Friday, 21 October 2016 08:08

నెల్లూరులో పబ్‌ కల్చర్‌

Written by 
Rate this item
(0 votes)

pubఇంతవరకు మహానగరాలకే పరిమితమైన పబ్‌ సంస్కృతి ఇప్పుడు నెల్లూరుకు పాకింది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పాత సింధూర బార్‌ & రెస్టారెంట్‌ ప్రాంగణంలో సింధూర పబ్‌ను ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఎక్సైజ్‌ శాఖ అనుమతితోనే తాము పబ్‌ను ప్రారంభించామని నిర్వాహకులు చెబుతుండగా, సోమవారం నెల్లూరులో పర్యటించిన రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఈ పబ్‌పై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించడం జరిగింది. తెలుగునాడు విద్యార్థి సంఘం, వైకాపా విద్యార్థి విభాగంతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఈ పబ్‌ను మూసేయాలంటూ పబ్‌ ఎదుటే ఆందోళనకు దిగాయి. మంగళవారం రాత్రి నాలుగోనగర పోలీసులు ఈ పబ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి తాత్కాలికంగా మూసేయించారు. అయితే ఎవరి అనుమతీ లేకుండానే నిర్వాహకులు ఈ పబ్‌ను ఎలా ప్రారంభించగలిగారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పబ్‌ నిర్వాహకులు మాలకొండా రెడ్డి మంగళవారం మీడియా ముందు పబ్‌కు సంబంధించిన అనుమతులంటూ కొన్ని పత్రాలు చూపించారు. అయితే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బలరామకృష్ణ మాత్రం నెల్లూరు నగరంలో పబ్‌లకు అనుమతి ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు నిర్వహిస్తే, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ అధికారులతో జరిపిన సమీక్షలో సైతం ఈ పబ్‌ విషయం చర్చకు వచ్చింది.

మరి ఎక్సైజ్‌ అధికారులు అనుమతు లివ్వకా? ఎక్సైజ్‌ మంత్రికీ తెలియక సింధూర పబ్‌కు ఎవరు అనుమతులిచ్చినట్లు? అసలు అనుమతి లేకుండా నిర్వాహకులు అంత ధైర్యంగా పబ్‌ను ప్రారంభించగలరా? నిజం తొందర్లోనే బయటపడొచ్చు.

Read 259 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter