సంపాదకీయం


'ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం' అనే బృహత్సంకల్పంతో పరోక్ష పన్నుల వ్యవస్థలో సంస్కరణలను లక్ష్యంగా తీసుకుని, ఏకరూపతను-పారదర్శకతను సాధించాలనే సదాశయంతో జీఎస్టీ విధానానికి రూపకల్పన జరిగింది. మూడు నెలల క్రితం మోడీ ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా దీనిని అమలులోకి తీసుకురావడం, స్వతంత్య్ర భారత చరిత్రలోనే తొలి బృహత్కరమైన ఆర్ధిక సంస్కరణగా జీఎస్టీకి శ్రీకారం చుట్టడం ఎంతైనా హర్షదాయకం. అయితే, ఈ పథకం ఇంకా బాలారిష్టాల దశను దాటకపోవడంతో జీఎస్టీ…

Read more...

అగ్రరాజ్యమైన అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల కనీవినీ ఎరుగని విధంగా ఓ ఉన్మాది జరిపిన కాల్పులకు 58 మంది బలయ్యారు. ఈ ఘటన ఎంతో ఘోరమైనది..దారుణమైనది కూడా. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా భావిస్తున్నారు. ఒకే ఒక్క దుర్మార్గుడు జరిపిన కాల్పుల్లో ఇంతమంది అమెరికన్లు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం.. తుపాకీగుళ్ళతో వందలాదిమంది గాయాల పాలుకావడం ఎంతో బాధాకరం. ఈ విషాద సంఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హాయిగా.. వీనులవిందైన…

Read more...

దుష్టుల దుష్ప్రచారాలను.. ఒక్కొక్కసారి కొందరు పొరపాటునో గ్రహపాటునో నమ్మితే నమ్మవచ్చు గాక. కానీ, అలాంటి మోసపు మాటలను, ప్రచారాలను అందరూ..అన్నివేళలా నమ్మరు. ఒక్కోసారి ఆ దుష్ప్రచారాలే బెడిసికొట్టి, దుష్టుల నోటికి తాళం పడుతుంది కూడా. ఇటీవల పాక్‌ విషయంలో జరిగింది ఇదే. అందులోనూ సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) వంటి ప్రపంచస్థాయి వేదికల మీద చెప్పే ప్రతి మాట ఎంతో నిష్పాక్షికంగా, నిర్మలంగా ఉండాల్సింది పోయి, అక్కడ కూడా భారత్‌పై విషం…

Read more...

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఫలానాది జరుగుతుందని అనుకుంటే అది జరక్కపోవచ్చు. అందరూ ఒకటనుకుంటే, అది జరగొచ్చు.. జరగకపోనూ వచ్చు. నిన్నటిదాకా గిట్టని వారే, తదుపరి క్షణం నుంచి ఆప్తులైపోవచ్చు. వెళ్ళిపోయిన పార్టీనుంచి మళ్ళీ తిరిగొచ్చి తప్పిపోయిన బిడ్డ తల్లి ఒడికి చేరినట్లుగా ఉందని సంబరపడనూ వచ్చు. ఇలాగే ఉంటాయి రాజకీయాలంటే. ఇలాంటి రాజకీయాలు రాజకీయాల్లో సర్వసాధారణం. తమిళనాడులో ఇవింకా జోరుగా ఉండడం అందరికీ తెలిసిందే. అక్కడివి క్షణక్షణ రాజకీయాలు.…

Read more...

మయన్మార్‌... ఇప్పుడొక పెద్ద సమస్య. ప్రపంచాన్నే కుదిపేస్తున్న జఠిల సమస్య. జాతి విద్వేషాలు పరాకాష్టకు చేరుకుంటే అక్కడ ఎంతటి విధ్వంసాలైనా జరుగుతాయని, చివరికి సామాన్య ప్రజలు తలదాచుకునేందుకు చోటు దొరకడం కూడా ఎంతో కష్టమవుతుందని చెప్పేందుకు..మయన్మార్‌ ఒక తాజా ఉదాహరణ. ఒకరిపట్ల ఒకరిపై విశ్వాసం, పరమత సహనం, శాంతి సామరస్యాలతో సహజీవనం వంటి మానవీయ భావనలు లోపిస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలుసుకునేందుకు.. మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లిమ్‌లు ఇప్పుడెదుర్కొంటున్న…

Read more...

ఇదెంతో శుభపరిణామం. గత కొన్ని రోజులుగా భారత్‌-చైనాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లామ్‌ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇరుదేశాలు ఆ మేరకు నిర్ణయించుకోవడంతో డోక్లామ్‌ సమస్య ఇక దూరమైనట్లే భావించవచ్చు. రెండు నెలల కిందట డోక్లామ్‌ వద్ద భారత్‌-చైనాల మధ్య తలెత్తిన వివాదం ఏ పరిణామాలకి దారితీస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు ఈ రెండు దేశాలకి మరింత కీలకమైనదే అయినప్పటికీ, భారత్‌-చైనాల మైత్రికి ఎలాంటి…

Read more...

జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి బలహీనతలను అలుసగా తీసుకుని గుర్మీత్‌సింగ్‌ అలియాస్‌ డేరాబాబా వంటి కిరాతక బాబాలు వస్తూనే ఉంటారు. ప్రజలను అడుగడుగునా వంచించే మోసగాళ్ళు, నయవంచన చేసే మాయగాళ్ళు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా, మనదేశంలో ఇలాంటి దొంగబాబాలకు కొదవే లేదు. నమ్మే అమాయకులుండగా, నమ్మించి నట్టేట ముంచడానికి ఎల్లవేళలా అలాంటి బాబాలు సిద్ధంగా తయారై ఉంటారు. ఇక కొంతమంది నాయకులైతే అలాంటి వంచక బాబాలకే సాష్టాంగపడుతుండడం…

Read more...


గత కొద్దిరోజులుగా మలుపులు తిరుగుతూ సంచలనాలు సృష్టిస్తున్న తమిళ'నాటకానికి' తెరపడింది. 'అమ్మ' జయలలిత మరణానంతరం తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల్లో మరో ప్రధానఘట్టం..కీలక దశలో విలీనరాజకీయాలకు స్వాగతం పలికింది. ఇప్పటిదాకా తమిళ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్న అన్నా డిఎంకె పార్టీలోని రెండు వర్గాలు ఏకం కావడంతో ఎట్టకేలకు ఒక అధ్యాయం ముగిసినట్లయింది. అయితే, ఈ తాజా విలీనం వెనుక ఢిల్లీలోని కమలనాధుల కీలకపాత్ర కూడా ఉందనే ప్రచారమూ జోరుగా ఉంది. దీంతో…

Read more...

''ఈ స్వాతంత్య్రదినం మనకెంతో ప్రత్యేకమైనది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సంవత్సరమిది. సబర్మతీ ఆశ్రమం, చంపారన్‌ సత్యాగ్రహాలకు 75 ఏళ్ళు, లోకమాన్య బాలగంగాధర తిలక్‌ 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని పిలుపునిచ్చి ఈ ఏడాదికి వందేళ్ళయ్యాయి. దేశప్రజలను ఒకటిచేసిన గణపతి ఉత్సవాలు మొదలై ఈ ఏడాదికి 125 ఏళ్ళయ్యాయి.1942-47 మధ్య దేశవ్యాప్తంగా ఐకమత్యం వెల్లివిరిసింది. ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తిని కనపరచాలి. 2022లో ఆ స్ఫూర్తిదీప్తిని…

Read more...


Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter