26 May 2016 Written by 

టోల్‌ ఉంటుంది... ప్లేస్‌ మారుతుంది!

tollనెల్లూరు సమీపంలో కనుపర్తిపాడు క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై పెట్టదల చిన టోల్‌గేట్‌పై తీవ్ర స్థాయిలో ఆందోళనలు తలెత్తడం తెలిసిందే! టోల్‌గేటుకు వ్యతిరేకంగా చేసిన ఈ ఉద్యమంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చురుకైన పాత్రను పోషించాడు. ఆయనే చొరవ తీసుకుని అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో టోల్‌గేటు వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇక్కడ టోల్‌గేటు పెడితే నగరంలో ట్రాఫిక్‌ పెరగడంతో పాటు భారీ వాహనాలు కూడా నగరంలోకి వచ్చే ప్రమాదముంది. దీనికితోడు రూరల్‌లో అనేక గ్రామాల ప్రజలకు ఇది తలనొప్పిగా మారే అవకాశముంది. అందుకే ఈ టోల్‌గేటుపై కోటంరెడ్డి పట్టువిడవకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలు ఫలితమిచ్చేటట్లే కనిపిస్తున్నాయి. టోల్‌గేటు ఆందోళనల అంశం కేంద్ర రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టోల్‌గేటును నెల్లూరు సమీపంలో కాకుండా కోవూరు - నార్త్‌రాజుపాలెం మధ్యలో పెట్టే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుండి కావలికి 56కిలోమీటర్ల దూరం వుంది. కావలి దగ్గర ఒక టోల్‌గేటు వుంది. 36కిలోమీటర్ల లోపు టోల్‌గేటు పెట్టకూడదు. కోవూరు, రాజుపాలెం మధ్య టోల్‌గేటు పెడితే నిబంధనల ప్రకారం లెక్క కూడా సరిపోతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter