21 November 2014 Written by 

నిశ్శబ్దం

-      పాతూరి అన్నపూర్ణ, నెల్లూరు. 9490230939

నిశ్శబ్దం

ఒక్కోసారి వరంలా లభిస్తుంది

మనసు నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు

కళ్ళముందు సాక్షాత్కరించే పదచిత్రాలు

అక్షరాలుగా ఆకృతిని సంతరించుకుంటాయి

వర్ణరాగాలై కాగితాలను కౌగలించుకుంటాయి

మనోమంత్రాక్షరాలను మననం చేయాలన్నా

చుట్టూ నిశ్శబ్దావరణాన్ని చుట్టుకోవలసిందే

మేధోమధనంతో ఉదయించే వెలుగురేఖలు

నిశ్శబ్ద గవాక్షం నుండే ఆవిర్భవిస్తాయి

చాపక్రింద నీరులా ప్రవహించే నిశ్శబ్దం

ఒక్కసారిగా ప్రభంజనమై

భావ విప్లవానికి బాటలు వేస్తుంది

అంతెందుకు

ఈ రణగొణధ్వనుల ప్రపంచానికి దూరంగా

కొన్ని నిమిషాలైనా నిశ్శబ్దమందిరంలో

విశ్రాంతి తీసుకోవాలని

అందరమూ కోరుకుంటాం

మౌన తపస్సుతో సేదతీరిన మనసు

కొత్త చిగుళ్ళు వేసిన వృక్షంలా

మరిన్ని ఆకుపచ్చని ఆవిష్కరణలకు

శ్రీకారం చుడుతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter