30 January 2015 Written by 

భారత్ పై అసమాన అభిమానం

oba mdఅతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశం అమెరికా, అతి ప్రాచీన నాగరికతగల ప్రజాస్వామ్య దేశం భారత్ ల మధ్య సరికొత్త స్నేహగీతం మొదలైంది. ఇరు దేశాల మధ్య వున్న అనుమానాలు, అపోహలు తెగిపోయాయి. స్నేహం, పరస్పర సహకారం ప్రగతిపథంల కలిసికట్టుగా పురోగతి సాధించే విధంగా అణుబంధాలు పెనవేసుకున్నాయి. భారత్ – అమెరికా సంబంధాలు సరికొత్త మార్గంలోకి మళ్లాయి. వీటిని ఎవరూ చెరపలేని విధంగా బలోపేతమయ్యాయి. ముఖ్యంగా ఇరుదేశాధినేతల మధ్య అరమరికలు లేని స్నేహం వల్ల ఇరు దేశాల మధ్య కల్మషం, కపటం, స్వార్ధం లేని బంధం ఏర్పడినట్లయ్యింది.

ఏ అగ్రరాజ్యమైతే తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందో అదే అగ్రరాజ్యాధినేతను భారత్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం ద్వారా తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ. తనకు వీసా ఇవ్వలేదని ఆయన అమెరికాపై పగబట్టలేదు. మోడీ ప్రధాని కాగానే అమెరికా కూడా తన గత అభ్యంతరాలను పక్కనపెట్టి మోడీకి రెడ్ కార్పెట్ పరచింది. గత ఏడాది అమెరికాలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన మోడీకి ఆ దేశం అపూర్వస్వాగతం పలికింది. అమెరికాతో మైత్రి బంధానికి ఆనాడే మోడీ మార్గం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామాను రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా ఆహ్వానించడం ద్వారా ఆ దేశంతో తాము ఎటువంటి సంబంధాలు కోరుకుంటున్నామనే విషయం బయటపెట్టారు. భారత ప్రధాని ఆహ్వానాన్ని మన్నించి అధ్యక్షుడిగా రెండోసారి ఒబామా భారత్ లో కాలుపెట్టాడు.  జనవరి 25,26,27 తేదీలలో మూడురోజుల పాటు జరిగిన ఒబామా భారత పర్యటన పూర్తిగా విజయవంతమైంది. భారత్ వైపు అమెరికా ఇంతకాలం అనుమానంగా చూస్తూ వచ్చింది. కాని ఇప్పుడు మాత్రం అభిమానంగా చూసింది. భారత్ కోరిందల్లా చేసింది. ఒబామా అమెరికా అధ్యక్షుడన్న దర్పాన్ని భారత పర్యటనలో కనపడనీయలేదు. భారత నాయకులలో ఒకడిగా కలిసిపోయాడు. ఇక్కడి సంప్రదాయాలలో ఇమిడిపోయేందుకు తమ దేశ సంప్రదాయాలను సైతం పక్కనపెట్టాడు.

భారత్ తో మైత్రిబంధం అమెరికాకు అవసరం కూడా. ఆసియా ఖండంలో చైనా, భారత్ బలమైన దేశాలు. చైనా కమ్యూనిష్టు దేశం. ఇది అమెరికాకు పోటీగా మారుతోంది. కాబట్టి చైనాకు అమెరికా దూరమైంది. 1999లో వాజ్ పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బిల్ క్లింటన్ భారత పర్యటన ద్వారా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి పట్టాలెక్కాయి. అప్పటి నుండే ఇరు దేశాల మధ్య కొంతవరకు అపోహలు తొలగిపోయి పరస్పరం సహకరించుకునే వాతావరణం ఏర్పడింది. తర్వాత యూపిఏ హయాంలోనూ జార్జిబుష్, ఒబామాలు భారత పర్యటనకు వచ్చారు. అయితే అణు విద్యుత్ విషయంలో ఇరు దేశాల మధ్య అనుమానాల తెరలు తొలగలేదు. కాని ఈసారి మోడీ మాత్రం ఆ అనుమానాలను తెంచేసి అణుబంధాన్ని పెనవేశాడు. ఈ దేశంలో ప్రతి పదిమందిలో ఒక్కరికైనా అమెరికాలోని ప్రవాసభారతీయులతో బంధుత్వమో, స్నేహమో ఉంటుంది. కాబట్టి అమెరికాతో భారత్ మైత్రిని దేశంలోని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter