Thursday, 25 August 2016 14:39

సింధు విజయంలో నెల్లూరు పాత్ర

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం. అక్కడంతా కోలాహలంగా వుంది. ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కేసీఆర్‌లతో పాటు ఇరు రాష్ట్రాల మం త్రులు, ఉన్నతాధికారులు, వివిధ క్రీడా సంఘాల అధిపతులు ఉన్నారు. వారంతా చేతుల్లో పూలబొకేలతో ఒలంపిక్స్‌ రజత పతక విజేత సింధుకు స్వాగతం పలకడా నికి ఎదురుచూస్తున్నారు. ఈలోపుగా ఖాళీగా ఉండడం ఇష్టంలేని టీవీ 10.5 విలేకరి ఎయిర్‌న్యూస్‌ వెంకట్రావ్‌... చంద్రబాబు నోటి వద్ద మైక్‌ పెట్టి... సార్‌, సింధు విజయం పట్ల మీరు ఎలా ఫీలవు తున్నారని ప్రశ్నించాడు. ఇట్లాంటి అవ కాశం కోసమే ఎదురుచూస్తున్న చంద్ర బాబు వెంటనే స్పందించి... సింధు పతకం గెలవడానికి కారణం నేనే... అని చెబుతుండగా ఎయిర్‌ న్యూస్‌ వెంకట్రావ్‌ మధ్యలో కలుగజేసుకుని... అదేంటి ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కదా, మీరు కనీసం బ్యాట్‌ పట్టుకోవడం కూడా నేనె ప్పుడూ చూడలేదే అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒకరు పతకం గెలవాలంటే ఆట నేర్పించడమే ముఖ్యం కాదు, ఆ ఆట నేర్చుకోవడానికి అవసరమైన సౌక ర్యాలు కల్పించడం ముఖ్యం. పుల్లెల గోపీచంద్‌కు బాల్‌బ్యాడ్మింటన్‌ అకాడమీ పెట్టుకోవడానికి స్థలమిచ్చింది నేనే, అంతెందుకు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సిఇఓ కావడానికి, సుందర్‌ పిచాయ్‌ గూగూల్‌ సిఇఓ కావడానికి, ఏపిలో సెల్‌ఫోన్‌లు రావడానికి... ఇలా అన్నిం టికి కారణం నేనే... అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడానికి, కేసీఆర్‌ తెలంగాణ సీఎం కావడానికి కూడా కారణం నేనే అని చెప్పాడు. పక్కనే వుండి ఆ మాట విన్న కేసీఆర్‌ ఆగ్రహంతో... అసలు నిన్ను ఇక్కడి దాకా ఎవరు రానిం చారు, నువ్వెళ్లి విజయవాడలో ఉండక ఇక్కడ నీకేం పని, నేను సీఎం కావడంలో నీ పాత్ర ఏమిటి? నేను తెలంగాణ కోసం పోరాడి సీఎంనైనానన్నాడు. అందుకు చంద్రబాబు... ఆ మాటంటే నేనొప్పు కోను... 1999లో నేను మంత్రి పదవి ఇచ్చుంటే నువ్వు తెలుగుదేశం నుండి వెళ్లేవాడివా, టిఆర్‌ఎస్‌ పెట్టేవాడివా,

ఉద్యమాలు చేసేవాడివా? తెలంగాణ వచ్చేదా? సీఎం అయ్యేవాడివా? అని వాస్తవాలు అడిగాడు. వెంటనే కేసీఆర్‌ పక్కనే వున్న మంత్రి నాయని నర్సింహా రెడ్డితో... ఆ ఓటు - నోటు కేసు ఏమైందో ఒకసారి చూడు అని గట్టిగా అరిచాడు. దాంతో చంద్రబాబు... అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం ఎందుకులే, నేను నీ గురించి పట్టించుకోను, నువ్వు నా గురించి పట్టించుకోవద్దు అని ప్రపోజ్‌ చేశాడు. అంతలో సింధు, గోపీచంద్‌లు విమానం దిగి బయటకు రావడంతో మీడియా వాళ్లు వీళ్ల చేతుల్లో మైకులు పెరుక్కుని వాళ్ల వద్దకు పరుగులు తీశారు.

స్వాగత కార్యక్రమాలయ్యాక సింధు ఓపెన్‌ టాప్‌ లారీపై వూరేగుతూ గచ్చి బౌలి స్టేడియంకు చేరుకుంది. దారి పొడ వునా అభిమానులు ఆమెకు నీరాజనాలు పట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో సింధుకు సన్మాన సభ. కేసీఆర్‌, చంద్రబాబులతో పాటు మంత్రులు, క్రీడా సంఘాల వాళ్లు సింధును ఘనంగా సత్కరించి బహు మతులందించారు. చంద్రబాబు అయితే తన ప్రసంగంలో సింధుకు పతకం రావ డానికి తానే కారణమని చెబితే, కేసీఆర్‌ మాత్రం పెద్దమ్మతల్లికి బోనాలు సమ ర్పించబట్టే సింధుకు పతకం వచ్చిందని చెప్పాడు. తనకు జరిగిన అభినందన సత్కారానికి కృతజ్ఞతలు తెలపడానికి సింధు లేచి మైకు ముందుకొచ్చింది. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన వారం దరికీ కృతజ్ఞతలు తెలిపింది. గురువు గోపీచంద్‌ తన పాలిట దైవసమానుడిగా పేర్కొంది. ఒలింపిక్స్‌లో తన అనుభవా లను పంచుకుంటూ... నేను ఈ పతకం నెగ్గడం వెనుక ఒక అద్భుత శక్తి కృషి వుంది.. ఆ శక్తి ఎవరంటే..? అని పది సెకెండ్లు ఆపింది. ఆ సమయంలో చంద్ర బాబు, కేసీఆర్‌, గోపిచంద్‌లు... ఎవరికి వాళ్లు సింధు నా పేరే చెప్పబోతోంది, నా కీర్తి విశ్వవ్యాప్తం కాబోతుంది... అనే ఆలోచనల్లో వుండిపోయారు.. అప్పుడే ఆ టెన్షన్‌కు తెరదించుతూ సింధూ... ఆ అద్భుత శక్తి ఎవరో కాదు, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలు అని చెప్పింది. అంతే, స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం... ఒకరివైపు ఒకరు బిత్తర చూపులు. ఈ హఠాత్పరిణామానికి అందరూ షాక్‌ అయ్యారు. కొద్దిసేపటికి మంత్రి నాయని నర్సింహారెడ్డి తేరుకుని... అదేంటమ్మాయ్‌, అలా అంటావ్‌. నువ్వు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో, నువ్వు ఆట నేర్చుకున్న గోపీచంద్‌ అకాడమీ

ఉండేది తెలంగాణలో... నిన్ను ఒలిం పిక్స్‌కు పంపింది భారత ప్రభుత్వం ఖర్చుతో... మరి క్రెడిట్‌ మాత్రం నెల్లూరు దోమలకా? అని ప్రశ్నించాడు. అప్పుడు సింధు... అపార్ధం చేసుకోకండి... నా ఆట వెనుక మీరంతా వున్నారు. కాని ఆ ఆటలో గెలుపు వెనుక ఉన్నది మాత్రం నెల్లూరు దోమలే... అదెలాగో చూపిస్తాను చూడండి అంటూ అప్పటికప్పుడు ఒక ఎల్‌సిడి ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేయించి, ఒక సిడి ఆన్‌ చేసింది. స్క్రీన్‌ మీద సీన్‌లు రాసాగాయి.

్య్య్య్య్య

అది 2010 సంవత్సరం. నెల్లూరు ఏ.సి.స్టేడియంలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ అండర్‌-15 పోటీలు జరుగు తున్నాయి. ఆ పోటీలకు సింధు కూడా హాజరైంది. పగలు వివిధ రాష్ట్రాల క్రీడాకారిణులతో ఆడిన సింధు రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు తన రూమ్‌కు వెళ్తుండగా ఆమె తండ్రి రమణకు మిత్రుడు, అప్పుడు ఎస్‌ఐగా వున్న బి.శ్రీనివాసరెడ్డి వచ్చి ఆమె చేతికి ఇంకో బ్యాట్‌ ఇచ్చాడు. సింధు వుండి... ఏంటం కుల్‌ ఈ బ్యాట్‌, నా వద్ద వుంది కదా అంది. అందుకు శ్రీనివాసరెడ్డి... అది ప్రత్యర్థులతో ఆడుకోడానికమ్మా... ఇది నీ రూమ్‌లో వుండే రాకాసి దోమలతో ఆడుకోవడానికి... ఇది మస్కిటో బ్యాట్‌... రాత్రి మేల్కొని వాటిని చంపుకుంటూ వుండూ... అదే నీకు పెద్ద ట్రైనింగ్‌ అని చెప్పి వెళ్లిపోయాడు. తన రూమ్‌కు వెళ్లాక శ్రీనివాసరెడ్డి అంకుల్‌ తనకు మస్కిటో బ్యాట్‌ ఎందుకిచ్చాడో సింధుకు అర్ధ మైంది. రాత్రంతా ఆ బ్యాట్‌ను అటూ ఇటూ వూపుతూ ఒక్క దోమను కూడా మిగల్చకుండా చంపేసింది. పక్కరోజు టోర్నమెంట్‌లో గేమ్‌ ఆడేటప్పుడు కూడా దోమలను చంపుతున్న టెక్నిక్‌తోనే ఆడింది. అదే టెక్నిక్‌తో ఆ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత అదే టెక్నిక్‌తో అప్రతిహంగా రాణించ సాగింది. అక్కడితో సి.డి అయిపోయింది. తర్వాత సింధునే మైక్‌ తీసుకుని... ఒలిం పిక్స్‌లో కూడా నెల్లూరు ముదురుదోమ లను గుర్తుచేసుకుంటూ అదే టెక్నిక్‌తో ఆడాను. అందుకే ఫైనల్‌ దాకా వెళ్లాను. స్పెయిన్‌లో నెల్లూరు దోమలను మించిన దోమలున్నట్లున్నాయి. ఫైనల్స్‌లో కరోలినా మారిన్‌ అదే టెక్నిక్‌తో నాకంటే వేగంగా ఆడి గెలిచింది. అయినా ఈ గెలుపు నెల్లూరు దోమలవల్లే అని చెప్పింది. అప్పుడు వెంటనే చంద్రబాబు లేచి... నెల్లూరు మా ఏపిలోదే! అక్కడ దోమలు అంతగా అభివృద్ధి చెందడానికి కారణం మా ప్రభుత్వం, మా పార్టీ పాలకులే... కాబట్టి సింధుకు పతకర రావడం వెనుక నా కృషి లేదంటారా తమ్ముళ్లు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఎవరి నోటా మాట రాలేదు.

Read 198 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ల్యాండవుతున్న విమానం
  దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
 • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
  వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter