Friday, 22 July 2016 15:40

వివేకాను దేవుడిని చేసిన నారాయణ

Written by 
Rate this item
(0 votes)

galpikaవిజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్య మంత్రి చంద్రబాబు కార్యాలయం. చంద్ర బాబు చేతిలో పేపర్లు పట్టుకుని సీరి యస్‌గా వున్నాడు. ఎదురుగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాథ రెడ్డి తదితరులున్నారు. నారాయణవైపు చంద్రబాబు సీరియస్‌గా చూస్తూ... నీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూడు... సర్వేలో ఏం తేలిందో చూడు... మున్సిపల్‌ మంత్రిగా నీ పనితీరుకు వచ్చిన మార్కులు చూడు... వందకు ముప్ఫైఐదు... ఇన్ని వందల విద్యాసంస్థలు నడుపుతున్నావు, ఇన్ని లక్షల మంది విద్యార్థులకు ర్యాంకులు తెస్తున్నావు. నువ్వు మాత్రం అత్తెసరు మార్కులు తెచ్చుకున్నావు. ఇదేనా నీ పని తీరు. నీకంటే దేవినేని ఉమామహేశ్వర రావు నయం... పనితీరులో ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకున్నాడు, అని మందలించాడు. చంద్రబాబు మాటలతో నారాయణకు భలే బాధేసింది. నన్నెప్పుడూ మా నాయన, అమ్మ కనీసం భార్య కూడా ఇలా తిట్టలేదు. నా మానాన నేను శుభ్రంగా కాలేజీలు నడుపుకుంటుంటే, తెచ్చి రాజ కీయాల్లో పడేసారు, ఈ తొక్కలో రాజకీ యాల్లో మంత్రులకు మళ్లీ ర్యాంకులు... మార్కులు... అని మనసులో తిట్టుకుంటూ అప్పుడే అక్కడకు వచ్చిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని పక్కకు పిలిచాడు. అన్నా, మీరు అనుభవజ్ఞులు... మంత్రిగా నా ర్యాంకును ఎలా మెరుగుపరుచుకోవాలో చెప్పి పుణ్యం కట్టుకోండి. మొదటి ర్యాంకు తెచ్చుకున్న ఆ దేవినేని ఉమ చేసిందేమిటి? చివరి ర్యాంకు తెచ్చుకున్న నేను చేయని దేమిటి? తేడా ఎక్కడుందో మీరే చెప్పం డని బ్రతిమలాడాడు. అందుకు బొజ్జల... మన ముఖ్యమంత్రికి కూల్చడం, కట్టడం, మొక్కలు నాటడం, చెట్లు పీకడం వంటి పనులు బాగా నచ్చుతాయి. ఈమధ్య కృష్ణ పుష్కరాలకోసమని విజయవాడలో 45 దేవాలయాలను కూల్చారు కదా... చంద్ర బాబు వద్ద దేవినేనికి అక్కడే మార్కులు పడ్డాయి. కాబట్టి అలాంటివేవన్నా ఉంటే చూస్కో అని బొజ్జల సలహాఇచ్చాడు. వెం టనే నారాయణ ఆ దిశగా దృష్టి పెట్టాడు.

-----

ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్‌ హాల్‌. మంత్రి నారాయణతో పాటు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, టౌన్‌ ప్లానింగ్‌ డైరక్టర్‌ రఘు, కమిషనర్‌ వెంక టేశ్వర్లు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, స్టైల్‌ ఆఫ్‌ సింహ పురి ఆనం వివేకానందరెడ్డి(65), మాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు వున్నారు. నారాయణ వారినుద్దేశించి మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలన్నీ కూల్చాలను కుంటున్నార... మీ సహకారం కావాల న్నాడు. అందుకు కోటంరెడ్డి, అనిల్‌లు లేచి... అలాగే సహకరిస్తాం, కాకపోతే మొదట మీ కాలేజీ భవనాలనుండే మొదలు పెట్టండి, అలా కాకుండా సామాన్య ప్రజల కట్టడాల జోలికి పోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరించి పెళ్లిపోయారు.

చంద్రమోహన్‌రెడ్డి గారు... ఈ విష యంపై మీ అభిప్రాయమేంటని నారా యణ అడిగాడు. వెంటనే సోమిరెడ్డి... వేళ్ల మీద నాలుగు నిముషాలు లెక్కలు వేసి... మంత్రి గారు, మనం కూలగొట్టేది నాలుగు వందల ఇళ్లే... కాని నాలుగు లక్షల మంది మనకు ఫేవర్‌ అవుతార న్నాడు. వెరీగుడ్‌, ఇలాంటి సలహాలే నాకు కావాలి అంటూ ఆదాల గారు... మీ అభిప్రాయం చెప్పండని నారాయణ కోరాడు. ఆదాల మాట్లాడుతూ... అభి వృద్ధి కోసం మనం దేవుళ్లుంటున్న ఆల యాలనే కూల్చేస్తున్నారు, అలాంటిది తుచ్ఛ మానవులుండే ఇళ్లు ఓ లెఖ్ఖ! మీకెందుకు, మీరు కూలగొట్టండి, మీ వెనుక మేము న్నాం అని భరోసా ఇచ్చాడు. వివేకన్నా, మీరేమంటారని నారాయణ అడిగాడు. వివేకా కళ్లకు నల్లద్దాలు పెట్టుకుని అలాగే కూర్చుని వున్నాడు. నారాయణ ప్రశ్నకు ఆయనలో స్పందన లేదు. మళ్ళీ నారా యణే వుండి... వివేకన్న ఏదో దీర్ఘాలో చనలో వున్నట్లున్నారు, మన మాటలు వింటున్నట్లు లేదు అని అన్నాడు. అప్పుడు వివేకా పి.ఏ రంగరాజు వుండి... దీర్ఘా లోచనా పాడా సార్‌, ఆయన నిద్రపోతు న్నాడు. మీరు చెప్పింది వింటున్నట్లు నటించడానికే అలా కళ్లకు నల్లద్దాలు పెట్టేసారు. నేను లేపుతానుండండి అంటూ సార్‌, సార్‌... అంటూ భుజం మీద తట్టాడు. వివేకా ఉలిక్కిపడుతూ లేచి... రాజూ, ఒక బెడ్‌కాఫీ తెమ్మని చెప్పు అని చెప్పాడు. దానికి రాజు... సార్‌, మీరు మీ బెడ్‌రూంలో లేరు, కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌లో వున్నారని చెప్పాడు. వివేకా వెంటనే తేరుకుని... సారీ నారాయణ, రాత్రి సెకండ్‌షోకు 'చీకట్లో చిలిపి ఆట' సినిమాకు వెళ్లాను, ఇంటికొచ్చాక కూడా ఆ సినిమా సీన్‌లే గుర్తు చేసుకుంటుం డడంతో సరిగా నిద్రపట్టలేదు. ఆ ఎఫెక్టే ఇది... అయినా విషయం చెప్పు అని అడిగాడు. నారాయణ కట్టడాల కూల్చి వేత గురించి చెప్పాడు. దీనికంత మొహ మాటం ఎందుకు నారాయణ... నువ్వు ఒక్క మాట చెప్పు అక్రమ కట్టడాల కూల్చి వేతకు గడ్డపార పట్టుకుని నేనే బయలు దేరుతా... అని వివేకా చెప్పాడు. ఆ మాటలతో నారాయణకు ఎనలేని ధైర్యం వచ్చింది. రేపట్నుండే కూల్చివేతలు ప్రారంభించండని టౌన్‌ప్లానింగ్‌ డైరక్టర్‌ రఘును ఆదేశించి నారాయణ విజయ వాడకు బయల్దేరడానికి లేచాడు.

-----

విజయవాడలో సీఎం క్యాంప్‌ కార్యా లయం. చంద్రబాబు, మంత్రులు కూర్చుని వున్నారు. నారాయణ సీరియస్‌గా వెళ్లి చంద్రబాబుతో టీవీ ఆన్‌ చేయండి సార్‌, అని అడిగాడు. ఏమైంది నారాయణ... అంత సీరియస్‌గా వున్నావని అడిగాడు చంద్రబాబు. అందుకు నారాయణ... నేనెందుకూ పనికిరాని సన్యాసినని, పని తీరులో చివరి ర్యాంకు ఇచ్చారు కదా, నా పనితీరు ఎలావుందో టీవీలో చూడండి, విజయవాడలో మీరంతా కలిసి చేసిన విధ్వంసం కంటే నెల్లూరులో నేను చేయి స్తున్న విధ్వంసమే ఎక్కువ... అది చూసా రంటే వందుకు వంద కాదు వందకు నూటపాతిక మార్కులేస్తారన్నాడు. చంద్రబాబు వెంటనే టీవీ ఆన్‌ చేసి టివి 9.9=99/999 ఛానెల్‌ పెట్టాడు.

నెల్లూరు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత దృశ్యాలొస్తున్నాయి. జనం గుం పులు గుంపులుగా అక్కడ చేరి అధికారు లతో గొడవ పడుతున్నారు. కూల్చివేత లను నిరసిస్తూ అన్ని పార్టీల నాయకులు అక్కడ చేరుతున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన సోమిరెడ్డి ముందు టీవీ ఛానెల్స్‌ వాళ్లు మైకులు పెట్టారు. సోమిరెడ్డి మాట్లా డుతూ... ఈ కూల్చివేతలు దారుణం, ఏకపక్ష నిర్ణయం, మా ముఖ్యమంత్రి ఇలాంటి వాటిని సహించడు... నాలుగు వందల కట్టడాలను కూలిస్తే నాలుగు లక్షల మంది మా పార్టీకి వ్యతిరేకం అవుతారన్న విషయం మా నారాయణకు తెలియదు. ఇటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లు మంత్రులైతే పరిణామాలు ఇలానే ఉంటాయని చెప్పాడు. అక్కడే వున్న ఆదాల... టీవీ ఛానెల్స్‌తో మాట్లా డుతూ... నారాయణ నగరాభివృద్ధి చర్యలు తీసుకుంటే మేం అండగా నిలుస్తామని చెప్పాం, కాని ఆయన అభివృద్ధికి కాకుండా ఇలాంటి విధ్వంసాలకు పూనుకుంటాడని వూహించలేకపోయాం, ఈ సంఘటన లను మేం వెంటనే చంద్రబాబు దృష్టికి తీసుకెళతాం అని చెప్పాడు. అప్పుడే అక్కడకు వివేకా వచ్చాడు. ఆయనను చూడగానే ఆడ, మగ, పిల్ల, ముసలి బాధితులందరూ చుట్టుముట్టి... చూడు నాయనా, మాకు ఎంత అన్యాయం చేసారో అని ఏడుస్తుంటే, వివేకా కళ్లద్దాలు తీసి ఏడుస్తూ... ఏం చేసేదక్కా... ప్రజ లతో సంబంధాలు లేనివాళ్లు మంత్రులైతే ఇలాగే ఉంటుందక్కా... అని అంటుం డగా, గుంపులోనే ఇంకో బాధితుడు... నిజంగా నువ్వు దేవుడివయ్యా, నీ హయాంలో ఎన్ని అక్రమ భవనాలు కట్టు కోలేదు, ఒక్కటన్నా కూల్చారా... నీలాం టోళ్లే ప్రజలకు కావాలయ్యా... నువ్వు దేవుడివయ్యా... అని వివేకా చేతులు పట్టుకుని ఏడవసాగాడు.

టీవీలో ఆ సీన్‌లన్నీ చూసిన నారా యణకు తల తిరగసాగింది. చంద్రబాబు నవ్వుతూ నారాయణతో... వ్యాపారమే కాదు, రాజకీయాలు కూడా కాస్త వంట బట్టించుకో, ఇప్పుడు చెప్పు నూటికి ఎన్ని మార్కులు వేయమంటావ్‌ అంటూ లేచాడు.

Read 270 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter