ram kamతెలుగుదేశంపార్టీకి సంస్థాగతంగా కీలక విభాగం పోలిట్‌బ్యూరో. ఇందులో సభ్యుడిగా వుండడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు నాయకులు. పోలిట్‌బ్యూరో అంటే పార్టీ అధ్యక్షుడి తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కీలక వ్యవస్థ. ప్రస్తుతం నెల్లూరుజిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలిట్‌బ్యూరో సభ్యులుగా వున్నారు. ఇప్పుడాయనను మంత్రి వర్గానికి తీసుకున్నారు. కాబట్టి పోలిట్‌బ్యూరోలో ఆయన స్థానాన్ని జిల్లా నుండి ఒకరిద్దరు నాయకులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో చేరారనేగాని ఇంతవరకు ఆనం సోదరులను సంతుష్టపరిచే విధంగా పార్టీ అధిష్టానం నిర్ణయాలు లేవు. ఆనం రామ నారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించడం తప్పితే వాళ్లకు అదనంగా చేసిందేమీ లేదు. వాళ్లకు కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటి విలువలో కనీసం పదోవంతు విలువ కూడా తెలుగుదేశంలో లేకుండా పోయింది. కనీసం గల్లీ లీడర్లు కూడా వాళ్లను లెక్క చేయకుండా, ఈ పార్టీలో చేరి పొరపాటు చేసామనే పరిస్థితిని వాళ్లకు కల్పిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో గాని, గవర్నర్‌ కోటాలో గాని ఎమ్మెల్సీ సీటును ఆశించి భంగపడ్డారు. చంద్రబాబుపై పూర్తి అసంతృప్తితో వున్న ఆనం సోదరులకు పోలిట్‌బ్యూరోలో సభ్యత్వం దక్కే అవకాశముందని టాక్‌.

ఇంకోపక్క చూస్తే జిల్లాలో మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పదవులన్నీ తూర్పు డెల్టా నాయకులకే దక్కుతున్నాయి. మెట్ట ప్రాంతం కేడర్‌ను, లీడర్లను పార్టీ చిన్నచూపు చూస్తుండడం వల్ల, ఎన్నికలప్పుడు ప్రజలు కూడా పార్టీని చిన్నచూపు చూస్తున్నారు. కనీసం పార్టీ పదవుల విషయంలోనైనా మెట్టప్రాంతం నాయకులను గుర్తించి, ఆ ప్రాంతం వారికి పోలిట్‌బ్యూరోలో స్థానం కల్పించాలని మెట్టప్రాంతం కార్యకర్తలు కోరుతు న్నారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి ప్రాంతాలను తీసుకుంటే మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సీనియర్‌ నాయకుడు. 1985 నుండి పార్టీని నమ్ముకుని ఉన్నాడు. ఇటీవల కాంగ్రెస్‌లోకి వెళ్లినా గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేసాడు. ఉదయగిరి నియోజకవర్గంలో ఆర్ధికంగా శక్తివంతుడైన మేకపాటి సోదరులను మోటుకుంటూ పార్టీ కేడర్‌ను కాపాడుకొస్తున్నాడు. డబ్బులు చల్లనిదే నాయకుల వెనుక నలుగురు మనుషులు రాని నేటిరోజుల్లో కూడా కంభంకు రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే మనుషులున్నారు. 1999లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు జిల్లాలో తెలుగుదేశంపార్టీ మెజార్టీ సీట్లు గెలిచింది. మెట్ట ప్రాంతానికి చెందిన నాయకులను గుర్తిస్తే ఈ ప్రాంతంలో పార్టీ బలపడుతుందని ఈ ప్రాంతం కార్యకర్తల వాదన. మరి ఇది చంద్ర బాబు చెవికి చేరుతుందా, లేదా అరణ్యరోదనగానే మిగులుతుందో చూద్దాం!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter