23 October 2015 Written by 

అదరగొట్టిన ఎన్టీఆర్ న్యూ టీజర్

ntrనందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో... సినిమా టీజర్ విజయదశమి కానుకగా విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్  వుందో నెటీజన్లు తెలియజెప్పారు. ఈ టీజర్ విడుదలైన 12గంటల్లో 10లక్షల 50వేల హిట్స్ తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది. ఈ హిట్స్ తోనే ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతుంది. ఈ చిత్రానికి ముఖ్యంగా ఎన్టీఆర్ న్యూ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎంతో స్టైలిష్ గా, క్లాస్ లుక్ తో వున్న ఎన్టీఆర్ నందమూరి అభిమానులనే కాక సినీ ప్రియులను మెప్పించారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుండడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. సుకుమార్ ఎంత వైవిద్యమున్న దర్శకుడు ఇదివరకే అతను తీసిన సినిమాలు రుజువు చేసాయి. 


Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter