23 January 2015 Written by 

దప్పిక

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

కడప, 9441287865

 

చెట్ల ఆకునరాలకు చెవి యొగ్గిచూడు

ఎన్ని మట్టుల లోతు భూమి దప్పిక విన్పిస్తుందో

చెరువు లోతట్టు గడ్డి దుబ్బుల ఎండు మొహాలుచూడు

ఎన్ని కూతవేటు దూరాల మబ్బుల వంధ్యత్వం కన్పిస్తుందో

మైదానాల నిండా ఎండిపోయే పెదాల వేదన

అడవులన్నిటా పిడచట్టుకుపోయే నాలుకల రోదన

జలాశయాల నోళ్లు తెరచి భూమితల్లి విలపిస్తోంది

దాహం... దాహం... దాహం... దాహమంటూ...

మాయబ్బగారి చెరువుల కాలం ఇప్పుడు కలగా మిగిలింది.

మా నాయనగారి దిగుడుబావుల తరం కల్లగా మారింది.

మేం ప్రారంభించిన గొట్టపు బావుల సాగుబడి

సగం తరానికే ఆయుష్షు కోల్పోయింది

ఎండిపోయిన బోరుబావుల్లోకి జారిన మా పిల్లలు

గొంతు తడవక యింకా బైటకు రాలేదు.

ఎండిపోతోన్న పైరు కోసం వేటకత్తులు పట్టిన మా సోదరులు

జైలు గోడల్లోంచి యింకా ఇళ్లకు చేరుకోలేదు.

సాగునీటి కోసం అరచి రాపెక్కిన మా గొంతుల్నిండా

ఇప్పుడు కేవలం దప్పిక... దప్పిక... దప్పిక...

ఎద్దుల గాడి రొచ్చు మట్టుపై కాలు మోపితే చాలు

కబేళాల కసాయి దృశ్యాలు ఎర్రతేళ్లయి కాటేస్తాయి.

గాదెల్లోని చీకట్లలోకి కళ్లు దింపిత చాలు

వలస బతుకుల కథలెన్నో చెవితంబెకు కందిరీగలవుతాయి.

మేఘాల కావైపు ఎక్కడో రైతుల రుతువులు బందీలయివున్నాయి.

నదుల గర్భాల్లో నాగళ్ల బతుకులు సమాధి చేయబడ్డాయి.

ఎండిన నేలతల్లి రొమ్ముకు ఎంత లోతు గాట్లు పెట్టి చీకినా

పొడి సుద్ద తప్ప పెదాలకు తడి రుచి అంటటం లేదు

కరువుతో చేయి కలిపిన ఖద్దరు పెద్దల అసమర్ధ పాలన

పైరు పచ్చల్నిఎండబెట్టే పనిలో ఒలంపిక్ పథకాలపై పోటీ పడుతోంది.

అందుకే సీమనేల నిండా నింగికెగసే ఆర్తారావాల పరంపర...

దప్పిక... దప్పిక... దప్పిక... దప్పిక...



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter