sadistsభారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది హద్దులు దాటుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో శాడిస్టులు సమాజంలో విద్వేషపు మంటలు రగిలిస్తున్నారు. వీళ్ళకు ఇంకొందరు శాడిస్టులు జతవుతూ మానవ సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. ఇలాంటి శాడిజం భావాలున్న వారికి తెలుగు మీడియా పునరావాస కేంద్రాలవుతున్నాయి.

ఈ దేశంలో ఒకడు రాముడిని పూజి స్తాడు... ఇంకొకడు అల్లాను ఆరాధి స్తాడు... మరొకడు జీసెస్‌ను నమ్ముతాడు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి మతం వారిది. రాముడిని కొలిచే వాడు జీసెస్‌ను తిట్టాల్సిన పనిలేదు. క్రైస్తవుడు హిందూ సంస్కృతిని విమర్శించాల్సిన పనిలేదు. ఎవరి సంస్కృతిని వాళ్ళు పాటించుకుంటూ పోతుంటే ఏ సమస్యా లేదు. అసలు మత సంబంధ కార్యక్రమాలను ఇంటికి, ఒంటికి పరిమితం చేసుకుంటే ఏ బాధా లేదు.

అలా కాకుండా మతాలను, దేవుళ్ళను వీధుల్లోకి తెచ్చిపెట్టి, టీవీలలో వాటిపై చర్చావేదికలు పెడుతుండడంతోనే మను షుల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి.

భారతదేశంలో కోట్లాది మంది హిందువులకు శ్రీరాముడు ఆరాధ్యుడు. పితృవాక్కు పరిపాలకుడిగా పేరు. రామా యణం పవిత్ర గ్రంథం. సుపరిపాలనకు రామరాజ్యం పెట్టింది పేరు. ఇలాంటి రామాయణాన్ని కూడా గతంలో కొందరు వక్రీకరించారు. తమ మెదడులో, మన సులో వున్న పైత్యాన్ని సిరాగా మార్చి రామాయణాన్ని వక్రీకరిస్తూ ఎన్నో వ్యంగ్య రచనలు చేసారు. ఎవరు ఎంతగా బురద చల్లినా వజ్రం వజ్రమే! దాని కాంతిని కోల్పోదు. అలాగే ఎవరెన్ని ఛండాలపు రాతలు వ్రాసినా ఎవరు ఎంతగా కారు కూతలు కూసినా రాముడు రాముడే, రామాయణం రామాయణమే! వాటి పవిత్రత ఎక్కడికీ పోదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అంతటి వాడే రాజ్యాంగం పుస్తకం పైన శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ప్రచురింపజేసారంటే దాని విలువ తెలపకనే తెలిపాడు.

అయితే మీడియా అంతగా అభివృద్ధి చెందని కాలంలో రాముడిని, రామాయ ణాన్ని, లేదా హిందూ సంస్కృతిని ఎవరు ఎంతగా కించపరుస్తూ మాట్లాడినా ప్రజ లకు తెలిసేది కాదు. వాళ్ళ మనోభావాలు ప్రభావితమయ్యేవి కూడా కాదు. ఇప్పుడు మీడియా విస్తృతంగా వుంది. ఎవరేం మాట్లాడినా క్షణాల్లో ప్రపంచమంతా పాకి పోతుంది. కాబట్టి విజ్ఞులైన వారు ఎవరైనా సరే ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే బాగుంటుంది. మానవ సమా జానికి మంచి చేయాల్సిన మీడియా కూడా మత ఉద్రేకాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా వుంటే మరీ మంచిది.

ఇటీవల ఒక తెలుగు న్యూస్‌ ఛానెల్‌ వేదికగా కత్తి మహేష్‌, గోగినేని బాబు అనే శాడిస్ట్‌ మేధావులు హిందూ సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతినేలా చేసింది. ఒకడు రాముడిని అనరాని మాటంటే, ఇంకొకడు సీతమ్మపై అవమానకర రీతిలో మాట్లాడాడు. వీళ్ళిద్దరు కూడా ఇలా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీయాల్సిన అవసరం లేదు.దీనివల్ల వారికి గాని, సమాజానికి గాని వచ్చిన

ఉపయోగం ఏమీ లేదు. మీరు రాముడిని నమ్మరు... రామాయణాన్ని నమ్మరు... దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదే. సమాజంలో దేవుడిని నమ్మని వాళ్ళు ఎంతోమంది వున్నారు. వాళ్ళనెవరూ బల వంతం పెట్టడం లేదే! సరే టీవీ చర్చా వేదికలలో హిందువులు ఆరాధించే దేవుళ్ళను తిడుతున్నారు. అదే నోటితో ఇతర మతాల జోలికి వెళ్ళగలరా? వీళ్ళకు అంత దమ్ముందా? వాళ్ళ జోలికి పోతే నలగదన్ని పెడతారు.

మతం అన్నది మత్తులాంటిదని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. నిజమే... ఈ మతం మత్తులో పడి చాలామంది కొట్టుకుంటు న్నారు. చాలామంది ఛస్తున్నారు. ప్రతి మతంలోనూ మంచి వుంది, చెడు వుంది. అట్లాగే హిందూ మతంలోనూ కొన్ని దురా చారాలున్నాయి. వాటి వల్లే చాలామంది హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారారు. ఇప్పుడు హిందూ సంస్కృతి లోనూ ఆ దురాచారాలను రూపుమాపే దిశగా సంస్కరణలు మొదలయ్యాయి. ఏదన్నా వుంటే దురాచారాలు, మూఢనమ్మ కాలపై పోరాడాలి. ప్రజల్ని ఆ దిశగా చైతన్య వంతుల్ని చేయాలి. మనిషికి గుండెపోటు వస్తే ఆసుపత్రికే తీసుకెళ్ళాలి, దేవాలయా నికి కాదు. పాము కరిస్తే డాక్టర్‌ దగ్గరకు పోవాలి, మంత్రగాడి వద్దకు కాదు. ప్రజ లకు ఇలాంటి వాటిపై అవగాహన కావాలి.

హిందూ సంస్కృతిలో మూఢనమ్మకా లను, దురాచారాలను పక్కనపెడితే ఆలోచించడానికైనా, అనుసరించడానికైనా ఎన్నో మంచిమార్గాలున్నాయి. మనిషిని మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పేది ఈ సంస్కృతే! హిందూ సంస్కృతి, హిందూ ఆరాధన పద్దతుల వల్లే ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు వెలిసాయి. వాటి కేంద్రంగానే కొన్ని కోట్ల మందికి పూజారులుగానో, పల్లకీ మోత వారిగానో, ఇ.ఓలుగానో, సూపరింటెండెంట్లగానో, ఛైర్మెన్‌లగానో, ధర్మకర్తలుగానో, మంగళ వాయిద్యకారులుగానో, తలనీలాలు తీసే వాళ్ళుగానో... ఎన్నో రకాలుగా బ్రతుకుతు న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనా వేదిక హిందూ సంస్కృతి. ఈ సంస్కృతి ఆధారంగానే ఎన్నో విద్య, వైద్య సంస్థలు నెలకొల్పబడి సమాజంలోని పేద లకు, పీడితులకు సేవచేయగలుగుతు న్నాయి. హిందూ సంస్కృతిలోని పరమార్ధం మానవ సేవే మాధవ సేవ. హిందూ సం స్కృతి గురించి లోతుగా ఆలోచించేవారికి తప్పితే మందబుద్ధి కలిగిన వాళ్ళకు ఈ సంస్కృతి గొప్పతనం అర్ధం కాదు.

money studyవేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు... వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య. ప్రైవేట్‌ పాఠశాలల్లో పోటాపోటీగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాఠశాలలు తెరచుకుంటే ఒకటిన్నర నెలలుగా విశ్రాంతిలో వున్న స్కూలు బస్సులు మళ్ళీ రోడ్లపై విహరిస్తాయి.

akhilapakshamరామయ్య ఇంట కొడుకు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి పనులన్నీ తన స్నేహితులైన చంద్రయ్య, రాజయ్యలకు అప్పగించాడు. చంద్రయ్యకు పని కంటే కూడా మాటలెక్కువ. రాజయ్యకు మాటలకంటే పని మీద ధ్యాస ఎక్కువ. పెళ్ళి ఏర్పాట్లన్నీ రాజయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు. చంద్రయ్య మాత్రం నలుగురిని పోగేసుకుని తాను అంతటివాడినని ఇంతటి వాడినని డబ్బా కొట్టుకునే వాడు. పెళ్ళి పనులు చివరి దశలో వుండగా, అక్కడకు రామయ్య రావడాన్ని చంద్రయ్య చూసాడు. వెంటనే మాటలు కట్టేసి పెళ్ళి పనుల వద్దకు పరుగెత్తి అక్కడున్న టెంకాయ మట్టలను గుంజలకు కడుతూ నుదుటన చెమటను తుడుచుకుంటున్నట్లు ఫోజివ్వసాగాడు. పని అయ్యేదాకా కష్టపడింది రాజయ్య... చివరి దశలో పనిలో అడుగుపెట్టి... నేను పని చేయడం వల్లే అన్ని పనులు పూర్తయ్యాయి అన్నట్లు కలరింగ్‌ ఇవ్వాలనుకున్నాడు చంద్రయ్య. కాని, రాజయ్య, చంద్రయ్యలలో ఎవరి బుద్ధి ఏమిటో తెలిసిన వాడు రామయ్య.

ఇప్పుడు రామయ్య లాంటివారే ఆంధ్రా ప్రజలు. ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్ళ నుండి పోరాటం చేస్తున్న వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిని నమ్ముతారా? లేక నాలుగేళ్ళ నుండి ప్యాకేజీ పాట పాడుతూ నాలుగురోజుల క్రితమే హోదా మాట మార్చిన చంద్రబాబును విశ్వసిస్తారా? అన్నదే చూడాలి! రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం బాగా రగులుకుంది. ప్రజల్లో చైతన్య మొచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు కూడా హోదా కోసం గళమెత్తాయి. రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకహోదాపై మొదటి నుండి గట్టిగా నిలబడింది, గట్టిగా పట్టుబట్టింది వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో ముందుకు నడిపాడు.

ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరా డాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ప్రత్యేకప్యాకేజీ మాత్రమే ఇస్తామన్నప్పుడు అదే మహాప్రసాదం అన్నట్లుగా అంగీకరించిందేగాని హోదా ఎందుకు ఇవ్వరని ఏ రోజూ అడగలేదు.

ఈరోజు బీజేపీతో విభేదాలొచ్చేసరికి, ప్రతిపక్షం హోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేసరికి ఉలికిపాటు మొద లైంది. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని హైజాక్‌ చేసే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏనాడూ అఖిలపక్ష సమావేశం జరపలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేట ప్పుడు తెలుగుదేశంకు అఖిలపక్షాలు గుర్తుకురాలేదు. రాజధాని అన్నది తెలుగు దేశం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కాదు. 13జిల్లాల ప్రజలకు సంబంధించిన అంశం. భావితరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాల్సిన విషయం. ఆరోజు ఏ పక్షాన్ని పిలవకుండానే ఏకపక్షంగా అమ రావతిని రాజధానిగా నిర్ణయించేసారు. ఆ తర్వాత నాలుగేళ్ళలో ఏ అంశంపైన కూడా ప్రతిపక్షాన్ని పిలిచి అడగాలన్న స్పృహ ఈ ప్రభుత్వానికి తట్టలేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వమే నాలుగేళ్ళుగా తొక్కి పట్టాలని చూసినా ప్రధాన ప్రతిపక్షం వైసిపి, ఇక వామపక్షాలు ఏదో రూపంలో ముందుకు తీసుకుపోతూనే వున్నాయి. ప్రత్యేకహోదా ఉద్యమం పరి పక్వ దశకు వచ్చిందని, హోదాకు జైకొట్టక పోతే ఆంధ్రా జనం తమను ఛీకొట్టడం ఖాయమని భావించిన చంద్రబాబు 'యూ' టర్న్‌ తీసుకున్నాడు. ఉద్యమాన్ని పూర్తిగా హైజాక్‌ చేసి పచ్చముద్ర వేసుకునేందుకు అఖిలపక్షం నాటకం మొదలుపెట్టాడు. ఈ అఖిలపక్షం సమావేశంకు ప్రధాన ప్రతి పక్షం వైసిపితో పాటు బీజేపీ, జనసేన వంటి పార్టీలు హాజరు కాలేదు. వామ పక్ష నాయకులు వెళ్ళినా ఈ నాలుగేళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారంటూ చంద్రబాబు ముఖాన్నే కడిగేసి బయటకొచ్చారు.

హోదా అంటే జైలుకే అని బెదిరించిన నాయకులే ఆ ఉద్యమానికి సారధ్యం వహిస్తామని చెప్పడం చూస్తుంటే గొర్రెల మందకు తోడేళ్లను కాపలా పెట్టడమే అవుతుంది. ఇలాంటి నాయకుల చేతుల్లోకి ఉద్యమం పోతే చివరకు అది ఏ దారి పడుతుందో తెలియదు. చంద్రబాబు హోదా ఉద్యమ హైజాక్‌ ప్లాన్‌కు ప్రతి పక్షాలు బలంగానే బ్రేక్‌ చేశాయి.

Page 1 of 128

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter