Friday, 30 September 2016 07:33

హైదరాబాద్‌లో నౌకాశ్రయం

Written by 
Rate this item
(0 votes)

galpikaవిజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాడు. భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, బాధితుల సహాయార్ధం మీరేం చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు అధికారులను ప్రశ్నించాడు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే స్పందిస్తూ... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. రోడ్లు తెగిపోయాయి. రైళ్ల పట్టాలు కొట్టుకుపోయాయి. రవాణా స్థంభించిపోయింది. రవాణాను పునరుద్ధ రించడానికి ఇంకొంత సమయం పడుతుందన్నాడు. అప్పుడు చంద్రబాబు... మనమింకా బ్రిటీష్‌ కాలం నుండి బయట పడడం లేదు. ఈ సింగపూర్‌ రాజధాని కాలంలో కూడా రవాణాకు ఇంకా రైళ్లు, బస్సులు, కార్లు వాడడమేంటి, నాన్సెన్స్‌... అందుకే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక ఎయిర్‌పోర్టు, ప్రతి మండల కేంద్రంలోనూ ఒక హెలిపాడ్‌ నిర్మిస్తాం. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ నిధులతో విమానాలు, హెలికాఫ్టర్లు కొంటాం. ప్రజలను వాటిల్లోనే తిప్పు తామని చెప్పాడు. వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌బాబు వుండి... సార్‌, ప్రత్యేకప్యాకేజీ నిధులను వీటికి కేటాయిస్తే మరి అభివృద్ధి పనులు ఎట్లా? అని అడిగాడు. చంద్రబాబు వెంటనే... ఏం జిల్లాకో ఎయిర్‌పోర్టు, మండలానికో హెలిపాడ్‌ అభివృద్ధి కాదా? పేద ప్రజలు కూడా విమానాలు, హెలికాఫ్టర్‌లు ఎక్కి ప్రయాణించడం అభివృద్ధి క్రిందకు రాదా? అని ఎదురు ప్రశ్నించడంతో అహ్మద్‌బాబు నోరెత్తలేదు. తర్వాత చంద్రబాబే... రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా వర్షాలు పడ్డాయంటే అది నా కృషి ఫలితమే! ఇక రెండేళ్ల దాకా కరువు అన్న మాటే వినిపించకూడదు అని వీడియో కాన్ఫరెన్స్‌ ముగించాడు. అప్పుడే మంత్రులు పి.నారాయణ, కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావులు వచ్చారు. ఏం సార్‌, అర్జంట్‌గా రమ్మన్నారని కె.ఇ.కృష్ణమూర్తి అడిగాడు. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మన అమరావతి రాజధానిని ఏ సిటీ తరహాలో కట్టాలో లక్కీడిప్‌ ద్వారా నిర్ణయిద్దాం. ప్రపంచంలోని అన్ని మేటి రాజధాని నగరాల పేర్లు స్లిప్పులలో వ్రాసి ఈ డబ్బాలో వేసాను. ఇందులో నుండి ఒక చీటీ తీయండి. అందులో ఏ నగరం పేరుంటే ఆ నగరంలాగా అమరావతి రాజధానిని నిర్మి ద్దామని చంద్రబాబు చెప్పాడు. తర్వాత డబ్బాను ఊగులాడించి మూత తీసి కె.ఇ.కృష్ణమూర్తిని ఒక చీటీ తీయమన్నాడు. కృష్ణమూర్తి చేయిపెట్టి ఒక చీటీ తీసాడు. దానిమీద సింగపూర్‌ అని వ్రాసుంది. చంద్రబాబుతో పాటు అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత పత్తిపాటి పుల్లారావు డబ్బాను బయటకు తీసుకెళ్లి ఎందుకో డౌటొచ్చి మిగతా చీటీలను కూడా తీసి చూసాడు. ఆశ్చర్యం.. అన్నింటి మీద 'సింగపూర్‌' అని వ్రాసి వుంది. ఆ సీక్రెట్‌ను పుల్లారావు బయట పెట్టకుండా తన గుండెల్లోనే దాచుకున్నాడు. తర్వాత చంద్రబాబు మంత్రులతో... ఈ ప్రపంచంలో దేవుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యంకానిది నేను సృష్టించాను. అదేంటో చెప్పుకోండి చూద్దాం అని పజిల్‌ విసిరాడు. ఒకరు హైటెక్‌ సిటీ అంటే ఇంకొకరు సింగపూర్‌ రాజధాని అన్నారు. ఒకరు సెల్‌ఫోన్‌లు కనిపెట్టారంటే... ఇంకొకరు కంప్యూటర్లు కనిపెట్టారని చెప్పారు. చంద్రబాబే కల్పించుకుని... ఇవేమీ కాదు... పట్టిసీమ నది... ఈ ప్రపంచ చరిత్రలో నదులన్నీ సహజసిద్ధంగా ఏర్పడ్డవే! మన ఇతిహాసాలలో చెప్పినట్లు దేవుడు సృష్టించినవే! కాని పట్టిసీమ నది మాత్రం నా సృష్టే అని చెప్పాడు. వెంటనే నిమ్మకాయల చినరాజప్ప కలుగ జేసుకుని... సార్‌, ఈ పట్టిసీమ నదిని మీరెందుకు సృష్టించారో నాకర్థమైంది. ఒక ఏడాది గోదావరి పుష్కరాలు, ఇంకో సంవత్సరం కృష్ణ పుష్కరాలతో గడిచిపోయింది. ఇప్పుడు పట్టిసీమ నదికి కూడా పుష్కరాలు జరిగితే ఇంకో సంవత్సరం దాటేయవచ్చు... ఆ తర్వాత ఎలాగూ ఎలక్షన్‌ ట్రెండ్‌ స్టార్ట్‌ అవుతుంది... ఇదేగా మీ ప్లాన్‌ అని చెప్పాడు. చంద్రబాబు అవునన్నట్లు తలూపుతూ... ఈ సీక్రెట్‌ ఎక్కడా బయటకి రానీయవద్దు అని చెప్పాడు.

------------------

హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఛాంబర్‌. కృష్ణ పట్నం పోర్టు ఛైర్మెన్‌ సి.విశ్వేశ్వరరావు, యం.డి. శశిధర్‌, సిఇఓ అనిల్‌ ఎండ్లూరి, పోర్ట్‌ పిఆర్‌ హెడ్‌ వేణుగోపాల్‌లు అక్కడ ఉన్నారు. కేసీఆర్‌ వారితో... హుస్సేన్‌సాగరం వద్ద మీరు పోర్టు కట్టాలన్నాడు. ఆ మాటతో అందరికీ పట్టపగలే కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. కొద్దిసేపటికి తేరుకుని... హుస్సేన్‌సాగర్‌లో పోర్టు ఎలా కట్టగలమని విశ్వేశ్వరరావు ప్రశ్నించాడు. ఎందుకు కట్టలేరు. కృష్ణపట్నం వద్ద కట్టారుగా... అని కేసీఆర్‌ అన్నాడు. అక్కడంటే సముద్రం వుంది కాబట్టి కట్టగలిగామని అనిల్‌ ఎండ్లూరి అన్నాడు. హుస్సేన్‌ సాగర్‌ను కూడా మేం సముద్రంగానే పిలుస్తాం... ఇక నుండి ఇది హుస్సేన్‌ సాగరం... ఈ వర్షాలకు మీరు చూసే వుంటారు... హుస్సేన్‌ సాగర్‌ సముద్రంగా మారడాన్ని. బంగాళాఖాతం నుండి హుస్సేన్‌సాగర్‌ దాకా కాలువల ద్వారా లింకులున్నాయి... కాబట్టి ఆ కాలువల గుండా నౌకలను పంపించవచ్చు... అయినా ఏపిలో పిల్లకాలువలను తవ్వి చంద్రబాబునాయుడు 'పట్టిసీమ నది' అని పేరు పెట్టగా లేనిది మేము హుస్సేన్‌సాగర్‌ను సముద్రంగా మార్చుకోలేమా? ఇప్పుడు మా దృష్టిలో ఇది హుస్సేన్‌సాగరమే! కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం క్రింద ఇక్కడ పోర్టును నిర్మించాలనుకుంటున్నాను. అలాగే హుస్సేన్‌సాగరంకు అనుసంధానంగా నగరంలోని అన్ని ప్రాంతాలకు స్పీడ్‌బోట్లు ఏర్పాటు చేయండి. వాటిని కూడా మీరే ఏర్పాటు చేసుకుని కలెక్షన్‌ కూడా మీరే వసూలు చేసుకోండి. వర్షాకాలంలో మంచి ఆదాయముంటుంది. ఎలాగూ భారీ వర్షాలప్పుడు నగరంలో రైళ్లు, బస్సులు నడిచే పరిస్థితి లేదు.. రోడ్లు కాలువలు లాగే వుంటాయి. హుస్సేన్‌సాగర్‌ పోర్టును మీరే కట్టి, 30ఏళ్ల పాటు దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా మీరే తీసుకోండి. పోర్టు నిర్మాణానికి ఏమన్నా అడ్డంగా వున్నాయంటే చెప్పండి, వాటిని వెంటనే కూలగొట్టిస్తాను. కాబట్టి సరైన ప్రతిపాదనలతో రండి... ముందు హుస్సేన్‌సాగరం పోర్ట్‌కు మంచి డిజైన్‌ తయారు చేయండి అంటూ లేచాడు. కృష్ణపట్నం పోర్టు ఛైర్మెన్‌, ఎం.డి, సిఇఓలకు ఏం చెప్పాలో అర్ధంకాక తలలు గోక్కుంటూ లేచారు.

Read 223 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter