13 May 2016 Written by 

చిల్లు పెట్టి.. కొల్లగొట్టి..!

oil thefsకష్టపడేవాడు ఆనుక్షణం కష్టపడు తుంటే, దోపిడీగాళ్లు రాత్రివేళ మాటువేసి ఆ కష్టాన్నంతా క్షణాల్లోనే దోచుకుపో తుంటారు. ఏమాత్రం ఏమరుపాటు వహించినా మాయగాళ్ళు ఉన్నదంతా ఊడ్చుకుపోతుంటారు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన పైప్‌లైన్ల విషయంలో కూడా దాదాపు ఇదే జరిగింది. ఆ పైప్‌ లైన్లకు కూడా చిల్లులు పెట్టి అందులో వెళ్తున్న పామాయిల్‌ను పెద్దఎత్తున దొంగి లించుకుపోయేందుకు కేటుగాళ్ళు పథకం వేసుకున్నారు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ రహస్య చోరులను పోలీసులు పసిగట్టి, దుండగుల గుట్టు రట్టు చేశారు. పామాయిల్‌ను పైపు ల్లోంచే కాజేస్తున్న ఆ 13 మంది మాఫియా ముఠాను అరెస్ట్‌ చేసి, వారి నుంచి సుమారు 60లక్షల విలువచేసే పామాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, దుండగులు పామాయిల్‌ తరలించేందుకు సిద్ధం చేసుకున్న 5 లారీలను, మరో 2 కార్లను కూడా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 3కోట్ల దాకా వుంటుందని అంచనా. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీతో పాటు, రూరల్‌ డిఎస్పీ, సిఐలు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది ఆంతా కలసి పక్కా ప్రణా ళికతో ఈ దుండగుల ఆట కట్టించారు. బుధవారం ఆ మాయగాళ్ళ వివరాలను ఎస్పీ విలేరుల సమావేశంలో వెల్లడిం చారు. ఆ వివరాలిలా వున్నాయి. ముత్తు కూరు మండలంలోని కృష్ణపట్నం పోర్ట్‌కు అనుసంధానంగా 7రిఫైనరీ ఫ్యాక్టరీ లున్నాయి. నౌకల ద్వారా వచ్చిన ముడి పామాయిల్‌ను పోర్ట్‌లోని బెర్త్‌ల నుంచి పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఆ ఫ్యాక్టరీలకే తరలిస్తుంటారు. అందుకు పది కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈ మాఫియా ముఠా ఆ ముడి పామాయిల్‌ను భారీఎత్తున దొంగిలించ డానికి పథకం వేసింది. ఈ దుండగుల ముఠా వారంతా కాకినాడ, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, గణపవరం ప్రాంతాలకు చెందినవారని పోలీసులు గుర్తించారు. మొత్తం 13మంది ఒక ముఠాగా ఏర్పడి, కృష్ణపట్నం పరిసరాల్లో మకాం వేసి, ఈ పైప్‌లైన్‌ వెళ్ళే ప్రాంతాల్లో అక్కడక్కడా స్థలాలను లీజుకు తీసుకు న్నారు. తామంతా ప్యాక్టరీల నుంచి పామా యిల్‌ను ఇతర ప్రాంతాలకు పంపుతుంటా మని, ట్యాంకర్లు నిలుపుకునేందుకు స్థలం కావాలని అక్కడి ప్రజలను నమ్మించి, స్థలాలను లీజుకు తీసుకుని, ఆ స్థలాల్లో షెడ్‌ వేసుకున్నారు. ఇక అక్కడినుంచి తమ చేతివాటపు పని ప్రారంభించారు. జన సంచారం తగ్గిపోగానే, రాత్రి వేళల్లో పామాయిల్‌ పైప్‌కు చిల్లు పెట్టడం, ఆ పామాయిల్‌ను తమ ట్యాంకర్లలో నింపు కోవడం, నకిలీ వే-బిల్లులతో హైదరా బాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లోని రిఫైనరీ ఫ్యాక్టరీలకు అమ్మేయడం..ఇదీ తంతు. ఒక ట్యాంకర్‌ ముడి పామాయిల్‌ విలువ మార్కెట్లో సుమారు 12 లక్షలుంటే, దోచుకున్న సొత్తు కనుక కేవలం వీరు దానిని అయిదారు లక్షలకే అమ్మేసేవారు. గత రెండు నెలలుగా జరుగుతున్న ఈ చోరీతో, అసలైన ఫ్యాక్టరీలకు రావాల్సిన ముడిపామాయిల్‌ తగ్గిపోతుండడాన్ని గమ నించిన ఆయా ఫ్యాక్టరీలవారు ఆ పామా యిల్‌ ఎటుపోతోందో అర్ధం కాక పోలీసు లకు ఫిర్యాదు చేసి, జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఆ ముఠాను పట్టుకునేందుకు పోలీసు బృందాలు వ్యూహరచన చేశాయి. మరోవైపు ముఠాసభ్యుల్లో వచ్చిన విభేదాలు పోలీస్‌స్టేషన్‌దాకా రావడంతో, తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మొత్తం వ్యవహార మంతా బయటకొచ్చింది. తొలుత పోలీ సులు తమ దర్యాప్తులో భాగంగా పామా యిల్‌ పైప్‌లైన్‌వద్ద సర్వేయర్‌గా పనిచేస్తున్న కోసు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా, కాకినాడకు చెందిన బొందు నారాయణ, చింతకాయల శ్రీను కలసి పంటపాళెం వద్ద పామాయిల్‌ను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. దొంగిలించిన ఆ పామాయిల్‌ను గుంటూరుజిల్లా చిలక లూరిపేటకు చెందిన చిలకల బాలాజీ, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన చక్రధరరావు అలియాస్‌ శెట్టిలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. దీంతో, చిలకలూరిపేట గణపవరంలోని గోదా ములో బాలాజీని, అతని అనుచరుడైన రఘునాధ్‌, సీతారామయ్య, శ్రీనులను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు ట్యాంకర్ల పామాయిల్‌ను, కాకినాడకు చెందిన నారాయణ అనుచరులైన నాగే శ్వరరావు, సిద్దూ, శంకర్‌, శ్రీధర్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. కేసును ఛేదించిన పోర్ట్‌ సిఐ శ్రీనివాసరావును, ముత్తుకూరు ఎస్‌ఐ, పోర్ట్‌ ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter