16 October 2015 Written by 

పర్వాలేదనిపిస్తున్న... బ్రూస్లీ

brusliభారీ అంచనాలతో రిలీజైన బ్రూస్లీ ఓ మాదిరి హిట్ టాక్ తో ముందుకు పోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ సన్నివేశంలో కనిపించడంతో... ఆయన కోసమే ప్రేక్షకులు చాలావరకు థియేటర్లకు బారులు కట్టారు. అయితే సినిమా మాత్రం అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు కొంచెం నిరాశచెందారనే చెప్పాలి. ఈ సినిమాలో లోటు పాట్లను, శ్రీను వైట్ల దర్శకత్వంలోని లోపాలను మెగా ఫ్యాన్స్ చిరంజీవి వద్దనే నేరుగా చెప్పారట. కాని మెగాస్టార్ మాత్రం సినిమాలో ఎన్ని లోటు పాట్లు వున్నా నేను నటించాను కాబట్టి, నా కోసమైనా ప్రేక్షకులు వస్తారు. దాంతో సినిమా బాగానే ఆడుతుందని చెప్పారట. ఏదేమైనా ముందే ఏవరేజ్ టాక్ వచ్చేసాక, ఇక ఆ సినిమాలో చిరంజీవి వుంటే మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వెళతారా. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సినిమాను రిలీజ్ చేయడంలో రామ్ చరణ్ తేజ్ సక్సెస్ అయినా, చిత్రం మాత్రం ఆశించినంత సక్సెస్ కాకపోవడం మెగా ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అందాలు బాగానే చూపించింది. కాని శ్రీను వైట్ల దర్శకత్వంలోని విభిన్నత ఈ చిత్రంలో కనిపించలేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter