20 May 2016 Written by 

హోదా రాకుంటే...మొదటి నష్టం నెల్లూరుకే!

nellore ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పెద్ద చర్చ నీయాంశమైంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం ఖరారుగా చెప్పేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపి ప్రజలు ఎంతగా బాధపడ్డారో, ఇప్పుడు హోదా లేదని చెప్పాక కూడా అంతే బాధ పడుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి సాధారణమేనని దీంతో తేలిపోయింది.

విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. చంద్రబాబు పరిపాలన రాష్ట్రాన్ని మరింత అధ్వాన్న స్థితిలోకి తీసువెళుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చివుంటే కనీసం పారిశ్రామిక రంగంలోనన్నా కొంత కదలిక ఉం డేది. ఇప్పుడు అది కూడా చచ్చుబడిపోయినట్లే!

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుంటే మొదట నష్టపోయేది నెల్లూరే! రాష్ట్రంలోని 13జిల్లాల్లో పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది నెల్లూరుజిల్లానే! ప్రత్యేక హోదా ఇచ్చివుంటే తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలతో పాటు

ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాల నుండి కూడా ఎన్నో పరిశ్రమలు నెల్లూరుకు తరలివచ్చేవి. మరెన్నో కంపెనీలు తమ పరిశ్రమలను ఇక్కడ స్థాపించడానికి ముందుకొచ్చేవి. ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అనువుగా వున్నది ఈ జిల్లానే! కృష్ణపట్నం పోర్టుతో రవాణా సౌకర్యం, పరిశ్రమల ఏర్పాటుకు ఆ సెజ్‌లోనే భూములు లభించడం అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇక తడ వద్ద శ్రీసిటీ సెజ్‌ పరిశ్రమల ఏర్పాటుకు అత్యుత్తమ సెజ్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ఎక్కువుగా తమిళనాడు పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చే అవకాశముంది. ఇంకా మేనకూరు సెజ్‌, అపాచి, ఇఫ్‌కో సెజ్‌, చింతవరం సెజ్‌లు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా వున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూములున్నాయి. ప్రజలతో ఇబ్బంది లేదు. రవాణా సౌకర్యాలున్నాయి. ఉద్యోగుల నివాసానికి, సిబ్బందికి కొరత లేదు. కావాల్సిందల్లా పారిశ్రామికంగా ఎన్నో రాయితీలు కల్పించే ప్రత్యేకహోదానే! ఇది వస్తే నెల్లూరుజిల్లా పారిశ్రామికంగా పరుగులు తీయడం ఖాయం.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter