేనని, ఈ రెండు సామాజికవర్గాలు హిందూత్వంలో భాగమేనని, అయితే కర్నాటక ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు వీరిని విడగొడుతున్నారని, ఇదంతా కర్నాటకలో కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకమే అని బిజెపి దుయ్యబడుతోంది. ఇదిలావుంటే, చాలా కాలంగా లింగాయత్‌లు ప్రత్యేక మతంగా లింగాయత్‌లను గుర్తించాలంటూ కోరుకుంటూనే ఉన్నారు. దీంతో వారికి మతపరమైన మైనార్టీ హోదాను ఇవ్వాలన్న అంశం కూడా ఎంతోకాలంగా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు సమీపించిన సందర్భంగా ఈ అంశం లేవనెత్తడం వల్ల తమకెంతో మేలు జరుగుతుందనేది కాంగ్రెస్‌ రాజకీయం. అక్కడి ముఖ్యమైన నేత యడ్యూరప్ప కూడా లింగాయత్‌ సామాజికవర్గానికి చెందినవారే కనుక, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, దీంతో ఇటు యడ్యూరప్పను, అటు బిజెపిని కూడా దీనిద్వారా దెబ్బకొట్టవచ్చన్నది కాంగ్రెస్‌ వ్యూహం. అందువల్ల హటాత్తుగా లింగాయత్‌లకు ప్రత్యేక మతం పేరుతో మైనార్టీ అంశాలను అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అసలు వీరశైవులు, లింగాయత్‌లు ఒక్కటేనని, అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని మరోవైపు అఖిలభారత వీరశైవ మహాసభ సూచిస్తోంది. అయితే, కొంతమంది మాత్రం కేవలం లింగాయత్‌లకు మాత్రమే ఆ తరహా హోదాను ఇవ్వాలని పట్టుబడు తున్నారు. రాష్ట్రంలో 17శాతం దాకా ఉన్న లింగా యత్‌-వీరశైవ లింగాయత్‌లకు మతపరమైన హోదాను ఇవ్వవచ్చు అని నాగమోహన్‌దాస్‌ కమిటీ సూచించడంతో ఆ మేరకు గుర్తింపునిచ్చేందుకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తహతహలాడుతోంది. అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమి టంటే, ఈ విషయంలో కర్నాటక క్యాబినెట్‌ నిర్ణయం తుది నిర్ణయమేమీ కాదు. ఆ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదముద్ర కావాలి. బిజెపికి ఆ ప్రతిపాదన తొలినుంచి ఇప్టం లేదు కనుక అది ఎటూ అమలు జరగదు. ఆ విషయం కర్నాటక ప్రభుత్వనేతలకు తెలియనిదేమీ కాదు. ఎందుకంటే ఈ ప్రతిపాదనను తొలినుంచి బిజెపి వ్యతిరేకిస్తోందని, అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కావాల్సింది కూడా ఇదే. తాను అడిగినట్లు ఉండాలి..అడిగినా అవతలివారు కాదన్నట్లు ఉండాలి. తాము ఇస్తామన్నా కేంద్రం ఒప్పుకోలేదని చెప్పుకున్నప్పుడే ఓట్లు అటు నుంచి ఇటువైపుకు వచ్చి రాలుతాయన్నది...వ్యూహం. ఇదీ కాంగ్రెస్‌ రాజకీయం. తీరా ఇవన్నీ ప్రజల్లోకి వచ్చేసరికి ఇందులో ఎంతవరకు ఏ పార్టీవారి మాట నెగ్గుతుందో చూడాలి. ఈ అంశంలో ఇరుకునపడినట్లున్న బిజెపి ఆ పీటముడి నుంచి బయటపడడానికి మరొక వ్యూహంతో పావులు కదుపకుండా ఉంటుందనుకోలేం. అయినా, ఎన్నికలు వస్తున్నాయంటే ఒక్క కర్నాటకలోనే కాదు, దాదాపు దేశమంతటా ఇలాంటి రాజకీయాలే!.. కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు ఏనాటికీ మంచివి కావు. ఎవరైనా సరే, నేతలు ఏ పార్టీ వారైనా సరే ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్గుగా కార్యాలు నిర్వర్తించాలే తప్ప ఓట్లకు తగ్గట్టుగా నిర్ణయాలు చేయడం తగదు!... ఇలాంటి రాజకీయాలు చివరికి ఎలాంటి ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే.

chandra sekharకొందరు అధికారులు చెత్తశుద్ధితో పని చేసి సొంత ఆదాయాన్ని పెంచుకుంటారు. ఇంకొందరు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతారు. తన పనితీరుతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు నిబంధనలు అతిక్ర మించిన వాహనదారులపై కొరడా ఝళి పిస్తున్న ఆ అధికారే తడ చెక్‌పోస్టు ఎంవిఐ అల్లూరు చంద్రశేఖర్‌రెడ్డి. విధుల పట్ల అంకిత భావం గల అధికారి.

తడ చెక్‌పోస్టు అంటే అందరిలో ఒక అభిప్రాయం వుంది. దీనిని చాలామంది అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా భావిస్తుంటారు. ఏదైనా అధికారి పనితీరును బట్టే అది లంచాల వసూలు కేంద్రమా లేక నిబంధ నలు అతిక్రమించిన వారి తాటతీసే కేంద్రమా అన్నది ఋజువవుతుంది.

చంద్రశేఖర్‌రెడ్డి తడ చెక్‌పోస్టు రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టాక ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి వాహనాల రాకపోకలు సాగించడం ఆగిపోయింది. అధిక లోడుతో వెళుతున్న వాహనాలు గాని, అనుమతులు లేని వాహనాలు గాని ఆయన కన్ను గప్పి పోలేవు. అధికలోడ్‌తో వెళుతున్న వాహనాలకు అధికంగా జరి మానాలు విధించారు.

గతంలో తడ చెక్‌పోస్టు ఎప్పుడూ లంచాల రూపంలో వార్తల్లో ఉండేది. అలాంటిది ఈ ఏడాది ఎవిఐ చంద్రశేఖర్‌ రెడ్డి కృషి ఫలితంగా జరిమానాల వసూ లులో రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. రాష్ట్రంలో దాదాపు 15చోట్ల సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి. తడ చెక్‌పోస్టుకు ఈ ఆర్ధిక సంవత్సరానికి 14కోట్లు లక్ష్యం విధించగా గడువుకు ముందే చంద్రశేఖర్‌ రెడ్డి దానిని అధిగమించారు. రాష్ట్రంలో ఎంవిఐలందరికంటే తడ ఎంవిఐకే నెలకు 20.50లక్షల టార్గెట్‌ ఇచ్చినా ఆయన ఆ లక్ష్యాన్ని దాటి ముందుకెళ్ళారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడం గొప్ప కాదు. తడ చెక్‌పోస్టు వద్ద ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకుం డానే ఆయన లక్ష్యాన్ని దాటగలిగారు. తడ చెక్‌పోస్టులో ఇద్దరు ఎంవిఐలు ఉండాల్సి వుండగా, ఆయన ఒక్కరే వున్నారు. 9మంది అదనపు ఎంవిఐలు ఉండాలి. కాని ఇద్దరే వున్నారు. 24మంది హోంగార్డు లుండాల్సిన చోట 5మందే వున్నారు. ఇక బారికేడ్స్‌ లేవు, వే బ్రిడ్జి లేదు, ఎలక్ట్రిక్‌ సౌకర్యాలు లేవు. ఇవన్నీ లేకున్నా కృషి పట్టుదలతో ఎంవిఐ చంద్రశేఖర్‌రెడ్డి టార్గెట్‌ సాధించారు. ఈ నెల మొదటి రెండు వారాలలోనే ఆయన నిబంధనలు అతిక్రమించి వెళుతున్న వాహనాలకు 84 లక్షల పెనాల్టీ వేసారంటే పనిలో ఎంత దూకుడు చూపిస్తున్నాడో అర్ధమవుతుంది. వెల్‌డన్‌ చంద్రశేఖర్‌రెడ్డి.

karuvuజిల్లాలోని మెట్ట ప్రాంతాలు కరువు వాతపడ్డాయి. ఒకవైపు నీటి కొరత, మరోవైపు అకాల వర్షాలతో పంట పొలాలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్టలో చెరువులు దొరువుల్లో చుక్కనీరు లేక సేద్యం కుదేలైపోయింది. అప్పుల పాలై రైతన్నలు లబోదిబోమంటున్నారు. సాగునీటి వసతులు అంతంతమాత్రంగానే వుండడంతో ఎంతగా కష్టించి పనిచేసినా పంటలు సక్రమంగా పండక మెట్ట రైతులు పడే అవస్తలు అన్నిన్ని కావు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని అనేక మండలాలు కరువుతో విలవిల్లాడుతున్నా ప్రభుత్వం అన్నదాతల గోడును పట్టించుకోకపోవడం విచారకరం.

ప్రతి ఏడాదీ జిల్లాలోని మెట్ట ప్రాం తాలు కరువుతో అల్లాడుతూనే ఉన్నాయి. లేదంటే అకాల వర్షాలు వచ్చి కొంప ముంచి పోతున్నాయి. గత కొద్ది సంవత్స రాలుగా వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తులు మెట్ట ప్రాంతాల రైతులను అప్పుల సుడిగుండంలోకి నెడుతున్నాయి. అటు సాగునీరు లేక, ఇటు తాగునీరుకు కూడా కష్టాల పాలవుతున్నా రైతుల ఇబ్బం దులను పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరం. ఇక్కడ భూముల్లో అధికశాతం వర్షాధార భూములే. వరుణుడి కరుణ ఉంటే తప్ప ఇక్కడ చేలల్లో పంటలు పండవు. బోర్లు, బావుల కింద పంటలు సాగుచేసుకునే రైతుల పరిస్థితి కూడా దాదాపు అంతే. భూగర్భజలాలు అడు గంటిపోవడంతో పంటపొలాలకు చుక్క నీరు అందక రైతులు దిగాలుపడిపోయారు. సుమారు నాలుగువందల అడుగుల లోతుకు బోరు వేసినా నీటి చుక్క అందక పోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మూగజీవాలకు తాగేందుకు కూడా నీరు దొరక్కపోవడంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా ఎండకు ఎండిన నేలలే తప్ప పచ్చదనం అన్నది కనిపించడం లేదు. కొండలు గుట్టలన్నీ వెదికినా మూగ జీవాలకు గడ్డి దొరకడం లేదు. పాడిపశువులున్న రైతులు ఆ మూగజీవాలను ఎలా కాపాడుకోవాలో తెలియక కంటనీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ కరువులో పంటలు పండక సేద్యానికి చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది నిరుపేద రైతులు సతమతమవుతున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకో వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పొలాల్లో పనులు లేకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న వ్యవసాయ కూలీలు ఇక్కడ పనులు లభించక, ఉన్న ఊరు వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని పనులున్న చోటికి వలసలు పోతున్నారు. మెట్ట చుట్టూ కరువు కమ్మేయడంతో ఈ ప్రాంతాల్లో వేసిన వరి తదితర పైర్లన్నీ అత్యధికశాతం నిలువునా ఎండిపో యాయి. ఒక్క ఉదయగిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోనే వరి సాగు సాధారణ విస్తీర్ణం 3,815 హెక్టార్లుంటే, ఇందులో వరిపంట సాగైంది కేవలం 358హెక్టార్లలో మాత్రమే. ఇదీ దుస్థితి. దీంతో వరి రైతుల కష్టాలకు అంతేలేదు. వరితో పాటు అనేక ప్రాంతాల్లో వేసుకున్న మొక్కజొన్న, జొన్న, రాగి, మినుము తదితర పంటలు కూడా వానలు లేక ఎండిపోయాయి. పండ్ల తోటలు కూడా ఈసారి కనీవినీ ఎరుగని నష్టాలకు గురయ్యాయి. నీరు లేక బత్తాయి, మామిడి, నిమ్మ తదితర తోటలన్నీ ఎండి పోవడంతో రైతన్న కన్నీటిపర్యంతం అవు తున్నాడు. ప్రభుత్వం జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 10 మండలాలలను కరువు మండలాలుగా ప్రకటించిందే తప్ప, కరువు కాటుకు గురైన ఆయా మండలాల్లోని రైతుల స్థితిగతులను అసలు పట్టించుకోవడం లేదు. ఆదుకునే వారు లేక రైతుల జీవన పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇకనైనా కరువు బారిన పడిన మెట్ట ప్రాంత రైతు లను ఆదుకునేందుకు తక్షణచర్యలు తీసు కోవాలని రైతులు కోరుతున్నారు.

కన్నీట ముంచిన...అకాలవర్షాలు

ఒకవైపు నీటిచుక్క లేక, అదనుకు వానలు కురవక పొలాలు ఎండిపోయి రైతులు బాధపడుతుతన్న తరుణంలో, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు ఆయా ప్రాంతాల రైతులను కన్నీట ముంచాయి. కోతకు వచ్చిన పంట భారీవర్షానికి నీట మునిగిపోవడంతో రైతులు కన్నీట మునిగిపోయారు. ఈ నెల 16వ తేది అర్ధరాత్రి దాటాక నాయుడుపేట, వెంకటగిరి, ఓజిలి, మనుబోలు, పెళ్ళకూరు, దొరవారిసత్రం, ఓజిలి తదితర మండలాల్లో అకాల వర్షాలు కురిశాయి. రెండురోజుల పాటు కురిసిన ఈ వర్షాల వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. అనేకచోట్ల పంటలు దెబ్బతినడంతో పాటు, కల్లాల్లో ఆరబెట్టుకుని ఉన్న ధాన్యం కూడా నీటమునిగిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సుమారు 2800 టన్నుల ధాన్యం నీటమునిగి ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ అకాల వర్షాల వల్ల రైతాంగానికి కనీసం 48 కోట్ల దాకా నష్టం ఉంటుందని అంచనా. పంటచేలతో పాటు పండ్లతోటలకు కూడా అపారనష్టం కలిగింది. మామిడిపూత నేలరాలిపోవడంతో మామిడి రైతులు గోడుగోడుమంటున్నారు. అన్ని రకాల పంటలు ఈ అకాలవర్షాలకు అపారంగా నష్టానికి గురయ్యాయి. ప్రభుత్వం వెంటనే అటు కరువు బాధిత రైతాంగానికి, ఇటు అకాలవర్షాలతో నష్టపోయిన రైతాంగానికి చేయూతను అందించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఈ నష్టాల అంచనాలను ప్రభుత్వానికి నివేదించి సత్వరం అన్నదాతలను ఆదుకోవాల్సి ఉంది.

<p><span style="line-height: 17.6px;">

</span></p>

nmcనెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌ 75 వేలు, కమర్షియల్‌ 25వేలు, కాలువగట్లు, రైల్వే స్థలాల్లోని అసెస్‌మెంట్లు 11వేలు ఉన్నాయి. డబుల్‌ ఎంట్రీలు, నాట్‌ట్రేసింగ్‌ కింద మరో 5వేలు అసిస్‌మెంట్లున్నాయి. గత కొన్నేళ్ళుగా కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం రూ.4కోట్ల పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఈ ఏడాది రూ.33కోట్లు వసూలు చేసారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.33కోట్లు పన్నులు వసూలు చేయాల్సివుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.22కోట్లు మేర పన్నులు వసూలు కావాల్సి వుంది. గూడూరు మునిసిపాలిటీలో 11659, కావలిలో 21947, సూళ్ళూరుపేటలో 9258, నాయుడుపేటలో 10170, ఆత్మ కూరులో 7334, వెంకటగిరిలో 12000 అసెస్‌మెంట్లు ఉన్నాయి. దాదాపు రూ.36 కోట్లు పన్నుల వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.13కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. రెవెన్యూ అధికారులు పేద, మధ్య తరగతి ప్రజలు పన్నులు కట్టకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు తప్ప, బడాబాబుల జోలికి వెళ్ళడం లేదు. నెల్లూరు నగరంలో ప్రముఖ హోటళ్ళు, లాడ్జీలు, కమర్షియల్‌ భవనాలు పెద్ద మొత్తాలలో పన్ను బకాయిలు వున్నా, వారికి రాజకీయ నాయకుల పలుకుబడి ఉండడంతో అధికారులు వారి జోలికి వెళ్ళడం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్ళ గడువు ఈ నెల 31వ తేదీ నాటికి ముగియ నుంది. ఉన్నతాధికారులు రెవెన్యూ వసూళ్ళ పై సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాని పన్నుల వసూళ్ళలో సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడంతో వెనుకబడుతున్నారు. దీంతో మునిసిపాలిటిలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయి.

psyckoప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు మాదిరిగానే కనిపిస్తారు... అలాంటిదే ఇప్పుడు 'సైకో' భయం.

ఇటీవల కోవూరు పట్టణంలో ఒక సైకో ఉన్నట్లుండి దాడి చేయడం వంటి సంఘటనల ద్వారా ఎనిమిది మందిని గాయపరిచాడు. దాడి చేసి గాయపరచడం... పారిపోవడం చేస్తున్నాడు. పోలీసులు 'సైకో' కోసం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. అయినా దొరకలేదు. ఈలోపు 'సైకో' జ్వరం జిల్లా అంతటా పాకింది. ఈ జిల్లా లోని అన్ని పట్టణాలు, ఆఖరకు గ్రామాలలో కూడా 'సైకో' భయం నెలకొంది. ఆడవాళ్ళు ఒంటరిగా పోవాలంటే భయపడుతున్నారు. పసివాళ్ళు బయట ఆడుకోవా లంటే జంకుతున్నారు. వీధుల్లో చెత్త ఎరుకునేవాళ్ళను చూసినా, భిక్షమెత్తుకునే వాళ్ళను చూసినా... వీళ్ళేమన్నా 'సైకో'లా అనే ఫీలింగ్‌. ఈమధ్య కోవూరులో ఇదే ఫీలింగ్‌తో స్థానికులు మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని పట్టుకుని చావగొట్టారు. మొన్న నెల్లూరు శ్రీహరినగర్‌లో ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని చూసి ఓ మహిళ 'సైకో సైకో' అంటూ భయంతో కేకలు వేయడంతో అతను పారిపోయాడు. స్థానికులు, పోలీసులు కలిసి ఆ అజ్ఞాత వ్యక్తి కోసం గాలించారు.

పాతికేళ్ళ క్రితం నెల్లూరు జిల్లాలో ఓ పుకారు వ్యాపించింది. ఒక స్త్రీ వచ్చి అర్థరాత్రిళ్ళు తలుపు కొడుతుందని, తలుపు తీసి ఆమెను చూస్తే 'నెత్తురు' కక్కుకుని చనిపోతున్నారని... అప్పుడు ఈ భయంతోనే గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 'ఓ స్త్రీ రేపు రా' అంటూ రంగులతో వ్రాసేవాళ్ళు. అలాంటి వాతావరణమే ఇప్పుడు జిల్లాలో 'సైకో' మూలంగా నెలకొంది. వీలైనంత తొందరగా సైకోను పట్టుకుంటే గాని ఈ భయం నుండి జనం బయటపడరు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter