Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

galpikaప్రపంచ మేటి నగరాలలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న అమరావతి నగరం. కరకట్ట మీదగల హైటెక్‌రత్న సీఎం చంద్రబాబు క్యాంప్‌ కార్యాలయం. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి, వసుంధర, నారా దేవాన్ష్‌లు అక్కడ హాల్‌లో కూర్చుని టీవీలో 'పెళ్లాం కొడితే పడాలి' సీరియల్‌ చూస్తున్నారు. అంతలో అక్కడకు వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్‌ మాస్టర్‌, ఎంపీ మురళీ మోహన్‌, జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావులు వచ్చారు. నారాయణ వుండి... ఆ దిక్కుమాలిన సీరియల్స్‌ ఏం చూస్తారుగాని ముందు ఎన్‌టివి పెట్టండి అని చెప్పాడు. బాలకృష్ణ రిమోట్‌ తీసుకుని 'ఎన్‌' టివి పెట్టాడు. టీవీ స్క్రీన్‌పై వైసిపి అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి బంగీజంప్‌ దృశ్యాలు వస్తున్నాయి. జగన్‌ సాహసం అద్భుతం... ఏ నాయకుడూ చేయని సాహసాన్ని జగన్‌ చేసాడు. ఆయన ఫీట్‌కు ప్రజలు ఫిదా అవుతున్నారు అని న్యూస్‌రీడర్‌ చెబు తోంది. ఆ సీన్‌లు చూసి చంద్రబాబుకు అరికాల్లో మండసాగింది. ఈ ఫీట్లు చేస్తే జనాలు ఓట్లేస్తారా? అని ఆవేశంగా చంద్రబాబు అడిగాడు. దానికి నారాయణ... ఇప్పుడు యూత్‌ ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళనే అభిమానిస్తు న్నారు సార్‌. ముఖ్యంగా అమ్మాయిలు. మన లోకేష్‌ చేత కూడా ఇలాంటి ఫీట్లు ఏవన్నా చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అక్కడే వున్న మురళీమోహన్‌... ఇలాంటి ఫీట్లు చేస్తే బరువు తగ్గుతా రనుకుంటే నేను చేయడానికి రెడీ అన్నాడు. అక్కడేవున్న దివాకర్‌రెడ్డి... బోచేసావ్‌లేవయ్యా ఆ ఫీట్లు... ఆ పిల్లోడంటే గట్టి గుండెకాయ వున్నోడు. మనమంతా ఆ ఫీట్లు చేస్తే గుండెకాయ జారి గొంతులోకి రాదూ అంటూ వారి ఉత్సాహంపై నీళ్ళు చల్లాడు. అంతా విన్న లోకేష్‌... జగన్‌ చేసింది కూడా ఒక ఫీటేనా... దాని అబ్బ లాంటి ఫీట్‌ చేస్తాను... మీ అందరూ ముక్కున వేలేసు కునేలా చేస్తాను... ఇదీ నా ఛాలెంజ్‌ అంటూ లేచాడు. లోకేష్‌ మాటలతో చంద్రబాబు ఖంగుతిని... నాయనా, లోకేసా అధికారం ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది, మనకెందుకొచ్చిన తలనొప్పి చెప్పు అని నచ్చచెప్పబోయాడు. అందుకు లోకేష్‌... నేను ఒక్కసారి కమిట్‌ అయ్యానంటే నా మాట నేనే కాదు, నా భార్య మాట కూడా వినను. జై రాజమౌళి అంటూ లేచి వెళ్ళిపోయ్యాడు. లోకేష్‌ ఏం చేస్తాడో, ఏమో అనుకుంటూ అందరూ టెన్షన్‌ పడసాగారు!

----

పక్కరోజు తెల్లారింది. చంద్రబాబు లేచి హాల్‌లోకి వచ్చాడు. అప్పుడే వచ్చిన చంద్రజ్యోతి పత్రికను తీసుకున్నాడు. మొదటిపేజీలోనే బ్యానర్‌లో... ఐటి మంత్రి నారా లోకేష్‌ అద్భుత సాహసాలు ఈరోజు ఉదయం 9గంటలకు మీ సిబిఎన్‌ ఛానెల్‌లో ''ఉద్యోగులు, వ్యాపా రులు, విద్యార్థులు... అందరూ ఆఫీసులు, స్కూళ్ళు, దుకాణాలు, కాలేజీలు ఎగ్గొట్టి ఇళ్ళలోనే కూర్చుని చూడండి...'' అని వుంది. అది చదివి చంద్రబాబు ఇంట్లో వున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, బాల కృష్ణలను పిలిచి ఆ వార్త చూపించాడు. అందరూ ఆశ్చర్యంతో... లోకేష్‌ ఏం చేసాడబ్బా అని ఆలోచనలో పడిపో యారు. చంద్రజ్యోతిలో ఈ వార్త చదివిన తెలుగుదేశం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చేసారు, ఆయనతో కలిసి టీవీలో లోకేష్‌ సాహస విన్యాసాలు చూడాలని... ఆ ఆనందాన్ని ఆయన కళ్ళల్లో చూస్తూ తరించాలని. అప్పుడే లోకేష్‌ అక్కడకు వచ్చాడు. అందరూ లోకేష్‌ను చుట్టుముట్టి... ఏం ఫీట్‌ చేసారు బాబూ... మాకు టెన్షన్‌గా వుంది... చెప్పరా అని అడగసాగారు. దానికి లోకేష్‌... తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఇంకో పదిహేను నిముషాలలో మీరే చూస్తారుగా అని చెప్పాడు. అక్కడ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో పోగవడంతో టీవీ అయితే అందరికీ కనిపించదని చెప్పి అప్పటి కప్పుడు భారీస్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వరల్డ్‌కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్నట్లుగా వుంది అక్కడి వాతా వరణం. అప్పుడే 9గంటలయ్యింది. సిబిఎన్‌ ఛానెల్‌లో న్యూస్‌ మొదల య్యాయి. హెడ్‌లైన్స్‌లో ఒళ్ళు గగుర్పాటు చెందే సాహసవిన్యాసాలు.. బీపీ వుండే వాళ్ళు మాత్రలు వేసుకుని చూడాల్సిన దృశ్యాలు... లోకేష్‌ సాహసాలు... అంటూ న్యూస్‌రీడర్‌ చెప్పింది. వెంటనే స్క్రీన్‌పై బ్యాక్‌గ్రౌండ్‌లో బాహుబలి-1 సినిమాలోని 'ధీవరా ప్రసర సౌర్య భార... ఉత్సర స్థిర గంభీర...' అనే సాంగ్‌ వస్తుండగా ఎత్తైన కొండలు... వాటి మీద నుండి ఉధృతంగా కిందకు జారుతున్న జలపాతాలు... ఆ సీన్‌లోనే లోకేష్‌ బాహుబలిలో ప్రభాస్‌ గెటప్‌లో ఒక కొండ మీద నుండి ఇంకో కొండ మీదకు జంప్‌ చేయడం... అవతల కొండను పట్టుకోలేక పట్టుతప్పి 5వేల అడుగుల ఎత్తున్న కొండ మీద నుండి పడిపో తుండడం... (ఈ సీన్‌ చూసేటప్పుడు చంద్రబాబుతో సహా అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భువనేశ్వరి, బ్రాహ్మణిలలో అయితే టెన్షన్‌ తారా స్థాయికి చేరగా దేవాన్ష్‌ మాత్రం భలే భలే చేసావు నాన్న అంటూ చిట్టి చేతు లతో చప్పట్లు కొడుతున్నాడు) దాదాపు సగం భాగం క్రిందకు వచ్చిన సమ యంలో లోకేష్‌ టక్కున కొండపై నుండి పక్కకు వంగివున్న చెట్టు ఊడలను పట్టుకున్నాడు. ఆ ఊడలు పట్టుకునే వేలాడుతూ తన అమ్ముల పొదిలోవున్న ఒక బాణానికి మర్రిచెట్టు ఊడను బలంగా బిగించాడు. తర్వాత భుజానికి తగిలించుకుని వున్న విల్లును తీసి బాణాన్ని కొండ శిఖరం పైనవున్న చెట్టుకు గురిచూసి వదిలాడు. షార్‌ నుండి వదిలిన రాకెట్‌లా ఆ బాణం రివ్వున దూసుకుపోసాగింది. బాహుబలి పార్ట్‌ 1 చూసిన వాళ్ళందరూ... ఆ బాణం కొండ శిఖరానవున్న చెట్టులో గుచ్చుకుంటుం దని అనుకోసాగారు. కాని అక్కడ అలా జరగలేదు. లోకేష్‌ వదిలిన ఆ బాణం చెట్టును దాటిపోయి ఆకాశంలోకి దూసుకుపోసాగింది. అలా వెళ్ళి వెళ్ళి హైదరాబాద్‌ నుండి గన్నవరం పోతున్న ఓ విమానం టైరుకు తగులుతుంది. యాహూ అంటూ లోకేష్‌ ఆ ఊడలను పట్టుకుని పైకి ఎగబాకసాగాడు. విమానం వెయ్యి కిలోమీటర్ల వేగంతో పోతుంది. లోకేష్‌ అంతే వేగంతో ఎగ బాకాడు. విమానం అమరావతి ఏరియా లోకి రాగానే లోకేష్‌ అమాంతం 10వేల అడుగుల ఎత్తునుండి దూకేసాడు. ఆ ఫీట్‌ చూసి అందరికీ గుండెలు జారాయి. ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు. భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో వున్నాడనగా లోకేష్‌ తన జేబులో నుండి ఒక బటన్‌ తీసి నొక్కాడు. అంతే ఆయన రెండు భుజాలకు తగిలించుకుని వున్న స్కూల్‌ బ్యాగ్‌ పారాచూట్‌లా మారింది. లోకేష్‌ పారాచూట్‌ సాయంతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం భవనం పైనే సురక్షితంగా దిగాడు. అప్పటిదాకా ఆ దృశ్యాలను ఉగ్గబట్టి చూస్తున్న వాళ్ళంతా లోకేష్‌ సురక్షితంగా దిగగానే పెద్దపెట్టున చప్పట్లు కొడుతూ లోకేష్‌కు అభినంద నలు తెలపసాగారు. టీవీ స్క్రీన్‌ మీద లోకేష్‌ సాహస విన్యాసాల దృశ్యాలు ముగియగానే పబ్లిక్‌ పోల్‌ ప్రశ్న ఒకటి ఇచ్చారు. ఇప్పటివరకు మీరు చూసిన లోకేష్‌ సాహసాలు నిజమేనని భావి స్తున్నారా? అవును అయితే 'ఎస్‌' అని, కాదు అయితే 'నో' అని మాకు టైప్‌ చేసి పంపండి అని ఇచ్చారు. ఓ ఐదు నిము షాల తర్వాత 99శాతం మంది 'ఎస్‌' అని టైపు చేసారని రిజల్ట్‌ కూడా ఇచ్చారు. అంతా అయ్యాక చంద్రబాబు లోకేష్‌తో... ఇంత సాహసం ఎలా చేయ గలిగావని అడిగాడు. దానికి, లోకేష్‌... మావయ్య బాలకృష్ణ స్ఫూర్తి... దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సహకారంతోనే ఇదంతా చేసా... రాజమౌళి అండ వుంటే ఈ ఫీట్లేం ఖర్మ, ప్రపంచాన్ని జయించే ఫీట్లే చేయగలను... అంతా గ్రాఫిక్స్‌ మహిమ అంటూ లేచాడు.

kattiఏదైతే తరతరాలుగా వస్తున్నఓ విష సంస్కృతిని అంతం చేయాలనుకుంటున్నామో, ఏ సంస్కృతి వల్ల అయితే సమాజంలో భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తుతున్నాయో, ఏ అనాగరిక చర్యల వల్ల అయితే కొన్ని వర్గాలవాళ్ళు సమాజంలో కలిసిపోలేక విదేశీ సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారో... ఏ దురహంకారం వల్ల ఈ మతం నాది కాదని విద్వేషం పెంచుకుంటున్నారో... అదే సంస్కృతి, అదే అనాగరిక చర్య, అదే అగ్రవర్ణ అహంకార ధోరణి 'కత్తి మహేష్‌' అనే

సినీ క్రిటిక్‌ విషయంలోనూ పునరావృతమైంది. ఈ చర్య సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేదిగా వుండకపోగా అలనాటి అగ్రవర్ణ దురహంకార ఛాయలకు అద్దంపడుతోంది.

''కత్తి మహేష్‌''... గత కొన్నిరోజులుగా తెలంగాణలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిల కన్నా, ఏపిలో జగన్‌, పవన్‌ల కన్నా పాపులర్‌గా వినపడుతున్న పేరు. అయితే ఈయనగారు ఒలం పిక్స్‌లో దేశానికి గోల్డ్‌మెడల్‌ సాధించడం ద్వారానో, ప్రపం చంలోని ఎత్తైన పర్వతాలన్నిం టిని అధిరోహించడం ద్వారానో, సరిహద్దులో పాతికమంది

ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారానో పాపులర్‌ కాలేదు.

ఒక మనిషి సమాజంలో ఫోకస్‌ కావాలంటే రెండు మార్గాలుంటాయి. మొదటిది ఏ రంగంలోనైనా రాణించి కీర్తిప్రతిష్టలు పొందడం. ఈ విధంగా రాణించాలంటే కఠోర సాధన, నిరంతరం పోరాటం చేయాలి. దీనికి చాలాకాలం పడుతుంది! అలాకాకుండా తొందరగా ఫోకస్‌ కావడానికి అడ్డదారులుంటాయి. ఈ రెండో మార్గంలో సమాజంలో అలజడి సృష్టించే పనులు చేస్తే చాలు... త్వరగా ఆయన పేరు ఫోకస్‌లోకి వస్తుంది. ఇలాంటి అడ్డదారిని ఎంచుకున్న వ్యక్తే కత్తి మహేష్‌!

గతంలో టివి9 న్యూస్‌ ఛానెల్‌ వేదికగా సినీహీరో పవన్‌కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని గెలికి చాలారోజులు మీడియాకు 24గంటలూ పనిపెట్టాడు. అది పాతబడిపోయిందనుకున్న తరుణంలో ఈసారి ఏకంగా కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడికే విమర్శల బాణం ఎక్కుపెట్టాడు. రాముడిలో రామాయణంలో అతనికి ఏవన్నా లోపాలు కనిపిస్తే వాటిపై చర్చిస్తే సరే... ఏకంగా రాముడిని తూలనాడాడు. సీతమ్మను అవమానకర రీతిలో మాట్లాడాడు. సీతా రాములను దైవంగా కొలిచే కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కత్తి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. కత్తి మహేష్‌పై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తడం, ఆందోళనలు నిర్వహించడం జరిగింది. హిందువుల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న నాయకులు, హిందువుల డబ్బుతో సినిమాల్లో రాణిస్తున్న సినీనటులు ఈ విషయంలో పెద్దగా స్పందించలేదుగాని సాధారణ హిందువులు, స్వామీజీల నుండి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిజిపి మహేంద్రరెడ్డి ప్రకటించారు.

ఈ నగర బహిష్కరణే... అర్ధంకాని విషయం. ఇక్కడ మళ్ళీ దళిత కార్డును లోడే పరిస్థితి వచ్చింది. చరిత్రను తిరగేస్తే దళితులను ఊరికి దూరంగా వుంచడం, కొన్ని సందర్భాల్లో దళితులను వూరి నుండి వెలివేయడం వంటి సంఘటనలే అంటరానితనానికి ఆజ్యం పోసాయి. ఇక్కడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నుండి బహిష్కరిస్తే దేశం వదిలిపోడు కదా! ఈ దేశంలోనే ఇంకో చోట వుంటాడు. అక్కడైనా అతనితో అదే సమస్య. అప్పుడే దళిత సంఘాల నాయకులు చరిత్ర మారలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కత్తి మహేష్‌ అనే వ్యక్తిని దళితుడిగా కాకుండా ఒక మనిషిగా, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న వ్యక్తిగా చూస్తే ఏ సమస్యా లేదు. కాని మళ్ళీ అతని తరపున దళిత కార్డును వాడుతున్నారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవుతుంది.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ విధించబట్టే కులం కార్డు మళ్ళీ తెరమీద కొచ్చింది. దానిబదులు చట్టపరిధిలోనే కేసులు నమోదు చేసి కోర్టుకు లాగివుంటే రాజ్యాంగ పరిధిలోనే అతని తప్పుకు తగిన శిక్ష పడేది.

ప్రధానంగా మీడియా పోటీ తత్వంతో పనికిమాలిన చర్చా వేదికలు పెడుతుండడం వల్లే మెదడు నిండా బూజుపట్టిన వాళ్ళంతా వచ్చి ఏదేదో వాగడం, సంఘర్షణ తలెత్తడం జరుగుతోంది. అసలు మత, కుల సంబంధ విషయాలపై టీవీలలో చర్చలు లేకుండా నిషేధం విధించాలి.

azizఅసెంబ్లీలోకి అడుగుపెట్టి 'సముద్రం' సినిమాలో తనికెళ్ళ భరణిలాగా 'అధ్యక్షా' అనాలనే కోరిక చాలామంది రాజకీయ నాయకులకుంటుంది. దానిని నెరవేర్చుకోగలిగిన వాళ్ళు

కొందరే! అలాంటి కోరిక బలంగా వున్నోళ్ళలో మన మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఒకడు.

ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన అజీజ్‌, ఆ తర్వాత కాలంలో వైసిపిలో చేరడం తెలిసిందే! వైసిపిలో వున్నప్పుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ముఖ్యఅనుచరుడిగా వుంటూ మైనార్టీల కోటాలో నెల్లూరు నగరం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అప్పటికే నగర వైసిపి ఇన్‌ఛార్జ్‌గా పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రజల్లోకి వెళ్ళిపోయి వుండడం, ఆయనకే గెలుపు అవకాశాలున్నాయనే సమాచారంతో అజీజ్‌ను అసెంబ్లీ కంటే ముందే వచ్చిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నెల్లూరులో వైసిపి పట్ల వున్న ప్రజాదరణతో మేయర్‌గా ఎన్నికైన అజీజ్‌, రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరడం తెలిసిందే!

మైనార్టీల కోటాలో నెల్లూరు నగరం టిక్కెట్‌ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరం టీడీపీ టిక్కెట్‌ విషయంలో మంత్రి పి.నారాయణతో పాటు నగర ఇన్‌ఛార్జ్‌ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మహిళా కోటాలో తాళ్ళపాక అనూరాధల పేర్లు కూడా ప్రచారంలో వున్నాయి. జిల్లా తెలుగుదేశంలో నెల్లూరు సిటీ సీటుకున్నంత పోటీ ఇంకే సీటుకు లేకపోవడం గమనార్హం. ఇక్కడ కాంపిటీషన్‌ ఎక్కువుగా వుండడంతో తనకు సీటు రాకపోతే ఏం చేయాలనేదానిపై మేయర్‌ అజీజ్‌ దూరదృష్టితో ఆలోచించినట్లు తెలుస్తోంది. టీడీపీ సీటు రాకుంటే జనసేన నుండైనా సీటు తెచ్చుకుని పోటీ చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈమేరకు 'జనసేన' వారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. జనసేన నుండి అయితే ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని, ఇక పవన్‌కళ్యాణ్‌ అభిమానులు, కాపుల ఓట్లు కలిస్తే తనకు గెలుపు అవకాశాలుంటాయని ఆయన నమ్మకం. దాంతో ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి.

Page 1 of 1076

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter