30 September 2016 Written by 

ఏ విషయం తేల్చని అనుష్క

anushkaటాలీవుడ్‍ స్వీటీ అనుష్క.. ఇప్పుడు కొంచెం సైజ్‍ సమస్యలతో ఇబ్బంది పడుతోంది కానీ.. సినిమాల విషయం లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవు. అనుష్క ఎలా కనిపిం చినా.. ఆమెకు వచ్చే ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. చేసే సినిమాలను చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్‍ షూటింగ్‍ ను ఫినిష్‍ చేస్తున్న స్వీటీ.. మరోవైపు కె. రాఘవేంద్రరా వు,
నాగార్జున కాం బినేషన్‍ లో వస్తున్న ఓం నమో వెం కటేశాయ లోను.. పిల్ల జమీందార్‍ ఫేమ్‍ అశోక్‍ తీస్తున్న భాగమతిలోను కీలక పాత్రలు చేస్తోంది. ఇక కోలీవుడ్‍ సింగం ఇప్ప టికే ఫినిష్‍ చేసేసిం ది.అయితే.. ఈమ ధ్య అనుష్క పెళ్లి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఓ వ్యక్తిని ఈ భామ మ్యారేజ్‍ చేసుకోనుందని అంటున్నారు. హీరోయిన్స్ ఇలా తమ ఇండస్ట్రీకే చెందిన వారిని పెళ్లి చేసుకోవడం కొత్త కాకపోయినా.. ఆ వ్యక్తికి అనుష్కకు ఏజ్‍ గ్యాప్‍ ఎక్కువగా ఉండడంతోనే.. ఇది హాట్‍ టాపిక్‍ అయింది. ప్రస్తుతం అనుష్క ఏజ్‍ 34 ఏళ్లు కాగా.. ఈమె పెళ్లి చేసుకోనుందనే వార్తల్లో వ్యక్తి వయసు బాగా ఎక్కువ. తన పెళ్లి వార్తలపై అనుష్క ఎలాంటి కామెంట్‍ చేయడం లేదు. కనీసం అలాంటిదేమీ లేదు అని కూడా చెప్పకపోవడంతో.. ఈ రూమర్‍ రాయుళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. స్వీటీ పెళ్లి చేసేసుకుంటోందనే వార్తలతో అభిమానులు మాత్రం తెగ వర్రీ అయిపోతున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter