01 May 2015 Written by 

నేపాల్... నేలపాలు

11169835 612341085569665 7875806725088936870 nప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో అత్యంత సుందరమైన దేశంగా ప్రసిద్ధి చెంది, ఎల్లవేళలా ప్రకృతి ఒడిలో పరవశించే నేపాల్ ను పెనుభూకంపం కబళించింది. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 11.56గంటలకు వచ్చిన పెనుభూకంపం ధాటికి నేపాల్ విలవిలలాడింది. వేలాదిమంది ప్రజలు ఈ భూకంపానికి బలయ్యారు. ఎన్నో ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలు, యాత్రాస్థలాలు, పెద్దపెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. ఎంతో వ్యయంతో నిర్మించుకున్న మహాసౌధాలే ఎంతోమంది పాలిట సమాధులయ్యాయి. ఈ మహావిపత్తుతో ఆ దేశం అతలాకుతలమైపోయింది. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.

హిమాలయాల్లో వున్న నేపాల్ కు ఎన్నో విశిష్టతలున్నాయి. పొరుగుదేశమే అయినా, భారతీయులందరూ నేపాల్ ను తమ సొంత దేశంగానే భావిస్తుంటారు. హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆలవాలమైన దేశంగా వుండడమే అందుకు ప్రధాన కారణం. హిమాలయ పర్వత శ్రేణుల్లో వున్న నేపాల్ కు ప్రధాన వనరుగా వుండేది పర్యాటక రంగమే. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది యాత్రీకులు నేపాల్ కు వస్తుంటారు. హిమాలయ సోయగాలను, ప్రకృతి శోభలతో అలరారే ఆ పర్వతగిరుల అందచందాలను తిలకించి పులకిస్తుంటారు. ప్రపంచంలో ఎత్తయిన 10పర్వతాల్లో 8పర్వతాలు నేపాల్ లోనే వుండడం మరో విశేషం. కనుకనే దీనికి పర్వతరాజ్యం అని కూడా పేరుంది.

అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎన్నో హిందూ దేవాలయాలకు నేపాలే నెలవు. అదేమి చిత్రమో కానీ పరమపవిత్రమైన పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో మాత్రం భూకంపం ఛాయలు లేకపోవడం ఎంతైనా ఆశ్చర్యమే. కాగా, పొరుగుదేశమైన నేపాల్ ను ఈ కష్టకాలంలో అన్ని విధాలా ఆదుకునేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టడం సంతోషదాయకం.

 ఇప్పటికే భూకంపం ధాటికి వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకోవడం, మరెన్నో వేలమంది క్షతగాత్రులు కావడం జరిగింది. భవనాల శిథిలాల్లో ఇంకా మరెన్నో మృతదేహాలున్నట్లు భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో భారత్ నేపాల్ కు పూర్తిస్థాయిలో అండదండలందిస్తూ వుండడం ముదావహం. ఏదేమైనా, ఈ భూకంప విలయానికి అన్నివిధాలా పూర్తిగా నష్టపోయిన నేపాల్ అందరి సహకారంతో త్వరలోనే కోలుకుంటుందని ఆశిద్దాం..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter