జాతీయ వార్తలు


నాకు పార్టీ తల్లిలాంటిది. నేను పార్టీని మించిపోయానని అందరూ అంటున్నారు. ఎవరైనా తల్లిని మించిపోగలరా..? గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలో మూడోసారి విజయం సాధించాక ఆనాడు ప్రమాణస్వీకారోత్సవ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలివి. ఆరోజు ఆయన మాటలు పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునేలా వున్నా, వాస్తవంగా మాత్రం ఆ గెలుపు మోడీ వ్యక్తిగత నాయకత్వ సమర్ధత మూలంగా దక్కిందే! పార్టీని ఆరోజు ఆయన మించిపోలేదు. కాని,…

Read more...

గత 24 సంవత్సరాలుగా వెంకయ్యకు తోడుగా ఆయన నీడగా నిత్యం ఆయనను వెన్నంటి వుండిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్‌ భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక అధికారిగా తన పదవికి రాజీనామా చేశాడు. తండ్రి లాంటి పెద్దాయనను వదిలి ఆయనిప్పుడు తల్లి లాంటి పార్టీ సేవకు శ్రీకారం చుట్టాడు. పార్టీకి సేవ చేయాలి, పార్టీ కోసం పరితపించాలి అన్న సత్య మనోగతాన్ని గమనించిన భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అక్టోబర్‌…

Read more...

భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాక మొదటిసారిగా నెల్లూరు ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు 4వ తేదీ నెల్లూరుజిల్లా పర్యటనకు విచ్చేసారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆగస్టు 5వ తేదీ నెల్లూరులో జరిగిన 'మన వెంక్యయకు ఆత్మీయ అభినందన' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్ళీ నెల్లూరొచ్చారు. విజయవాడ నుండి విమానంలో తిరుపతిలో దిగి, అక్కడనుండి ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌లో శ్రీహరికోటలోని షార్‌సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో…

Read more...

ఉపరాష్ట్రపతి అంటే రబ్బర్‌స్టాంప్‌... ఆయనకు ఏమీ పని వుండదు... గుళ్ళకు గోపురాలకు తిరగడం తప్ప! ఉపరాష్ట్రపతిని చేసి ఆయన నోరు కట్టేసారు... ఆ పదవిలో కూర్చోబెట్టి ఆయన కాళ్లను కుర్చీకి కట్టేసారు... ఇంతకాలం దేశంలో ఉపరాష్ట్రపతి పదవిలో వున్న వారిపై ప్రజల్లో వున్న అభిప్రాయమిది. మన నెల్లూరీయుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక కూడా అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాని అందరూ వేరు... వెంకయ్యనాయుడు వేరు. పదవి…

Read more...

బెంగుళూరులోని ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ ఈనెల 5వ తేది రాత్రి హత్యకు గురయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటిబయట నిల్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ఆమెకు అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి దుర్మరణం పాలయ్యారు. ఈ హత్యోదంతం బెంగు ళూరులో సంచలనం సృష్టించింది. బెంగు ళూరు మహానగరంలో ఇలా ఒక మహిళా జర్నలిస్ట్‌ను అత్యంత దారుణంగా…

Read more...

చాలా ఏళ్ళ తర్వాత రాకెట్‌ ప్రయోగాల పరంపరలో ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి-సి39 రూపంలో పరాజయం ఎదురైంది. ఆగస్టు 31వ తేదీ శ్రీహరికోట లోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి39 విఫలమైంది. రాకెట్‌ మూడు దశలను విజయవంతంగా అధిగమించి 4వ దశ జరుగుతున్న సమయంలో రాకెట్‌ నుండి ఉపగ్రహం విడిపోక పోవడంతో ప్రయోగం విఫలమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.…

Read more...


దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వెలుగులు కళ్ళు జిగేల్‌ మనిపించాయి. తెలుగు పంచెకట్టు ఆకట్టుకుంది. తెలుగు భాషకు, తెలుగు యాసకు వెలుగులిచ్చిన తెలుగు తల్లి వరపుత్రుడు, నెల్లూరు ముద్దుబిడ్డ మన ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతిగా కొలువుదీరారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10.45గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, వెంకయ్య నాయుడు చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు భారత ప్రధానమంత్రి నరేంద్ర…

Read more...


ఆయన ఎమ్మెల్యేగా నెల్లూరుకొచ్చాడు, ఎంపీగా ఎన్నోసార్లొ చ్చాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాడు, జాతీయ అధ్యక్షుడిగా కూడా వచ్చాడు... ఆఖరకు కేంద్రమంత్రిగా నెల్లూరులో ఎన్నిసార్లు అడుగుపెట్టాడో లెక్కేలేదు. అవన్నీకూడా ఒక పార్టీకి పరిమితమైన పర్యటనలే! అవన్నీ కూడా రాజకీయ పరమైన కార్యక్రమాలే! ఇంత కాలం రాజకీయాలలో వున్న ఒక కోణం అభిమానాన్నే ఆయన చవి చూసారు. కాని, తొలిసారిగా రాజ్యాంగాధిపతి హోదాలో అన్ని కోణాల నుండి ప్రజల అభిమానాన్ని ఆస్వాదించారాయన!…

Read more...


ఆరడుగుల ఆజానుబాహుడు.. అడ్డ పంచెకట్టుతో అలరించే తెలుగువాడు... ఆంధ్రనాట విరిసిన కమలనాథుడు... అసెంబ్లీ టైగర్‌గా ప్రసిద్ధింగాంచినవాడు... అందరూ అభిమానించే నాయకుడు... అద్భుతమన్పించే మాటల మాంత్రికుడు... ఎవరు... ఎవరు... ఇంకెవరు... మన నెల్లూరు ముద్దుబిడ్డడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆధునిక భారత రాజకీయ రంగాన మెరుస్తున్న నెల్లూరు ధృవతార వెంకయ్యనాయుడు. నెల్లూరీయులు మా వెంకయ్య అని చెప్పుకుని గర్వించే స్థాయికి ఎదిగిన నాయకుడు. వెంకయ్య ఉన్నతిని చూసి, ఆయన ప్రస్థానాన్ని చూసి నెల్లూరీయులు…

Read more...


Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter