babuఏం అనుభవం... ఎందులో అనుభవం...?

చంద్రబాబు అంటే ఆలోచనాపరుడు, మేధావి, పాలనాదక్షుడు, అన్నింటినీ మించి అనుభవధీశాలి. ఇదీ నాలుగేళ్ళనాడు జరిగిన ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రిగా చేసిన వారి ఆలోచన.

బాబుకి ఎందులో అనుభవముంది...

మానాభిమానాలు ప్రక్కనపెట్టి, తనకుమాలిన పనిలో వేలుపెట్టి 5కోట్ల ఆంధ్రుల పరువును తాకట్టుపెట్టి, పదేళ్ళ ఉమ్మడి పాలనకు సలాంకొట్టి అమరావతికి పారిపోయి రావడంలో అనుభవమా...?

ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపడంలో అనుభవమా?

మాయమాటలతో... మాంత్రిక లెక్కలతో తిమ్మిని బొమ్మిని చేసి చూపడంలో అనుభవమా...?

తాత్కాలిక భవనాలకు వందలకోట్లు ఖర్చుపెట్టడంలో అనుభవమా..?

వందల కోట్ల ప్యాకేజీలతో పక్క పార్టీవారిని ఆకర్షించడంలో అనుభవమా...?

నిన్నొక మాట, నేడొక మాట, రేపొక మాట చెప్పి, చెప్పిన మాటను ఎప్పటికప్పుడు మర్చిపోవడంలో అనుభవమా...?

గోరంతను కొండంత చేసి ప్రచారం చేసుకోవడంలో అనుభవమా...?

మనం సొంతంగా ఒక ఇంటిని కట్టు కుంటున్నాం... దాని వెనుక ఎంతటి ప్రణాళిక ఉంటుంది. ఎన్ని ఆలోచనలుంటాయి. ఆ ఇల్లు ఎన్నో తరాలకు ఉపయోగపడాలను కుంటాం... ఎన్నేళ్లో పటిష్టంగా వుండా లనుకుంటాం... ఆ ఇంటి గురించి ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తాం... అందు కోసం వాడే ప్రతి పైసాను ఎంతో జాగ్రత్తగా ఖర్చుపెడతాం. ఒక ఇంటి విషయంలోనే మనం భవిష్యత్‌ తరాల గురించి, డబ్బు ఖర్చు గురించి ఇంతగా ఆలోచిస్తే మరి ఒక రాజధాని నిర్మాణం విషయంలో, రాబోయే తరాలకు ఉపయోగపడే భవ నాల విషయంలో ఈ ముఖ్యమంత్రి ఎంత దూరదృష్టితో ఆలోచించాలి. ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి.

అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబుకు ఒక వ్యూహం, ఒక ఆలో చన, ఒక క్లారిటీ అన్నది లేకుండాపోయింది. సింగపూర్‌ లాంటిది కడతాడా? టోక్యో లాంటిది కడతాడా? బీజింగ్‌ వంటిది కట్టాలనుకుంటున్నాడా? దావోస్‌ లాంటి దేమన్నా ప్లాన్‌ చేస్తున్నాడా? ఇంతవరకు ఆయనకే స్పష్టత లేదు. ఏ దేశానికి పోతే ఆ దేశం పేరు ఎత్తుతాడు. ఏ నగరంలో వుంటే అమరావతిని ఆ నగరంలానే నిర్మిస్తామంటాడు.

నాలుగేళ్ళుగా అలాంటి రాజధాని, ఇలాంటి రాజధాని అంటూ డబ్బా కొట్టు కోవడం తప్పించి వాస్తవానికి అక్కడ పొడి చిందేమీ లేదు. చంద్రబాబు టెంపరరీ ఆలోచనలకు తగ్గట్లే టెంపరరీ భవనాలు... అసెంబ్లీ చూస్తే టెంపరరీ... సచివాలయం చూస్తే తాత్కాలికం... ఆఖరుకు హైకోర్టు కూడా టెంపరరీనే నట... ఈ తాత్కాలిక భవనాల నిర్మాణానికే వేలకోట్లు తగలేస్తు న్నారు. చదరపు అడుగు 8వేల రూపా యల కాంట్రాక్ట్‌తో(రికార్డ్‌ రేటు) కట్టిస్తు న్నారు. టెంపరరీ భవనాలకు ఇన్ని కోట్లు తగలేసే బదులు ఆ నిధులతోనే శాశ్వత భవనాలు కట్టొచ్చు కదా? వందలు, వేల కోట్లు పెట్టి టెంపరరీ భవనాలు కట్టేబదులు పక్కా ప్లానింగ్‌తో తెలుగుతనం ఉట్టిపడే డిజైన్‌లతో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టి అవి పూర్తయ్యే వరకు తాత్కాలికంగా మూతపడే స్థితిలో వున్న ఇంజనీరింగ్‌, ఇతర కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పరిపాలన సాగించవచ్చు కదా?

అసలు పదేళ్ళు ఉమ్మడి రాజధానిని వదిలి అమరావతికి పారిపోయి రావలసిన అవసరమేమొచ్చింది...? తాను వేసిన తప్పుటడుగుని కప్పిపుచ్చుకోవడానికి నవ్యాంధ్రకు పారిపోయి వచ్చి, కేంద్రం ఇచ్చిన చిల్లర ప్యాకేజీలను మొత్తం టెంప రరీ కట్టడాలపైన ధారపోసేశాడు. కనీసం రెండేళ్ళైనా హైదరాబాదులోనే వుండి వుంటే ఆ రెండేళ్ళలో అద్భుతమైన శాశ్వత భవనాలు నిర్మించుకుని వుండొచ్చు. ఇలా వందల కోట్లు దుబారా చేసే ఖర్మ పట్టి వుండేది కాదు. తాను చేసిన ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు.

బాబు అనుభవశాలి అంటూ ఆయ నను నెత్తికెక్కించుకున్న నవ్యాంధ్ర ప్రజలు ఆయన చేస్తున్న టెంపరరీ పనులు తుంటరి పనులు చూసి అయ్యో ఈ అనుభవశాలిని అందలమెక్కించి మనం అనుభవిస్తున్నామే అని వాపోయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు ఏమి చేసినా టెంపరరీయే. ఏది చేపట్టినా టెంపరరీనే! చివరకు ఆయన సీఎం పదవి కూడా టెంపరరీనే అవుతుందేమో... చూద్దాం!

babuఆయన వేగంగా నడుస్తాడు... ఆయన వేగంగా పని చేస్తాడు... ఆయన కదలికలు వేగంగా వుంటాయి. ఆయన ఆలోచనలు వేగంగా వుంటాయి. ఏపిని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌లో వుంచాలన్నది ఆయన తాపత్రయం. ఏపిని ఆయన ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాడు... కాని ఈ రాష్ట్రం అక్కడిదాకా పోదు... ఇక్కడే వుంటుంది. కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిపోయింది. ఆయన వేగంగా ముందుకెళ్ళబట్టే దేశంలోనే ధనిక సీఎంల జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంకును సాధించాడు. ఆ విధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలపలేకపోయినా అత్యధిక సంపన్నుల సీఎంల జాబితాలో తాను మాత్రం మొదటి స్థానంలో నిలిచాడు.

ఇటీవల ఏడిఆర్‌ అనే సంస్థ నిర్వ హించిన సర్వేలో 177కోట్ల ఆస్తులతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం లోని 31మంది సీఎంలలో టాపర్‌గా నిలిచాడు. త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్‌ చివరి స్థానాన్ని దక్కించు కున్నాడు. రాష్ట్ర విభజనతో ఏపి ఆర్ధికంగా దెబ్బతింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పడిపోయాయి. ఈ సమయంలో చంద్రబాబు సంపద మాత్రం పెరిగింది. ఈ కిటుకేదో ప్రజలకు చెబితే వాళ్ళు ఆయన మార్గాన్నే అనుసరిస్తారు కదా! ఆస్తులపరంగా సీఎం నెంబర్‌వన్‌లో వుండి, అభివృద్ధిపరంగా రాష్ట్రం వెనుకబడిపోతే అది చంద్రబాబుకే నామోషీ అవుతుంది కదా!

chandruluజిల్లాలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెల కొనడం తెలిసిందే! జిల్లాలో ఎక్కడా పూర్తి స్థాయిలో చెరువులు నిండిన దాఖలాలు లేవు. ఈ దశలో ఎగువ జిల్లాల్లో కురిసిన వర్షాల మూలంగా సోమశిలకు 50 టిఎంసీలకు పైగా నీళ్ళు రావడం తెలిసిందే! వర్షాభావ పరిస్థితుల వల్ల గత ఏడాది జిల్లాలో రెండో పంట లేకుండాపోయింది. ఈసారి పంటకైనా నీళ్ళుంటాయా లేదా అని సందేహిస్తున్న పరిస్థితుల్లో సోమశిలకు నీళ్ళు రావడం, సోమశిల, కండ్లేరు ఆయకట్టు క్రింద రైతులు ఆనందంగా పంటలు వేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఐఏబి సమావేశంలోనూ 5లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.

అయితే అధికారికంగా 5లక్షల ఎకరాలకే అని చెప్పినా అనధికారికంగా మరో రెండు లక్షల ఎకరాల వరకు రైతులు నీళ్ళను వాడుకుంటుంటారు. సోమశిల, కండ్లేరులలో నీటిని సాగునీటి అవసరాలకే కాకుండా చెన్నై, తిరుపతిలకు పంపించాలి. జిల్లాలో తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. డెడ్‌స్టోరేజ్‌లో కొంత పెట్టాలి. పైర్లు కోత కొచ్చే దశలో నీళ్ళు లేకపోతే చేతికొచ్చే పంటను కోల్పోయే పరిస్థితి... ఈ పరిస్థితిని వూహించే జిల్లా మంత్రి, వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇటీవల జన్మభూమి పర్యటనకు కోడూరుపాడు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాడు. ఆయన సానుకూలంగా స్పందించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద నుండి సోమశిలకు 5.5టీఎంసీల నీటి విడుదలకు సీఎం ఆదేశించాడు. సోమిరెడ్డి కృషితో ఈ పంటను గట్టెక్కించినట్లే!

Page 1 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
  జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
 • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
  దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
 • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
  రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter