nandyalపదిహేడు వేల ఇళ్ళు...

ఆటోనగర్‌లో వేలాది మందికి స్థలాల రిజిస్ట్రేషన్లు...

10వేల సంఖ్యలో మహిళలకు కుట్టుమిషన్లు...

50వేల ముక్కుపుడకలు...

600 ట్రాక్టర్లు...

డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ఋణాలు...

ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే 1400 కోట్ల అభివృద్ధి పనులు...

నంద్యాలలో ఓట్లేసిన వాళ్లకు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వరాలు.

ఇక ఓటు వేయకుంటే...

రేషన్‌ కట్‌...

పింఛన్‌ కట్‌...

ఆరోగ్యశ్రీ కార్డు కట్‌...

మీ ఇంటికి కుళాయి కట్‌...

మీ వీధిలో రోడ్డు కట్‌...

మీ ఊరిలో అభివృద్ధికే ఫుల్‌స్టాప్‌...

అంతేనా...

ప్రభుత్వమే అమరావతిని వదిలి నంద్యాలలో సెటిలయ్యింది.

10మంది మంత్రులు,

30మంది ఎమ్మెల్యేలు

వార్డు ఇన్‌ఛార్జ్‌లయ్యారు.

ఇక పోలీసుల సహకారం పూర్తిస్థాయిలో సద్వినియోగం...

ఓటుకు 2వేల నుండి 5వేల రూపాయల వరకు పంపిణీ...

ముస్లిం ఓట్ల కోసం 90లక్షలతో ఇఫ్తార్‌ విందు...

మైనార్టీ నాయకుడు ఫరూక్‌కు అకస్మాత్తుగా ఎమ్మెల్సీ పదవి ప్రకటించడం...

ఇన్ని ప్రలోభాలను అధిగమించి, బెదిరింపు లకు భయపడక 70వేల మంది వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి ఓట్లేసా రంటే... అదీ అభిమానం... అదీ నిబ ద్ధత... ఈ ఓట్లు చెక్కుచెదరవు... రేపు ఎలక్షన్‌ పెట్టినా, ఇంకో నెల తర్వాత ఎలక్షన్‌ పెట్టినా శిల్పామోహన్‌రెడ్డికి ఇన్ని ఓట్లు వస్తాయి. మరి తెలుగుదేశం అభ్యర్థికి రేపు ఎలక్షన్‌ పెడితే 97వేల ఓట్లు వస్తా యనే గ్యారంటీ ఉందా?

దేశ రాజకీయ చరిత్రలో ఒక అధికార పార్టీ ఇంతవరకు ఎప్పుడూ చేయనంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడితేనే నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కిన విజయమిది. 27,466ఓట్ల భారీ మెజార్టీతోనే తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించాడు. అధికార పార్టీ ప్రలోభాల ముందు, వారి దూకుడు ముందు, వారి నోట్ల ప్రవాహం ముందు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజా కర్షణ, వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి మంచితనం మట్టి కొట్టుకుపోయాయి.

అయితే ఏది ఏమైనా గెలుపును గెలు పనుకోవాలి. ఓటమిని హూందాగా స్వీక రించాలి. ఇంకో ఒకటిన్నర సంవత్సరంలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. భూమా నాగిరెడ్డి మరణంతో ఈలోపే నంద్యాల అసెంబ్లీకి ఉపఎన్నిక రావడంతో దీనిని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. భూమా పార్టీ మారకపోయి వుంటే అసలు ఉపఎన్నిక అవసరముండేదే కాదు. తమ పార్టీ గెలిచిన సీటనిచెప్పి జగన్‌, చనిపోయిన భూమా నాగిరెడ్డి తమ పార్టీ లోని ఎమ్మెల్యే అని చెప్పి చంద్రబాబు... ఎవరికి వాళ్లు వెనక్కి తగ్గకుండా పోటీకి సిద్ధమయ్యారు. దీంతో నంద్యాల ఎన్నికకు సెమీఫైనల్‌ మ్యాచ్‌ లాంటి కలరింగ్‌ వచ్చింది. నంద్యాలలో గెలిచిన వాళ్లదే 2019 ఎన్నికల్లోనూ అధికారం అనేంతటి ప్రచారం వచ్చింది. దాంతో ఇరు పార్టీలు కూడా గట్టి అభ్యర్థులనే బరిలో నిలిపి హోరాహోరీగా తలపడ్డాయి. నంద్యాలలో ఓడిపోతే ఇక రాజకీయ భవిష్యత్‌ లేద న్నట్లుగా చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పని చేశాడు. పరుగులు తీయిం చాడు. నంద్యాల ఎన్నికను ప్రతిపక్ష నేత జగన్‌ ఎంత సీరియస్‌గా తీసుకున్నాడన్న దానికి ఆయన 13రోజుల పాటు ఏకధా టిగా సాగించిన ప్రచారమే ఉదాహరణ.

ఊహించని గెలుపు

నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థికి ఇంత భారీ మెజార్టీ వస్తుందని తెలుగు దేశం నాయకులు కూడా వూహించలేక పోయారు. పది వేల నుండి పదిహేను వేల మధ్య మెజార్టీతో గెలుస్తామని టీడీపీ నాయకులు అంచనా వేసుకున్నారు. ఇక వైసిపి నాయకులు కూడా పోలింగ్‌ శాతం పెరిగాక 5వేల మెజార్టీతో నైనా బయట పడతామని ఆశపడ్డారు. అయితే అంచ నాలు తలక్రిందులై టీడీపీకి ఊహించని మెజార్టీ వచ్చింది.

చంద్రబాబును నిలబెట్టాయి

నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు చంద్ర బాబు నాయకత్వాన్ని ఒకరకంగా నిలబెట్టిం దనే చెప్పాలి. ఏ మాత్రం ఓడిపోయి వున్నా తెలుగుదేశంలో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యేవి. ఆ పార్టీ నుండి జంపింగ్‌లు ప్రారంభమయ్యేవి. ఈ గెలుపుతో చంద్ర బాబు అయితేనే ఎలక్షన్‌ చేయగలడు అన్న ఒక నమ్మకం ఆ పార్టీ కేడర్‌లో ఏర్పడింది.

వైకాపాకు మునిగేదేమీ లేదు

ఉపఎన్నికలలో ఓటమి పాలయినంత మాత్రాన వైకాపా శ్రేణులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారపార్టీ ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఇన్ని వందల కోట్ల తాయిలాలు ఎరవేసినా 70వేల మంది ఓటర్లు వారి వెంట నిలిచారంటే అదే అసలైన బలం. వీళ్లు ఎక్కడికీ పోయేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు రేపు మళ్ళీ అదే పార్టీకి ఓటేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే నంద్యాల అసెంబ్లీకి ఒక్కదానికే ఎలక్షన్‌ జరుగు తున్నప్పుఢు... ఆ ప్రభావం వేరు, రేపు 175 అసెంబ్లీ సీట్లకు ఒకేసారి ఎలక్షన్‌ జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం వేరు. అప్పుడు ఇంతమంది మంత్రులు, ఎమ్మె ల్యేలు వచ్చి ఎలక్షన్‌ చేయరుగా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టలేరుగా? కాబట్టి ఈ ఓటమిని అనుభవంగా మార్చుకుని లోపా లను సరిదిద్దుకుంటే రేపటి విజయానికి ఈ పరాజయాన్నే మెట్లుగా మలచు కోవచ్చు.

ఒకే ప్యాట్రన్‌ పని చేసిందా?

నంద్యాలలో కులాల వారీగా ఓట్లు పడలేదు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి మాట్లాడుకున్నట్లుగా తెలుగుదేశం అభ్యర్థికే మెజార్టీ ఓట్లు వేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి పనులను మెచ్చి, చంద్రబాబు పరిపాలనా విధానాలు నచ్చి జనం తెలుగుదేశంకు ఓట్లేసారనుకుంటే అది అతినమ్మకమే అవుతుంది. నంద్యాల ఓటర్లపై అనేక అంశాలు ప్రభావం చూపాయి. ఒక్క నంద్యాల పరిధిలోనే 1400 కోట్ల పనులను మొదలుపెట్టారు. తెలుగుదేశం ఓడిపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని ఆ పార్టీ నాయకులు మొదటి నుండి ప్రచారం చేయసాగారు. రాకరాక మన ఊరికి మంచి అవకాశం వచ్చింది, ఈ ఒక్కసారికి టీడీపీకి ఓటేస్తే ఏం పోతుందిలే, ఇదేం ప్రభుత్వాలను దించేసే ఎలక్షన్‌ కాదు కదా... టీడీపీని గెలిపిస్తే కనీసం ఈ అభివృద్ధి పనులన్నా పూర్తవుతాయనే ఆలోచనా ధోరణి కామన్‌ మెన్‌లో పనిచేసింది. అలాగే ఈవిఎంల ప్రభావం కూడా వుంది. బ్యాలెట్‌ ఎలక్షన్‌ అయితే అన్నీ కలబోసి కట్టలు కట్టి లెక్కపెడ తారు కాబట్టి బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న లెక్క రాదు. అదే ఈవి ఎంల ద్వారా అయితే బూత్‌ వారీగా ఓట్లు తెలుస్తాయి. దీనిని ప్రచారం చేసే ప్రజ లను భయపెట్టారు. నంద్యాల పట్టణంలో మైనార్టీలు తెలుగుదేశం వైపే మొగ్గు చూపారు. దీనికి కారణం ఆటోనగర్‌లో ముస్లింలు ఎక్కువ. వారు షెడ్లు నడుపు కుంటున్న స్థలాలను వారిపేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేస్తామని ప్రచారం చేశారు. దీనిని ముస్లింలు బాగా నమ్మారు. అలాగే ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం, మహిళలకు ఇల్లు, కుట్టు మిషన్లు పంపిణీ వంటి తాత్కా లిక ఆకర్షణల ముందు వై.యస్‌. కల్పించిన మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్‌ను మరచి పోయారు. వైశ్యులు, కాపులే కాదు, అభ్య ర్థులిద్దరూ రెడ్లే కావడంతో వైకాపాకు బలమైన మద్దతుదారులుగా వున్న రెడ్లు కూడా చెరి సమంగా చీలిపోయారు. దీనికితోడు పోలీసులు, అధికారుల సహ కారం, భూమా పిల్లల పట్ల కొంతమం దిలో వున్న సానుభూతి కూడా కలిసొ చ్చింది. అలాగే మొదటి నుండి కూడా... బూత్‌ల వారీగా ఓట్ల వివరాలు తెలు స్తాయి, మీరు ఓట్లు ఎవరికి వేసింది తెలిసి పోతుంది... మేం ఓడిపోతే మీకు పింఛన్‌ కట్‌, రేషన్‌ కట్‌, ప్రభుత్వ పథకాలు కట్‌... అంటూ అధికారపార్టీ నాయకులు వీధి వీధినా చేసిన ప్రచారం కూడా ఓటర్లపై బాగానే ప్రభావితం చేసింది.

ఈ గెలుపే రేపటికి ప్రామాణికమా?

ఏ రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగినా సాధారణంగా అధికారపార్టీనే గెలుస్తుం టుంది. ప్రతిపక్షాలు గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. అదికూడా అనుకోని పరి స్థితుల వల్ల. నంద్యాల గెలుపును చూసి చంద్రబాబు చంకలు గుద్దుకున్నా, ఓటమిని చూసి జగన్‌ డీలా పడినా ఇద్దరూ పప్పులో కాలేసినట్లే! నంద్యాల ఎలక్షన్‌ను సాధారణ ఎన్నికల మాదిరిగానే జరిపి, ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా తెలుగుదేశం గెలిచి వుంటే అది చంద్రబాబు నాయకత్వ సమ ర్ధతకు ప్రజలు ఇచ్చిన బహుమానంగా వుండేది. రేపు అధికారం కూడా అతని దేననే అభిప్రాయం ఉండేది. ఇంత చేసి గెలిచింది కూడా ఓ గెలుపేనా? అనే స్థాయిలో అక్కడ ప్రలోభాలు పని చేసాయి. కాబట్టి గెలుపును చంద్రబాబు తన బలు పుగా చూడనక్కర్లేదు. ఓటమిని జగన్‌ అంత జీర్ణించుకోలేనంతగా భావించనక్క ర్లేదు. దీనికి చంద్రబాబే ఉదాహరణ. 2012లో రాష్ట్రంలో 15అసెంబ్లీలకు

ఉపఎన్నికలు జరిగితే తెలుగుదేశంకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాంటి పార్టీ 2014లో ఏకంగా అధికారంలోకి వచ్చింది. రాజకీయాలలో పరిస్థితులు మారడానికి ఒక్క నెల చాలు. 2014లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే చంద్ర బాబు రాష్ట్ర రాజకీయాలను మార్చేసాడు. కాబట్టి నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపోట ముల ద్వారా ఎవరికీ ఒరిగింది లేదు... తరిగిందీ లేదు.!

chandraఅసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో ఉండగానే ప్రధానిని జగన్‌ కలిసాడన్న వార్త చెవిన పడింది. అక్కడే మనశ్శాంతిగా ఉండలేకపోయాడు. అమెరికా నుండి నేరుగా వచ్చి ఢిల్లీలో దిగగానే తన వెంటవున్న వారిని హైదరాబాద్‌ పంపించేసాడు. తాను మాత్రం ఏడు గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా గడిపాడు. జగన్‌ ప్రధానిని ఎందుకు కలిసాడు, ఏం చెప్పాడు, అసలు అర్ధాంతరంగా జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటన్నది తెలుసుకోవడం కోసమే ఆయన ఆ కొన్ని గంటలు అజ్ఞాతంలో గడిపినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు చంద్రబాబుకు ఢిల్లీలో కూడా గట్టి నాయకుడనే పేరుండేది. 1996లో 13రోజుల ప్రధాని వాజ్‌పేయిని దించేసి యూనైటెడ్‌ ఫ్రంట్‌ కూటమిని కట్టించింది చంద్రబాబే! ఆ తర్వాత 1998, 1999లలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వాల లోనూ కీలక భాగస్వామిగా వున్నాడు. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని జైలులో పెట్టాలంటూ నినదించిన ధైర్యశాలి. గత చరిత్రను చూస్తే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ట్రాక్‌ రికార్డు బాగానే వుంది. అంత పలుకుబడి కలిగిన నాయకుడు జగన్‌ ప్రధానిని కలిసాడని తెలియగానే చలి జ్వరం వచ్చినట్లు వణికిపోయాడు. రాజకీయాలలో ప్రధానిగా వున్నవారిని ఏ పార్టీ నేత అయినా కలవవచ్చనే పద్ధతిని మరచి, జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని మాట్లాడారు. జగన్‌కు అపా యింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన పిఎంఓ కార్యా లయాన్నీ చంద్రబాబు ప్రశ్నించినట్లయ్యింది.

అయినా జగన్‌కు మోడీ అపాయింట్‌ మెంట్‌ ఇస్తే చంద్రబాబు ఇంతగా ఆక్రోశం చెందాల్సిన అవసరం ఏముంది? తను ఏదో అభద్రతాభావంతో ఉండబట్టే ఇలా నోరు పారేసుకుంటున్నాడు. ఏపిలో జరిగిన, జరుగుతున్న అక్రమాలను మోడీకి జగన్‌ చెవిలో వూదాడనే కోపంతోనే ఆయన ఈ అరుపులు అరుస్తున్నాడు.

వాస్తవంలోకి వస్తే చంద్రబాబు అంటే మోడీకి ఏమంత నమ్మకం, గౌరవం లేదు. అవసరాన్ని బట్టి చంద్రబాబు రాజకీయ రంగులు మారుతాయని తెలుసుకోలేనంత అమాయకుడు కాడు మోడీ! ఈరోజు తమతో అవసరం వుంది కాబట్టి అణిగి మణిగి వుంటున్నాడు. రేపు బీజేపీకి రెండు చోట్ల పరాభవాలు ఎదురై, మోడీ క్రేజ్‌ తగ్గిందంటే ఇదే చంద్రబాబు దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కలిపి తృతీయ ఫ్రంట్‌ అనే టెంట్‌ను వేస్తాడు. రాజకీయ స్నేహానికి చంద్రబాబు నమ్మ కస్తుడు కాడు. కాని ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీనే ఎదిరించి, 16నెలలు జైలులో గడిపిన జగన్‌ను రాజకీయంగా నమ్మొచ్చు. అదీగాక జగన్‌కు రాష్ట్రం తప్పితే జాతీయ రాజకీయాల మీద ఆశ, ఆసక్తి ఉండదు. కాబట్టే బీజేపీలో జగన్‌ పట్ల సానుకూల ధోరణి కనిపిస్తోంది.

బీజేపీకి జగన్‌ జత కలిస్తే రాష్ట్రంలో తనకు చుక్కలు చూపిస్తారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ముఖ్యంగా 'ఓటు-నోటు' కేసు బాబు మెడ మీద కత్తిలా వేలాడుతోంది. ఈ కేసును ముందుకు సాగనీయకుండా ఇప్పటివరకు కేంద్రమే ఆదుకుంటోంది. ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌ రికార్డర్‌ కూడా పక్కా సాక్ష్యంగా వుంది. ఇక అమరావతి రాజధాని భూముల సేకరణ దగ్గర్నుండి, పుష్కరాలకు వేలకోట్లు తగలేయడం, పోలవరం పూర్త యితే పనికిరాని పట్టిసీమ, పురుషోత్తమ పట్నం వంటి ప్రాజెక్ట్‌లు కేవలం డబ్బు కోసం చేపట్టినవేననే విషయం తెలియంది కాదు. ఏ రాష్ట్రంలోనైనా మోడీ తాను కాలు పెట్టాలనుకుంటున్నప్పుడు అక్కడ ముందుగా సిబిఐ దాడులు జరగడం చూస్తున్నాం. ప్రస్తుతం మోడీ ఏపిని టార్గెట్‌ చేసాడు. ఇక్కడ బీజేపీకి జగన్‌ లక్ష్యం కాదు. చంద్రబాబును నిర్వీర్యం చేయడమే అసలు ఉద్దేశ్యం. ఈ మూడేళ్లలో చంద్ర బాబుకు కేంద్రం వట్టి మాటలు చెప్పడం తప్ప ఎలాంటి సాయం చేయలేదు. విభజన బిల్లులో చెప్పిన ప్రత్యేకహోదా విషయంలో కూడా ఆయన రాజీపడడం ప్రజల్లో చంద్రబాబు నాయకత్వ స్థాయిని దిగజార్చింది. కేంద్రం ద్వారా చంద్రబాబు రాష్ట్రానికి ఏ పనులూ సాధించలేక పోయాడు, సరికదా అసలే అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఈయన చేసిన ఆర్భాటపు పను లన్నీ కూడా ప్రజలకు పని కొచ్చేవి కావు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్ర మాలపై సిబిఐ విచారణ చేయిస్తే ఎన్నో లొసుగులు బయటపడతాయి. చంద్రబాబు సర్కార్‌ను ప్రజా బోనులో దోషిగా నిల బెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి ఏమంత కష్టం కూడా కాదు.

ఏపిలో తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలన్నా, చంద్రబాబును బలహీన పరచాలన్నా మోడీకి చిటికెలో పని. తన విషయంలో మోడీ ఆ పని చేయకపోవ చ్చని చంద్రబాబుకు ఇంతకాలం బలమైన నమ్మకం ఉండేది. కాని మోడీని జగన్‌ కలిసొచ్చాక, మోడీ చేతికి అతను చంద్ర బాబు గారి అక్రమాల చిట్టా పద్దులు ఇచ్చి వచ్చాక ఆ నమ్మకం కూడా పోయింది. మోడీ ఎక్కడ ఎప్పుడు తనకు ఎసరు పెడ తాడోననే ఆందోళన బాబులో కనిపిస్తోంది.

3చంద్రబాబు పక్కా రాజకీయనాయకుడు. కాబట్టే ప్రజానాయకుడు కాక పోయినా ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పరిపాలించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర రాజకీయాలను ఔపాసన పట్టిన నాయకుడు. ఎప్పుడు ఏమి చేయాలో తెలి సిన నాయకుడు. ప్రజల్లో బలం లేక పోయినా, ఆ ప్రజల మద్దతు ఎలా పొం దాలో, ఎన్ని మార్గాలలో రాబట్టాలో తెలిసిన నాయకుడు. అలా తెలిసినవాడు కాబట్టే 2014లో పార్టీ పనైపోయిందను కున్న వాతావరణంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు.

ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ప్రజలు కట్టకట్టుకుని ఓట్లేసేంత మంచిపనులేవీ చంద్రబాబు చేయలేదు. ఈ మూడేళ్లలో చేసినవన్నీ కూడా సొం తంగా ఆర్ధిక వనరులు కూడగట్టుకోవ డానికి చేసినవే! ప్రజల్లో వ్యతిరేక వాతా వరణం బాగానే కనిపిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏక పక్షంగా జరగాలనే కాంక్ష చంద్రబాబులో కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు మూడు.

మొదటిది రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను 175 నుండి 225కు పెంచడం. ఇలా చేస్తే తెలుగుదేశంలో వున్నోళ్లకు, కాంగ్రెస్‌, వైకాపాల నుండి చేరినోళ్లందరికీ సీట్లొస్తాయి. డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థులకు తెలుగుదేశంలో లోటు లేదు. కాని వైకాపాకు అలాంటి అభ్యర్థుల కొరత ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షం మొదటి దెబ్బ తింటుంది. తెలుగుదేశం తరపున అన్ని నియోజక వర్గాలలోనూ బలమైన అభ్యర్థులు నిల బడతారు.

రెండోది... పవన్‌ కళ్యాణ్‌ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంలో ప్రధాన కారణాలలో పవన్‌ కళ్యాణ్‌ ఒకడు. ఆరోజు ఆయన బీజేపీతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశంకు కూడా మద్దతు పలికాడు. దీంతో పవన్‌ అభిమా నులతో పాటు కాపుల ఓట్లు కూడా తెలుగుదేశంకు పడ్డాయి. ఈ మూడేళ్లలో కాపులు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. కాపులకు బి.సి రిజర్వేషన్‌లు అమలు చేస్తామన్న బాబు మాట గాలిమూటే అయ్యింది. కాపు రిజర్వేషన్‌ ఉద్యమాలను చంద్రబాబు బలంగానే అణచివేసాడు. ఈసారి కాపుల ఓట్లు తెలుగుదేశంకు పడవని చంద్రబాబుకు తెలుసు. అయితే ఆ ఓట్లు వైకాపాకు పోతే చంద్రబాబుకు డేంజర్‌. వాటిని డైవర్ట్‌ చేయాలి. అందుకు ఆయన ముందున్న మార్గం పవన్‌ కళ్యాణ్‌ జనసేన చేత పోటీ చేయించడం. దీనివల్ల కాపుల ఓటును వైకాపాకు పోకుండా చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైకాపా, జనసేనల మధ్య చీల్చి తెలుగుదేశాన్ని లబ్దిపొందేలా చేయడం.

ఇక మూడోమార్గం అందరికీ తెలి సిన డబ్బు. ఎన్నికలంటేనే దీని పాత్ర ప్రధానమైపోయింది. ఇప్పుడు తెలుగుదేశం నాయకుల దగ్గర ఇది పుష్కలంగా వుంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలోనే ఒక్కో జిల్లాలో ఎన్నేసికోట్లు ఖర్చుపెట్టారో చూసాం. 2014 ఎన్నికల్లోనూ తెలుగు దేశం గెలుపులో డబ్బు ప్రభావం బాగానే పనిచేసింది. ఐదేళ్లు అధికారంలో ఉం డడం వల్ల తెలుగుదేశంపార్టీ ఆర్ధికంగా ఇంకా పుంజుకుంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆర్ధిక శక్తులను బాగానే ప్రయోగిస్తాడు.

ప్రజల్లో బలం లేకున్నా, ప్రజాకర్షక పథకాలు ఏవీ లేకున్నా, అవినీతి అక్ర మాలు పోటెత్తుతున్నా, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా... చంద్ర బాబుకు వచ్చే ఎన్నికలో మనదే అధికారం అని బల్లగుద్ది చెప్పడానికి బలమైన కారణం ఈ మూడుమార్గాలను బలంగా నమ్ము తుండడమే!

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter