25 February 2015 Written by 

ఆకాశం నుండి కరెన్సీ నోట్ల వర్షం

ఆకాశం నుంచి వర్షం కురిస్తే మామూలుగానే ఉంటుంది కానీ, కరెన్సీ నోట్లు కురిస్తే ఎలా ఉంటుంది. దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిసింది. ఇంకేముంది మరో ఆలోచన లేకుండా జనాలు వాటిని ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వాటి వెంబడి పరుగెత్తారు. కాగా, కారుల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఎక్కడి కార్లను అక్కడే నిలిపేసి ఆ నోట్లను ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయిందట. అలా కురిసింది చిల్లర పైసలు కాదు. ఏకంగా 500 దినార్ల(దుబాయ్ కరెన్సీ) విలువైన నోట్లు... సుమారు 88 పాండ్లు...అలాంటి నోట్లు వందలు, వేల నోట్లు... కావడం విశేషం. వాటి విలువ సుమారు రూ. 4.81 కోట్లు ఉంటుందని అధికారిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలో ఆ నోట్ల వర్షం కురిసిందని, అప్పుడు గాలి దుమారం, ఈదురు గాలులు బలంగా వీచాయని స్థానికులు తెలిపారు. 



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • దాహార్తికి మూగజీవాలు విలవిల
    తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…

Newsletter