జిల్లా వార్తలు


పొలిటికల్‌ గేమ్‌లో అధికారులు అప్పుడప్పుడూ పావులుగా మారుతుంటారు. 'కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం' అనే సామెతకు అధికారులు అద్దినట్లు సరిపోతుంటారు. అధికారంలో వున్న నాయకుల మాటలు వింటే ప్రతిపక్ష నాయకులు తూర్పారబడతారు, వినకపోతే అధికారపార్టీ నాయకులు కక్షగట్టి అప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీలు చేయడం వంటివి చేస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలలో అధికారుల పరిస్థితి ఎప్పుడు కూడా అడకత్తెరలో పోకచెక్క మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి…

Read more...

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణలు తప్పితే జిల్లాలో ఎన్నికైన మిగతా 8మంది ఎమ్మెల్యేలు శాసనసభలోకి కొత్తగా అడుగుపెట్టినవాళ్ళే! 2014 అసెంబ్లీకి నెల్లూరుజిల్లా నుండి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,…

Read more...

ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశాన్ని వదిలి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం మనం త్వరలో చూడబోయే పెద్ద పొలిటికల్‌ సీన్‌! ఆనం వెళ్ళిపోతే ఆ నష్టమేంటో తెలుగుదేశం అధిష్టానంకు తెలి యాలి... ఆయన వైసిపిలో చేరితే వచ్చే లాభమేంటో ఈ పార్టీ అధిష్టానం గుర్తించాలి. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీని వదిలిపోయేది ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కడే కాదు, వైసిపిలో చేరేది ఆయనొక్కడే కాదు... ఆయన వెంట బలమైన మందీ మార్భలం…

Read more...

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే! వీటిలో వైసిపి సంస్థాగత లోపాల కారణంగా 2 సీట్లు పోయాయి. ఇక నెల్లూరు లోక్‌సభతో పాటూ నెల్లూరుజిల్లాలోని నాలుగు అసెంబ్లీలు కలిసి వున్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోవడం జరిగింది. ఈ సీన్‌ను…

Read more...

మనుక్రాంత్‌రెడ్డి... పుట్టింది పెరిగింది చదివింది అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే. ఆ తరువాత ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళి అక్కడ తానే స్వంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత కాలంలో హైదరాబాదులోనూ మరో సంస్థను స్థాపించి ఎంతోకొంత మందికి జీవనోపాధి కల్పిస్తూ సంతృప్తి పొందుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అయితే ఇప్పుడు మనుకి ఓ ఆలోచన పుట్టింది. మనకి జన్మనిచ్చిన భూమికి మనమేం చేస్తున్నామన్న తపన ఆ…

Read more...

నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్‌ను వీడి జగన్‌ వెంట నడిచారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది గొప్ప విషయమే! అంతకుముందే కోవూరు ఎమ్మెల్యేగా వున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం…

Read more...

ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్‌ పిలుపుమేరకు ఐదుగురు వైసిపి లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం తెలిసిందే! ఈ రాజీనామా లేఖలు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వద్ద పెండింగ్‌లో వున్నాయి. ఇంకో ఏడాదిలోనే దేశమంతా లోక్‌సభ ఎన్నికలు జరుగు తాయి. ఇప్పుడు ఈ ఐదుగురు రాజీనామాలు ఆమోదిస్తే ఆర్నెల్ల లోపు 5 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. మళ్ళీ ఆర్నెల్ల…

Read more...


ఆదర్శజీవి, ప్రజాపోరాటయోధుడు, సిపిఎం సీనియర్‌ నేత..జక్కా వెంకయ్య కన్నుమూశారు. ఉద్యమాలే ఊపిరిగా జీవితాంతం పేదల సంక్షేమం కోసం, పేదప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన అలుపెరుగని కృషి చేశారు.రాజకీయాల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా, ఆయన తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి రాసిచ్చి, పార్టీ ఇచ్చే గౌరవవేతనంతోనే జీవించారు. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా ఉంటూ ఆయన ప్రజాసేవా రంగంలో ఉత్తమనాయకునిగా..పేదల పక్షపాతిగా...ప్రజానాయకునిగా రాణించారు.…

Read more...

''ఈ గట్టునుంటావా... నాగన్న ఆ గట్టునుంటావా'' అన్న పాటలో మాదిరిగా నిన్నటి వరకు తన రాజకీయ పయనం ఎటువైపు అన్నది తేల్చుకోకుండా వున్న ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీని వీడడం ఖాయమని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా ఆయన హాజరు కాకపోవడం, ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పేరు లేకపోవడంతో ఇక ఆయన టీడీపీలో కొనసాగడం…

Read more...


Page 1 of 34

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter