నెల్లూరులో నేడు (168)

modiప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన జిల్లాలోని శ్రీహరికోట షార్‌ సెంటర్‌కు రానున్నట్లు తెలు స్తోంది. భారీ రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 630కోట్ల వ్యయంతో షార్‌లో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని(సెకండ్‌ వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌)ను ఆయన ప్రారంభించనున్నారు. భవిష్యత్‌లో ప్రతి ఏటా 12రాకెట్‌ ప్రయోగాలు జరపాలని ఇస్రో నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే రెండో వాహన అనుసంధాన భవనాన్ని నిర్మించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి వుంది.

chandrababuఈ నెల 8వ తేదీన నవ నిర్మాణ దీక్ష ముగింపు సభ కోసం నాయుడుపేటకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు వారాలు తిరక్కముందే మళ్ళీ నెల్లూరొస్తు న్నారు. 'దళిత తేజం - తెలుగుదేశం' ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 30న నెల్లూరులో జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. దీనికి విఆర్‌సి గ్రౌండ్‌, ఏ.సి స్టేడియంలను కాదని బాలాజీనగర్‌ శివారులో వున్న శ్రీ వేణుగోపాలస్వామి కాలేజీ మైదానాన్ని ఎంపిక చేసుకున్నారు. అదయితే హైవే ఆనుకుని వుంటుంది కాబట్టి ట్రాఫిక్‌కు ఇబ్బంది వుండదు. ఈ ముగింపు సభను లక్షమందితో జరపాలనుకుంటున్నారు. మరి నాయకులు ఎన్ని అగచాట్లు పడాలో ఇంతమంది జనాన్ని సమీకరించాలంటే!

vprనార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) ప్రతీ ద్వైవార్షిక వేడుకలలో అందజేసే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు ఈసారి ప్రముఖ దాత, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు, నెల్లూరీయుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అందుకోనున్నారు.

ఈ అవార్డు అందుకుంటున్న నెల్లూరీయు లలో ఈయన 4వ వాడు. 2012లో తొలి సారిగా 'నాటా' ఆవిర్భావ సభలో సుప్ర సిద్ధ శాస్త్రవేత్త ''చీస్‌'' రెడ్డిగా విఖ్యాతి గాంచిన మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ అవార్డు అందుకోగా, 2014లో రెండవ అవార్డు భారతీయ సినిమా గాయకుడు యస్‌.పి.బాలసుబ్ర హ్మణ్యంకు లభించింది. 2016లో మూడవ అవార్డు ''ఖైదీ'' సినిమా ద్వారా చిరంజీవికి సినీ భవిష్యత్తును ప్రసాదిం చిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని వరించింది. ఇప్పటివరకు అవార్డులు అందుకున్న ముగ్గురూ నెల్లూరీయులే కాగా, ఈసారి 2018కి గాను అవార్డు అందుకోబోతున్నది కూడా మన నెల్లూరీ యుడే కావడం గమనార్హం, గర్వకారణం కూడా. 2018 జూలై 6, 7, 8వ తేదీలలో అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రం, ఫిలడల్‌ఫియా నగరంలో జరగనున్న ''నాటా'' 'ద్వైవార్షిక మహాసభ'లలో మూడవరోజు జూలై 8వ తేదీ జరగబోయే ముగింపు సభ వేదికపై నుండి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ అవార్డును అందు కోనున్నారు.

మొదటి నుండి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి అంటే చాలా ఇష్టం. వై.యస్‌. కూడా ప్రభాకర్‌రెడ్డిని అంతే అభిమానించేవాడు. యాదృచ్ఛికమో లేక భగవత్‌ సంకల్పమో తెలియదు కాని వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపిక కావడం, అదే యేడాది ''నాటా జీవిత సాఫల్య పురస్కారానికి'' ఆయన ఎంపిక కావడం ఆ అవార్డుని జూలై 8న డా|| వై.యస్‌. రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున అందుకోబోవడం నిజంగా ప్రభాకర్‌ రెడ్డికి వై.యస్‌.తో వున్న అనుబంధానికి చిహ్నంగా నిలుస్తుంది. అపరిమితమైన సేవా కార్యక్రమాలతో సేవకేదీ కాదు అనర్హం అన్నట్లుగా అన్ని రంగాలలో తన సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పిస్తూ నెల్లూరీయుల మనసుల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నాటా' ''లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు'' అందుకుంటున్న తరుణంలో 'లాయర్‌' అభినందనలు.

balu birtగానగంధర్వుని పుట్టిన రోజంటే..పాటకు పండుగ రోజే. భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు, విశ్వవిఖ్యాత గాయకుడు, నెల్లూరు ముద్దుబిడ్డ..మన గానాలపట్టి.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్ర హ్మణ్యం (యస్‌పి బాలూ) జన్మదినోత్సవ వేడుకలు ఈనెల 4న నెల్లూరు పురమరదిర ప్రాంగణంలోని ఆరుబయటవేదికపై అద్వితీయంగా జరిగాయి. పాటల కోయిలమ్మ జానకమ్మ ఈ వేడుకకు విచ్చేసి బాలూని ఆశీర్వదించడం, తన ఉజ్వలభవితకు తొలి ఆశీస్సులందించిన జానకమ్మకు బాలూ సాష్టాంగ ప్రణామం చేసి తన కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని అందజేయడం, తన మాతృమూర్తి శకుంతలమ్మ నుంచి బాలూ ఆశీస్సులందుకోవడం.. వేదికంతా ఆత్మీయతలు వెల్లివిరిసినట్లయింది. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు విచ్చేసి బాలూతో, జాన కమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం విశేషం. ఇదే సందర్భంలో జానకమ్మ జీవితచరిత్రను లఘుచిత్రంగా ప్రదర్శించడం ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. అంతేకాక, రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర'యోగా'త్మక నృత్యరూపక ప్రదర్శన.. ఈ వేడుకల్లో ఒక హైలైట్‌గా ఉండి... అందరి కరతాళధ్వను లందుకుంది.

తొలుత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేదిక వద్దకు రాగానే ప్రేక్షకుల్లో సంతోషం వెల్లివిరిసింది. బాలూ పుట్టినరోజు వేడుకలో తామూ పాల్గొంటున్నామన్న ఆనందం అందరిలోనూ కనిపించింది. శ్రీ విజేత ఆర్ట్స్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలు ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలూ మాట్లాడుతూ, తన పదహారేళ్శ వయసులో 1960-63 ప్రాంతాల్లో గూడూరు కాళిదాస కళానికేతన్‌ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు, ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకి తనను మంచి గాయకుడివవుతావని దీవించారని అన్నారు. మాతృసమానురాలైన ఆ చల్లనితల్లి దీవెనలే తనకు ఇంతటి ఉన్నతస్థానాన్ని తెచ్చాయని బాలూ విన మ్రంగా తెలిపారు. సినీరంగంలో జానకమ్మ పాటలు అద్వితీయమైనవని అంటూ, ఎవరూ పాడలేని ఎంతో కష్టమైన పాటలను కూడా ఆమె అలవోకగా పాడగల దమ్మున్న గాయని అని ఆయన కొనియాడారు. జానకమ్మ ఆశీస్సులు తననెంతగానో ఉన్నతస్థాయికి తీసుకువచ్చాయని, అందుకు కృతజ్ఞతగా సన్మానం చేయాలనుకున్నా ఆమె అంగీకరించకపోవడంతో నమస్కారాన్నే ఆమెకు సత్కారంగా అందజేస్తున్నా నన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలాంటి అవార్డులు స్వీకరించడం లేదు కనుక, తనపేరిట ఆమెకు ఇవ్వ దలుచుకున్న అవార్డు మొత్తం లక్షరూపాయల నగ దును హైదరాబాద్‌లోని స్పర్శ ఆసుపత్రిలో ఆడియో థియేటర్‌ ఏర్పాటుకు అందజేసినట్లు బాలూ ప్రకటించారు. సంగీతం, సంస్కారం తన సహచరుల వద్ద నుంచి నేర్చుకున్నానని, వారందరి ఆశీస్సులతోనే తను ఇంతవాణ్ణయ్యానని ఆయన అన్నారు. తన గురువు కోదండపాణి పెట్టిన గానభిక్ష వల్లే తాను సినీపరిశ్రమల్లో 53 ఏళ్ళుగా ప్రయాణం సాగిస్తు న్నానన్నారు. మన పరిసరాలను కాపాడుకోవాలని, 'స్వచ్ఛభారత్‌'ను అందరూ అనుసరించాలని బాలూ ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలూ కుటుంబసభ్యులతో పాటు, మురళీకృష్ణ70 ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు, విజేతా ఆర్ట్స్‌ గౌరవ ఉపాధ్యక్షుడు ఎంవిఎస్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి వై.శేషగిరీశం, కార్యవర్గసభ్యులు ఎస్‌.సుబ్బారావు, వై.విశ్వనాధ్‌, వి.చంద్రశేఖర్‌, డా.ఎం.సుబ్రహ్మణ్యం, జి.ఆదిశేషు, కె.అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలూకు 'తథాస్తు దేవతల' దీవెనలూ ఉన్నాయి - ఎస్‌.జానకి

గానకోకిల ఎస్‌ జానకి మాట్లాడుతూ, తాను ఎలాంటి పురస్కారాలు స్వీకరించడానికి ఇక్కడికి రాలేదని, బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు కనుక బాలూను ఆశీర్వదించడానికే వచ్చానని అన్నారు. తాను ఆశీర్వదించినందువల్ల మాత్రమే బాలసుబ్రహ్మణ్యంకు ఇంతటి ప్రఖ్యాతి రాలేదని, ఆయన అసాధారణ ప్రతిభే ఆయనో గొప్పగాయకుడిగా రాణించడానికి దోహదం చేసిందన్నారు. బాలూకు ఉన్న తెలివితేటలు, అదృష్టం అన్నీ కలసివచ్చి ఇంతటి స్థాయి లభించిందన్నారు. పట్టుదల, కృషి, మంచి జ్ఞాపకశక్తి ఇవన్నీ బాలూ ప్రతిభకు నిదర్శనాలన్నారు. అయితే తాను ఆశీర్వదించినప్పుడు, బహుశా తథాస్తు దేవతలు కూడా తధాస్తు అనడం వల్ల బాలూ గొప్ప గాయకుడై ఉంటారని ఆమె నవ్వుతూ అన్నారు. గాయకునిగానే కాక, సంగీత దర్శకునిగా, డబ్బింగ్‌ కళాకారునిగా, నటునిగా ఆయన విభిన్న వైశిష్ట్యాలతో ప్రేక్షకులందరినీ మెప్పించారని ఆమె ప్రశంసించారు. సంగీతదర్శకులు చెప్పిన స్వరాలను, వారు ఊహించినదానికంటే గొప్పగా పాడే ప్రతిభాపాటవాలు బాలూకు ఉన్నాయన్నారు. ఆయనకున్న స్వరజ్ఞానం, సంగీతపరిజ్ఞానం అపారమన్నారు. బాలూ సంగీతదర్శకంలోనూ తానెన్నో పాటలు పాడానని, ఆ పాటలు అద్భుతంగా ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గానప్రస్థానాన్ని వివరించారు. సినీరంగంలో తొలుత తనకు విషాదభరితమైన పాటలు పాడే అవకాశమే లభించిందని, అయితే పుట్టిన బిడ్డ బాగా ఏడ్చిన తర్వాతే జీవితంలో నవ్వుతూ రాణిస్తుంది కనుక, తాను కూడా అదేవిధంగా భావించి ఆ పాటలు పాడి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నానన్నారు.

అబ్బురపరచిన ప్ర'యోగా'త్మక నృత్యరూపకం

తొలుత రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర'యోగా'త్మక నృత్యరూపక ప్రదర్శన ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్వితీయమైన..అపురూపమైన యోగవిన్యాసాలు జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, పవిత్రమైన గంగానదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాపాడుకోవాలని, స్వచ్ఛభారత్‌ను పాటించాలనే అంశాలను సూచిస్తూ అత్యద్భుతంగా చేసిన యోగా విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు అర్ధగంటకు పైగానే ఈ సాహసవిన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అనంతరం అందరూ ఆ యోగ విన్యాసకులను అభినందిస్తూ చేసిన కరతాళధ్వనులతో పురమందిర ప్రాంగణం మార్మోగింది.

ఇదంతా సాంబమూర్తిగారి పుణ్యమే - విఏకె రంగారావు

బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన భారతీయ సినిమా గాయకునిగా ఎదగడానికి కారణం ఆయన తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తిగారి పుణ్యమేనని, నెల్లూరుతోనూ, బాలూ, జానకమ్మలతో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ సంగీత సాహిత్య నృత్య విశ్లేషకులు విఏకె రంగారావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

సంగీతం భగవంతుని భాష - భువనచంద్ర

సంగీతం అనేది భగవంతుని భాష అని, నెల్లూరు నుంచి ఆ సంగీత ప్రవాహం గంగోత్రి ప్రవాహంలా సాగి అందరినీ అలరిస్తోందని బాలూ-జానకమ్మల పాటల ప్రస్థానాన్ని ప్రముఖ సినీకవి భువనచంద్ర ఈ సందర్భంగా వివరించారు.

పాటకు పుట్టినరోజు - వెన్నెలకంటి

ఎస్పీ బాలు పుట్టినరోజు అంటే పాటకు పుట్టిన రోజని, ఇది తెలుగుపాట పుట్టిన రోజని, భారతీయ పాట పుట్టిన రోజని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సినీకవి వెన్నెలకంటి అన్నారు. తనకు సినీపరిశ్రమలో చోటు కల్పించి తనకు అన్నివేళలా చేయూతనిచ్చింది బాలూగారేనని అంటూ, తనకు తల్లితండ్రి గురువు దైవం బాలూ గారేనన్నారు.

ఇదెంతో అపూర్వం... అదృష్టం - జిల్లా ఎస్పీ రామకృష్ణ

సంగీతరంగంలో ఎంతో సుప్రసిద్ధులైన ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. వారి పాటలు ఎంతో సుప్రసిద్ధమైనవన్నారు.

వారి స్వరం... మనకు వరం - తుంగా శివప్రభాత్‌రెడ్డి

బాలూ గంధర్వగానం, జానకమ్మ సమధుర స్వరం ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తుందని, వారి స్వరమే వారికో వరమని 'లాయర్‌' వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి అన్నారు. నిన్నటి తరం, నేటి తరం, భావితరం.. బాలూ, జానకమ్మల పాటలతో తరిస్తున్నారని అన్నారు. గానకోకిల జానకమ్మకు నెల్లూరు మెట్టిన ఊరని, ఫన్‌ డాక్టర్‌ చంద్రశేఖరం గారి కోడలుగా ఆమె నెల్లూరుతో తన అనుబంధాన్ని ముడివేసుకుందన్నారు. భారతీయసినిమా గాయకునిగా బాలూ తన ప్రఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటుకుంటున్నారని, సింహపురికి ఇదెంతో గర్వకారణమని అన్నారు.

బాలూ... అందరికీ ఆదర్శం - విద్యాసాగర్‌

వర్ధమాన సంగీతకారులందరికీ బాలూ ఆదర్శమని, ఆయనకున్న సంగీత పరిజ్ఞానం అమోఘమని ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ అన్నారు. పెద్దలను, చిన్నారులను సైతం గౌరవించే తత్వం బాలూ గారి నుంచి నేర్చుకోవాలన్నారు.

cm chandrరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన నెల్లూరుకు రానున్నారు. ఆరోజు మహా సంకల్ప సభ పేరిట నెల్లూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. అలాగే గ్రామదర్శిని పేరుతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలో మరికొన్ని గ్రామాలలోనూ పర్యటించే అవకాశాలున్నాయి. 8వ తేదీ ఆయన పర్యటన వుందని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్‌ మాత్రం ఇంకా రాలేదు.

janaki baluనెల్లూరు గానాలపట్టి, భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు యస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సంబరం జూన్‌ 4న నెల్లూరు టౌన్‌హాల్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఆడి టోరియం నందు జరుగనుంది.

తన జన్మదినం సందర్భంగా ఆయన ప్రతియేటా ఇస్తున్న ''యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం'' మరియు లక్ష రూపాయల నగదు బహుమానం ఈ ఏడాది పాటల కోకిలమ్మ యస్‌.జానకికి ఇవ్వాలని నిర్ణయించి ఆమెను సంప్రదించినప్పుడు ఆమె అత్యంత సున్నితంగా తిరస్కరించారు. సన్మానాలు, సత్కా రాలు, పురస్కారాలకు తాను చాలా దూరంగా వుంటున్నానని, బాలు గారిపైనున్న అవ్యాజమైన ప్రేమాభిమానాలకు గుర్తుగా నెల్లూరుకు వచ్చి ఆ వేదికపై నుండి ఆత్మీయ ఆశీర్వచనం అందిస్తానని చెప్పారు. తనకివ్వదలచిన పురస్కారాన్ని ఏదైనా సమాజసేవా కార్యక్రమానికి వినియోగించమని ఆమె బాలు గారిని ఆదేశించారు. ఈ సందర్భంగా యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆమెను గౌరవించుకుంటారు, ఆమె ఆశీస్సులు అందుకుంటారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యస్‌.పి.బాలు మాట్లాడుతూ 1960-63ప్రాంతాల్లో తాను గూడూరు కాళిదాస కళానికేతన్‌ నిర్వహించిన పోటీల్లో పాటలు పాడానని, ఆ పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా విచ్చేసిన ప్రముఖ సినీగాయని ఎస్‌.జానకి మాట్లాడుతూ, తనను దగ్గరకు పిలిచి బాగా ప్రయ త్నిస్తే మంచి గాయకుడివవుతావని ఆశీర్వదించిందని తెలియ జేశారు. మాతృ సమానురాలైన జానకమ్మ ఆశీర్వచనఫలంతో తాను విఖ్యాత గాయకునిగా ఇంత ఉన్నతస్థాయికి ఎదిగానన్నారు. ఇదంతా ఆ చల్లనితల్లి దీవెన లేనని అన్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీపరిశ్రమలో పాటలు పాడుతూ మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకున్నానని చెప్పారు. జానకమ్మ ఆత్మీయ ఆశీర్వచనాన్ని స్వీకరించేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. 'నా పాటను అభిమానించి నన్ను గాయకునిగా అత్యున్నతస్థాయికి చేర్చడమే గొప్ప ఆశీస్సు'.. అని బాలూ ఈ సందర్భంగా జానకమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ కళా విమర్శకులు విఏకె రంగారావు, సినీసంగీత దర్శకుడు విద్యాసాగర్‌, సినీకవి భువనచంద్ర, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌, లాయర్‌ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.జానకి జీవిత చరిత్రపై లఘుచిత్రం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సాంస్కృ తిక కార్యక్రమాల్లో భాగంగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటి ఆఫ్‌ నాలెడ్జ్‌ & టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే నూజివీడు త్రిబుల్‌ ఐ.టిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే సంగీతంతో కలిపిన యోగా నృత్యరూప కాలను ప్రదర్శిస్తారన్నారు.

police stationనెల్లూరు నగరంలో మొత్తం ఏడు పోలీస్‌స్టేషన్‌లున్నాయి. 1, 2, 3, 4, 5 నగర పోలీస్‌స్టేషన్‌లతో పాటు బాలాజీ నగర్‌, నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌లు ప్రత్యేకంగా వున్నాయి. కొన్ని పోలీసుస్టేషన్‌లు వున్న ప్రాంతానికి, వాటికి కేటాయించిన

పరిధి ప్రాంతానికి సంబంధం వుండేది కాదు. ఉదాహరణకు నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌నే తీసుకుందాం. స్టేషన్‌ వుండేది రైల్వేస్టేషన్‌ రోడ్డులో, నగరం చుట్టుపక్కల గ్రామాలు ఈ స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. స్టేషన్‌ నుండి ఒక్కో ఊరికి పది నుండి పాతిక కిలోమీటర్ల దాకా దూరం ఉంటుంది. అది కూడా ఒక దిక్కయితే ఫరవాలేదు. నాలుగు దిక్కులా వుంటాయి. రాఘవ సినీ కాం ప్లెక్స్‌ ఏరియా నాలుగో నగరస్టేషన్‌కు దగ్గర. ఇది వన్‌టౌన్‌ పరిధిలో వుంటుంది. ఏదన్నా సంఘటన జరిగితే పోలీసులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకునేలా ఆయా పోలీస్‌స్టేషన్‌లు పరిధిలోని ప్రాంతాలుండాలి.

ఈ దిశగానే కొంత కసరత్తు జరిపి నగరంలోని పోలీసు స్టేషన్లను పునర్విభజన చేసాడు జిల్లా ఎస్పీ రామకృష్ణ. ముందు పోలీసుస్టేషన్‌లకు నెంబర్లు తీసేసాడు. వన్‌టౌన్‌ను చిన్నబజారు పోలీసుస్టేషన్‌గా, టూటౌన్‌ను నవాబుపేట పోలీసుస్టేషన్‌గా, త్రీ టౌన్‌ను సంతపేట పోలీసుస్టేషన్‌గా, ఫోర్త్‌టౌన్‌ను దర్గామిట్ట పోలీసు స్టేషన్‌గా, ఐదోటౌన్‌ను వేదాయపాలెం పోలీసుస్టేషన్‌గా, ఆరో నగర పిఎస్‌ను బాలాజీ నగర్‌ పోలీసుస్టేషన్‌గా మార్చారు. ఆయా ప్రాంతాల పరిధిలలో కూడా మార్పులు చేసి ఈ స్టేషన్‌లకు కలిపారు.

vemal baviనెల్లూరు, దర్గామిట్టలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వున్న వేమాలశెట్టి బావి సత్రం స్థలం మరోసారి వివాదంలో కెక్కింది. మంగళవారం రాత్రి ఈ స్థలంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వివాదానికి దారితీసింది. విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు వేమాలశెట్టి బావి సత్రం స్థలం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మంత్రి నారాయణకు ఈ విషయం తెలిసి తన అనుచరుడు పట్టాభి పైనే కారాలు మిరియాలు నూరినట్లు తెలుస్తోంది. ఇదెంతో సెన్సిటివ్‌ విషయం. ఒక కులం వారి మనోభావాలకు సంబం ధించిన అంశం కావడంతో జరిగిన సంఘటనపై మంత్రి కూడా తత్తరపాటుకు గురయ్యారు. పట్టాభి చేసిన పని వల్ల ఆర్యవైశ్యుల్లో తనపై వ్యతిరేకత వస్తుందని మంత్రి ఆందోళన చెందారు.

ఈ స్థలం మొత్తం 1.48 ఎకరాలు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో వుంది. గతంలో 4ఎకరాలకు పైనే వుం డగా చాలా భాగం ఆక్రమణలకు గురైంది. ఇప్పుడున్న స్థలంలో కూడా శబరి శ్రీరామ క్షేత్రం వాళ్ళు శ్రీరామ స్థూపం నిర్మించారు. ఇక్కడే శనీశ్వరుని విగ్రహం ప్రతిష్టించాలని చాలాకాలం క్రితమే విగ్రహం తెచ్చి పెట్టారు. అయితే నగరానికి చెందిన ఆర్య వైశ్యులు ఈ స్థలం తమ పూర్వీకులకు చెందినదని, అందులో వాసవి మాత గుడి కట్టాలని పట్టుబట్టారు. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఈ స్థలం స్వాధీనానికి ఆర్యవైశ్యులు ప్రయత్నించడం, అప్పట్లో దేవాదాయశాఖ అడ్డుకోవడం, అప్పటి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆర్యవైశ్యులకు మద్దతుగా నిలిచి ఈ స్థలంలో వాసవిమాత గుడికి పూజ నిర్వ హించడం జరిగింది. ఈ గుడి నిర్మాణానికి ఆర్యవైశ్యులు ఒక కమిటీని కూడా వేసు కుని, గుడి, కళ్యాణ మండపానికి స్కెచ్‌లు కూడా గీయించారు. అయితే ఆ తర్వాత రోశయ్య సీఎంగా దిగిపోవడం, ఈ స్థలం వివాదం కోర్టులో వుండడంతో వాసవి మాత గుడి నిర్మాణం అసలు మొదలే కాలేదు. అప్పటినుండి ఇప్పటిదాకా ఈ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. శబరి శ్రీరామక్షేత్రం వాళ్ళు మాత్రం ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను జరుపు తుండేవాళ్ళు. ఇప్పుడు అకస్మాత్తుగా వేమి రెడ్డి పట్టాభి రంగంలోకి దిగి శనీశ్వరుని విగ్రహాన్ని లేవనెత్తడంతో మళ్లీ వివాదం మొదలై రాజకీయ రంగు పులుముకుంది.

kali flatఖాళీ స్థలాలను..ప్లాట్లను ఏళ్ళ తరబడిగా పట్టించుకోకుండా..అలా ఖాళీగానే వదిలేయడం వల్ల ఇరుగుపొరుగు జనానికి ఇక్కట్లు మొదలవుతున్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్ళ పొదలు పెరిగిపోవడం, దోమలకు, కుక్కలు..పందులకు, విషసర్పాలకు ఆవాసం కావడం అనేకచోట్ల జరుగుతూ ఉంది. దీంతో నగరమంతా దుర్గంధంతో గబ్బుకొట్టి పోతోంది. ఇళ్ళమధ్యల ప్లాట్లతోపాటు, పరిసరాలన్నీ కుళ్ళు కంపుకొడుతున్నాయి.

నెల్లూరు నగరంలోని అనేక వీధులు, అనేక ప్రాంతాల్లో ఇళ్ళకోసం తీసుకున్న స్థలాలు, లేదా ప్లాట్లు కనిపిస్తుంటాయి. ఆ స్థలాల్లో ఇళ్ళు కట్టుకునేందుకు కారణాంతరాల వల్ల స్థల యజమానులకు వెసులుబాటు లేకపోవడంతో అనేకచోట్ల అవి ఎంతోకాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. అక్కడ ఇళ్ళు కట్టుకునేందుకు తగు అర్ధిక వసతులు లేకపోవడం వల్లనో, లేదా మంచి ధర వస్తే విక్రయించుకోవచ్చనో ఇలా రకరకాల కారణాల వల్ల వాటిని అలా వదిలేస్తుండవచ్చు. అయితే, ఆ ప్లాట్లను చాలామంది అలా ఖాళీగానే వదిలేయడం వల్ల, సంవత్సరాలు గడుస్తున్నా వాటి అతీగతీ పట్టించుకోకపోవడం వల్ల ఇరుగుపొరుగు వారికి సమస్యలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇదే సమస్య చాలాచోట్ల ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఎంతోకాలంగా తిష్టవేసుకుని కూర్చుని ఉన్న పెద్ద సమస్య ఇది.

ఎక్కడ చూసినా గబ్బు గబ్బు!

ఈ ఖాళీ ప్లాట్లు అనబడు స్థలాల్లో కొన్ని చోట్ల సంబంధిత యజమానులు మాత్రం శ్రద్ధ తీసుకుని తమ స్థలాల్లోకి పశువులు, పందులు రాకుండా గేట్లు పెట్టడం, మంచి పూలచెట్లు నాటి వాటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటి పనులు చేస్తుండడం అభినందనీయం. అంతా గబ్బుగబ్బుగా మారి, మురుగుదిబ్బల్లా ఉన్న ప్లాట్లలోకి అడుగుపెట్టాలంటేనే భయం. దూరం నుంచి చూసి ముక్కు మూసుకోవాల్సిందే తప్ప లోపలికి వెళ్ళే దారే ఉండదు. మురుగుగుంటల్లా మారిన ప్లాట్లు.. దోమలకు ఇళ్ళుగా మారిపోయాయి. ఈ ఖాళీస్థలాలు లేదా ప్లాట్లు వాటికి భలే దొరికాయి. ఈగలు దోమలతో పాటు, పశువులు, పందులు, కుక్కలు..ఎలుకలు, చుంచులు.. నలికీసులు.. ఇలా నానారకాల కీటక జంతుజాలమంతా ఆ ప్లాట్లలో యదేచ్ఛగా విహరిస్తుంటాయి. అక్కడే సందుచూసుకుని రకరకాల పాములు కూడా కాపురం పెడుతున్నాయి. కట్లపాములు, నాగుపాములు, జెర్రిపోతులు వంటి విషసర్పాలు కూడా జొరబడుతున్నాయి. వీటన్నిటికీ మన నిర్లక్ష్యమే మంచి ఆవాసం కల్గిస్తోందని చెప్పవచ్చు.

ఖాళీ ప్లాట్లా!..డంపింగ్‌యార్డ్‌లా?!....

ఈ ఖాళీప్లాట్లు రానురాను చెత్తదిబ్బలుగా మారుతున్నాయి. ఖాళీప్లాటు కనిపిస్తే చాలు..ఇక ఇరుగుపొరుగు చెత్తకు కొదవుండదు. కొన్నిచోట్ల ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా తమ ఇళ్ళలోని చెత్తనంతా శుభ్రంగా ఊడ్చి, ఖాళీగా ఉంది కదా.. అని ఇతరులకు చెందిన ఈ ఖాళీప్లాట్లలోనే కుమ్మరించేస్తుంటారు. దీంతో అలా ఆ ఖాళీ ప్లాట్లు జనానికి అనధికారిక డంపింగ్‌యార్డుల్లా మారిపోతున్నాయి.

ఆ చెత్త... తిరిగి మన నెత్తిమీదికే...

కొంతమంది సందు దొరికింది కదా అని..తమ ఇళ్ళలోని చెత్తాచెదారాన్ని, పనికిరాని ఆహారపదార్ధాలు వగైరాలన్నిటినీ భద్రంగా ప్లాస్టిక్‌కవర్లలో చుట్టి మూటగట్టి ఖాళీప్లాట్లలోకి విసిరేస్తుంటారు. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్‌ల మధ్యలో ఓ ఖాళీస్థలం దొరికితే చాలు, జనానికి పండగ. ఇంట్లో ఉన్న చెత్తనంతా హాయిగా అక్కడ కుమ్మరించేస్తుంటారు. ఆ చెత్తంతా రోజూ కుప్పలు తెప్పలుగా ఆ ఖాళీస్థలాల్లో పడి, మురిగిపోయి కుళ్ళు కంపు కొడుతుంటుంది. చివరికి ఆ మురుగు గబ్బునంతా పీల్చాల్సింది ఆ చుట్టుపక్కల ఉన్న జనమే కదా?.. మన ఇంట్లో చెత్తనంతా ఖాళీప్లాట్లలో పోసేస్తే..మన చెత్తను మన నెత్తిన మనమే వేసుకున్నట్లేనని మనం అర్ధం చేసుకోవాలి.

మీ ప్లాట్లు బాగుంటే.. మేము బాగున్నట్లే...

ప్లాట్ల యజమానులు కూడా అవి 'మా స్థలాలు..మా ఇష్టం' అనే ధోరణితో కాక, ప్రజారోగ్యం కోసం అప్పుడప్పుడూ వాటి బాగోగులను పట్టించుకోవాలి. ఎందుకంటే ఆ ప్లాట్లు బాగుంటే మన ఆరోగ్యం బాగున్నట్లే. మీ ప్లాట్ల పరిశుభ్రతే..మా ఆరోగ్య భాగ్యం అంటున్నారు జనం. అందువల్ల మన చుట్టూ ఉన్న పరిసరాలు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవాలి. కనుక, మీరూ ఒకసారి మీ ఖాళీప్లాట్లు, స్థలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ... మీ ఆలోచనల మేరకే వాటిని సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దుకొని పరిసరాలను-పరిశుభ్రతను పరిరక్షిస్తారని ఆశిద్దాం!...

vprఈ నెల 19, 20 తేదీలలో నెల్లూరు, కనుపర్తిపాడులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో వికలాంగులకు ఉచిత వైద్య శిబి రాన్ని నిర్వహిస్తున్నారు. 19వ తేదీ రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ఆయన జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 19వ తేదీ ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్ర మానికి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగాను, నెల్లూరు గ్రామీణ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ విశిష్ఠ అతిథులుగాను విచ్చేయనున్నారు. వికలాంగులు, కాళ్ళు లేని వారిని నిపుణులచే పరీక్షించి వారికి ఉచితంగా జైపూర్‌ ఫుట్స్‌ను అమరుస్తారు. శ్రీ భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయ సమితి హైదరాబాద్‌ వారి సహకా రంతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తుంది. వికలాంగులు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జెరాక్స్‌ కాపీలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్‌ఫోటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. వివరాలకు 7680944389, 8885831414 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Page 1 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter