05 August 2016 Written by 

హై'కోర్టు'లో జడ్పీటీసీల బంతి

ap highనెల్లూరుజిల్లాలో 8మంది జడ్పీటీసీల భవిష్యత్‌ బంతి ఈ రోజు హైకోర్టులో వుంది. హైకోర్టు నిర్ణయాన్ని బట్టే వాళ్లకు పదవులు ఉండడమా? ఊడిపోవడమా? అన్నది తేలుతుంది. 2014లో జరిగిన నెల్లూరు జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైకాపా 31 జడ్పీటీసీలను గెలుచుకోగా, తెలుగుదేశంకు 15జడ్పీటీసీలు దక్కాయి. అయితే అప్పుడే అసెంబ్లీ ఫలితాలు వెలువడి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో నెల్లూరు జడ్పీపై ఆ పార్టీ నాయకుల కన్ను పడింది. వైకాపా నుండి 8 మంది జడ్పీటీసీలు పి.నారాయణ రెడ్డి, కె.కవిత, ఎస్‌.పెంచలమ్మ, ప్రసాద్‌గౌడ్‌, టి.రమేష్‌, ఎం.విజేత, డి.భారతి, షేక్‌ సలీమ్‌, ఉషారాణిలు తెలుగుదేశంలోకి దూరారు. తమకు తగిన సంఖ్యా బలం కోసం అధికారపార్టీ నాయకులు మూడుసార్లు జడ్పీ ఛైర్మెన్‌ ఎన్నికను వాయిదా వేయించారు. మూడోసారి ఖచ్చితంగా ఎన్నికను జరపాల్సిందేనని ఎన్నికల సంఘం అదేశించడంతో మూడోదఫా ఎన్నిక పెట్టారు. జడ్పీటీసీలు చెరిసమంగా ఉండడంతో లాటరీ తీయగా వైకాపా అభ్యర్థి బి.రాఘవేంద్రరెడ్డి ఛైర్మెన్‌గా ఎన్నిక కావడం తెలిసిందే! తమ పార్టీ నుండి గెలిచి తెలుగుదేశంలో చేరిన జడ్పీటీసీలపై విప్‌ ధిక్కారం క్రింద చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నేతలు జిల్లా కలెక్టర్‌గా వున్న శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిని బాగా నానబెట్టడంతో లాభం లేదని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు మళ్లీ కలెక్టర్‌ వద్దకే పొమ్మంది. శ్రీకాంత్‌ తర్వాత వచ్చిన జానకి విప్‌ను ధిక్కరించిన 8మంది జడ్పీటీసీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందే గాని, చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ వైకాపా నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విప్‌ ధిక్కరణ నిర్ణయం హైకోర్టు పరిధిలోనే వుందని ఈమధ్య కావలి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. దీనినే వైకాపా న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విప్‌ ధిక్కరణ కేసును హైకోర్టే విచారిస్తోంది. అయితే ఈ కేసులో తీర్పు త్వరగా వస్తేనే ఫలితం వుంటుంది. అన్ని కేసులు మాదిరిగానే దీనిలోనూ జాప్యం చేస్తే, సభ్యుల పదవీకాలం కాస్తా ముగిసిపోతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter