29 July 2016 Written by 

కృష్ణపట్నం పోర్టులో... రాష్ట్రంలోనే తొలి గోల్ఫ్‌కోర్ట్‌!

golf corకృష్ణపట్నం పోర్టు... నెల్లూరు జిల్లా అభివృద్ధికి వేదిక. జిల్లా ప్రజలకు కానుక. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఈ జిల్లా అభివృద్ధికి చేసిన సపోర్ట్‌... ఈ పోర్టు! ఇదే గనుక లేకుంటే జిల్లాలో వ్యవసాయం, ఆక్వా, చిన్న వ్యాపారాలు తప్పితే పారిశ్రామిక ప్రగతే ఉండేది కాదు. దక్షిణాసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టు దేశీయంగానే కాదు, విదేశాల నుండి వచ్చే పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉద్యో గులకు అనుగుణంగా మౌలిక వసతులను సమకూర్చుకుంటోంది. ఈ పరంపరలోనే రాష్ట్రంలోనే తొలి గోల్ఫ్‌ కోర్టును పోర్టు ప్రాంగణంలో రూపొందించింది. ఇది బీచ్‌ గోల్ఫ్‌కోర్ట్‌. సముద్ర తీరంలో దాదాపు 20 ఎకరాల స్థలంలో ఇప్పటికి 10కోట్ల ఖర్చుతో ఈ గోల్ఫ్‌ కోర్టును నిర్మించారు. ఈ నెల 25వ తేదీన కేంద్రమంత్రులు యం.వెంకయ్యనాయుడు, సురేష్‌ ప్రభులు ఈ గోల్ఫ్‌ కోర్ట్‌ను ప్రారంభించారు. గోల్ఫ్‌ కోర్టులను రూపొందిం చడంలో విశేష అనుభవం వున్న ఇంగ్లాండ్‌కు చెందిన నిపుణులు ఈ గోల్ఫ్‌ కోర్ట్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా జపాన్‌ పారిశ్రామిక వేత్తలను దృష్టిలో పెట్టుకుని పోర్టు యాజమాన్యం దీనిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. జపాన్‌కు చెందిన అనేక కంపెనీలు కృష్ణపట్నం సెజ్‌లో తమ పరిశ్రమలను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశంలో పెట్టుబడులకు కృష్ణపట్నం సెజ్‌ అనువైనదిగా వారు భావిస్తున్నారు.

దేశంలోని మిగతా పోర్టులతో పోలిస్తే కృష్ణపట్నం పోర్టు నుండి జపాన్‌కు ప్రయాణ సమయం ఒకరోజు తగ్గుతుంది. జపాన్‌ వాళ్లు ఒక్క నిముషం కాలాన్ని కూడా వృధా చేయరు. కాబట్టే కృష్ణపట్నంకు వాళ్ళు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జపాన్‌ కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు, ఇక్కడే వారికి ప్రత్యేక కాలనీ కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జపనీస్‌ ఇష్టంగా ఆడేది గోల్ఫ్‌కోర్టు.

ప్రత్యేకంగా వారి కోసమే పోర్టులో ఈ గోల్ఫ్‌కోర్స్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter