10 June 2016 Written by 

బ్రతకలేకుంటే బ్రతికించు!

narayanammaఆరిపోయే దీపంతో ఇంకొన్ని దీపాలను వెలిగించవచ్చు. కాకపోతే ఆ ఆలోచన రావా లంతే! బ్రతుకులూ అంతే... ఆరిపోయే ఒక జీవితం పది జీవితాలకు వెలుగు తేగలదు. మనం బ్రతుకుతూ పదిమందిని బ్రతికిం చడం ఒక ఎత్తయితే, మనం మరణిం చినా, ఇప్పుడు నలుగురిని బ్రతికించడం మానవతా వనంలో వెలసిన ఒక కొత్త కాన్సెప్ట్‌! ఆ కాన్సెప్ట్‌ పేరే అవయవ దానం. దీనికి పేద, కోటీశ్వరుల తేడా లేదు. కుల మతాల పట్టింపులేదు. వర్గం, వర్ణం విచక్షణ లేదు. మానవత్వం ఉన్న మనుషులైతే చాలు.

అవయవదానం... ఇప్పుడు దేశమంతా ఒక ఉద్యమంలా జరుగుతోంది. ఇదొక మానవతా ప్రక్రియ. నేను చావు అంచుల్లో వున్నా, నా వల్ల నలుగురికి పునర్జన్మ రావాలని కోరుకునే మహోన్నత దృక్పథం. ఈ గొప్ప మానవతా ఉద్యమంలో నెల్లూరు జిల్లా వాసులు మేము సైతం ఓ సమిధను అందిస్తామంటూ ముందుకొస్తుండడం చూస్తుంటే వారికి జేజేలు పలికినా తక్కువే!

బ్రెయిన్‌డెడ్‌కు గురై ఇక కోలుకోవడం కష్టమనుకున్న దశలో ఆ వ్యక్తుల అవయవదానాలకు కుటుంబసభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొస్తున్న సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఈ నెల మొదటివారంలో దొరవారిసత్రం మండలంలో చోటు చేసుకున్న సంఘటనే దీనికి ఉదాహరణ. ఈ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మ ఈ నెల 1వ తేదీన ఉతికిన బట్టలను ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లి బట్టలను ఆరేస్తూ ప్రమాదవశాత్తు క్రింద పడిపోయింది. భర్త వెంకయ్య ఇది గమనించి వెంటనే నాయుడుపేట ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రాథమికి చికిత్స చేసి నెల్లూరుకు తీసుకుపోండని సూచించారు. వెంకయ్య ఆమెను పెద్దాసుపత్రికి తీసుకొచ్చాడు. పెద్దాసుపత్రిలో సిబ్బంది పేషంట్లను ఎంత బాగా చూస్తారో మనకు తెలిసిన విషయమే కదా! ఉదయం 11గంటలకు పేషంట్‌ను తీసుకొస్తే మధ్యాహ్నం 3గంటల దాకా ఆమెను పట్టించుకో లేదు. దీంతో ఆమెను బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు ఆమెకు మెడ భాగంలో బలమైన దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్లిందని, ఇక బ్రతకడం కష్టమని నిర్ధారించారు. నారాయణమ్మను ఎలాగూ బ్రతికించుకోలేము, కనీసం ఆమె అవయవా లతో మరికొందరిని బ్రతికిద్దామని వైద్యులు ఇచ్చిన సలహా ఆమె భర్త వెంకయ్యను, కుటుంబసభ్యులను కదిలించింది. వారు అందుకు అంగీకరించడంతో బొల్లినేని వైద్యులు జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ అనుమతి పొంది అవయవాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3న నారాయణమ్మకు ఆపరేషన్‌ నిర్వహించి గుండె, ఊపిరితిత్తులను ఎయిర్‌ అంబు లెన్స్‌లో చెన్నైలోని పోర్టిస్‌మలార్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా గుండెను అమ ర్చారు. కాలేయంను విజయవాడలోని మణిపాల్‌ ఆసుపత్రికి, ఒక కిడ్నీని కిమ్స్‌ ఆసుపత్రికి, ఇంకో కిడ్నీని నారాయణ ఆసుపత్రికి తరలించగా, నేత్రాలను మాడరన్‌ కంటి ఆసుపత్రి వాళ్లు సేకరించారు. ఇలా నారాయణమ్మ ఒక్క దీపంగా ఆరిపోయినా 8 ఇళ్లల్లో దీపమై వెలిగింది. నారాయణమ్మ పేదింటి ఆడబిడ్డ అయినా తన అవయవదానంతో ధనంతో వెలకట్టలేని మానవతను తన చరిత్రలో రాసుకుంది.

దాదాపు ఏడాది కాలంలో జిల్లాలో 5మంది దాకా అవయవ దానం చేశారు. ఈ ఉద్యమం మున్ముందు మరింత చైతన్యవంతమై ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. ఈ స్ఫూర్తిజ్యోతిని వెలిగించిన అవయవదాతలు, వారి కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter