15 April 2016 Written by 

15-04-2016 రాశిఫలాలు

rasi 15

1Ariesమేషం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. బ్యాంకు ఋణాలు, ప్రభుత్వ అనుమతులు లభించగలవు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ధనానికి ఇబ్బందులుం డవు. వృత్తి వ్యాపారములందు అభివృద్ధి ఆదాయం పెరగడం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అను కూలత కలదు. చెల్లింపులు సకాలంలో జరుపుతారు.

 

2Taurusవృషభం

శుభకార్యాలలో పాల్గొంటారు. దైవక్షేత్రాల సందర్శన, ప్రముఖులను కలుసుకొనడం జరుగుతుంది. ఖర్చులు అదనంగా ఉండక తప్పవు. అనుకున్న కార్య క్రమాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి ప్రయత్నాలకు ప్రణాళికలు తయారు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరులకు సహాయపడటం, అధికారులతో సానుకూలత ఉంటుంది.

 

3Geminiమిధునం

పట్టుదల కోపాలను వదలి వ్యవహారాలను సామ రస్యంగా పరిష్కరించుకొనండి. ప్రభుత్వ అనుమతులు లభించగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపార, వృత్తి జీవనం కలిగిన వారు కొత్త పథకాలు గూర్చిన ఆలోచనలు, ఆదాయమున స్వల్ప పెరుగుదల ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి త్వరలో అవకాశాలుంటాయి. ఉన్నత విద్యావకాశాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

వ్యాపారులకు ఉద్యోగులకు ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులుండవచ్చును. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేసికొనడం మంచిది. చిరు వ్యాపారవర్గాలకు ఆదాయం పెరుగుతుంది. మిగిలిన వారికి ఆదాయ వ్యయాలు ఫరవాలేదనిపించును. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలుండి సర్దుబాటు కాగలవు. శుభకార్య ప్రయత్నా లలో అనుకూలత ఉంటుంది.

 

5Leoసింహం

గురు, శుక్రవారాలలో ఆర్ధిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. వస్తు వాహన గృహరిపేర్లు ఖర్చులుండగలవు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కళాక్రీడాకారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు దొరకగలవు. ఆరోగ్యం ఫరవాలేదు.

 

6Virgoకన్య

శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలించే అవకాశ మున్నది. ఉన్నత చదువులకు అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగులకు ప్రజలతో, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపకాలు పెరగడం వల్ల, అనుకున్న పనులు సరిగా చేయలేక టెన్షన్‌ పడుతుంటారు. వృత్తి వ్యాపార వర్గాలకు ఆదాయం సామాన్యంగా ఉంటుంది. అభివృద్ధి రేటు తగ్గుతుంది. ఇతరులకు సహాయపడతారు.

 

7Libraతుల

బంధువర్గంతో సమస్యలు రావచ్చును. బంధు ముఖ్యుల అనారోగ్య వార్తలు వింటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అవకా శాలు, అభివృద్ధి తగ్గుతుంది. సంప్రదింపులు, అగ్రిమెంట్ల విషయాలలో ఆలోచించి వ్యవహరించండి. స్థిరాస్తుల వృద్ధికి వ్యాపారవృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగులకు, వ్యాపార వర్గాలకు అధికారుల వల్ల ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆదాయం తగ్గవచ్చును. అనుకున్న పనులు, చేపట్టిన వ్యవహారాలను సక్రమరీతిలో నిర్వ హించలేక పోవచ్చును. అవసరాలకు ఋణాలు చేయ వలసి వస్తుంది. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం జరుగుతుంది. ఉన్నత విద్యావకాశాలు కలవు.

 

9Sagittariusధనుస్సు

ఖర్చులు అదనంగా ఏదో ఒక రూపంలో ఉండి తప్పించుకొనలేరు. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. తొందరపాటు వ్యవహారాలతో ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉండవు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబ సభ్యు లకు అనారోగ్య బాధలుంటాయి. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో ఆందోళనగా ఉంటారు.

 

10Capricornమకరం

అధికారుల అనుమతులు ఆలస్యం కాగలవు. అను కున్న పనులకు స్వల్ప ఆటంకాలున్నా, పని పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి వత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. బాకీల విషయంగా వత్తిడులకు లోను కాగలరు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

11Aquariusకుంభం

ఉన్నత విద్య, శుభకార్యాలపై దృష్టి పెడతారు. వస్తు వాహన గృహ రిపేర్లుండగలవు. కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుండగలవు. రావలసిన బాకీలు వసూలు కాగలవు. కుటుంబసభ్యులలో సరైన అవగాహన లేక అభిప్రాయబేధాలు ఏర్పడవచ్చును. అనుకున్న పనులను సాధించుకొంటారు. కొత్త కాంట్రాక్టులు, కొత్త ఏజెన్సీ లకు ప్రయత్నాలు చేయండి. జరిగిపోయిన విషయాలు గుర్తు చేసి ఇతరులను బాధపెట్టవద్దు.

 

12Piscesమీనం

కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు చేయడం, క్రయ విక్రయాలు నిర్ణయం కావడం జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆశించినంత ఆదాయముండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ రాబడి ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు లభించగలవు. దూర ప్రయా ణాలు జరుగుతాయి. చెల్లింపులు సకాలంలో చెల్లిస్తారు. అనుకూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter