08 July 2016 Written by 

అపాచీ ఆటో పంచాయితీ!

apache workersసూళ్లూరుపేట సమీపంలోని 'అపాచి' సెజ్‌లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరు ఫ్యాక్టరీలో బ్రతుకుతెరువు కోసం పని చేస్తూ, ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు, తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు మాత్రం బ్రతుకును పణంగా పెట్టి హైవే మీద ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణించేది ఆటోలలో.

ఒక్కో ఆటోలో నిబంధనల ప్రకారం ముగ్గురే ప్రయాణించాలి. ఇక్కడి ఆటోలలో మాత్రం 15మందికి తక్కువ వుండరు. అపాచీ ఫ్యాక్టరీ నుండి నాయుడుపేట వరకు హైవే మీద కార్మికులతో నిండిన ఆటోలు రేస్‌ గుర్రాల్లా దూసుకుపోతుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కార్మికులు షిప్ట్‌ ముగించుకుని వెళ్లేటప్పుడు జాతీయ రహదారి మీద దాదాపు వందల ఆటోలు ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని పక్కనొకటి... ర్యాలీగా పోతూ వెనుకవచ్చే వాహనాలకు చాలా ఇబ్బందిగా వుంటోంది. రాత్రి వేళల్లో ఆటోల మూలంగా జరగరానిది జరిగితే ప్రాణనష్టం తీవ్రంగానే ఉంటుంది. ఈ సమస్యను చాలాకాలం క్రితమే 'లాయర్‌' వెలుగులోకి తెచ్చింది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిపెట్టిన ఎస్పీ అపాచీ కార్మికుల ఆటోప్రయాణం గురించి తెలుసుకున్నారు. కార్మికులకు ఆటోలు కాకుండా బస్సులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అపాచీ ఫ్యాక్టరీ చైనావాళ్లది. ఇసుక నుండి నూనెను పిండే రకం వాళ్లు. కార్మికుల చేత గొడ్డు చాకిరి చేయించుకుని చాలీచాలని జీతాలిస్తుంటారు. సొంతంగా సంస్థకు బస్సులు పెడితే ఖర్చు ఎక్కువవుతుం దని భావించి ఆర్టీసీ అద్దె బస్సులను మాట్లాడుకోవాలనుకున్నారు. ఎవరైనా అద్దె బస్సులంటే ట్రిప్పుకింతని, లేదంటే నెలకు ఇంతని మాట్లాడుకుంటారు. కాని అపాచీ వాళ్లు మాత్రం ఆర్టీసీ అధికారులకు వెరైటీ ప్రతిపాదన పంపారు. తమ కార్మికులందరికీ 20రోజుల పాస్‌లు తీసిస్తామని, వారి కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా బస్సులు నడపాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిని ఆర్టీసీ అధికారులు తోసిపుచ్చారు. ఇలా నడిపితే మాకు నష్టం తప్ప లాభం లేదని, మేం బస్సులు ఇవ్వలేమని అపాచీ వారికి చెప్పినట్లు సమాచారం. అపాచీ వాళ్లకు ఆదాయాల మీదున్న శ్రద్ధ కార్మికుల భద్రతపై లేకపోవడం విచారకరం.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter