11 November 2016 Written by 

ట్రంప్‌ హిట్‌... హిల్లరీ ఔట్‌!

trumpమొన్నటిదాకా ఆయనంటే చాలామందికి అలుసే. ఆయనకు రాజకీయాలు తెలియవని, రాజకీయాలంటే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారమో లేదా రియాలిటీషోలో కావని ఎద్దేవా చేశారు. ఆయన్ను విదూషకుడని, అమర్యాదస్తుడని, అసలాయన గెలవనే గెలవడని రకరకాల విమర్శలు చేశారు. ప్రత్యర్థులతో పాటు తమపార్టీలోనివారు కూడా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే, ఎవరెన్నన్నా.. ఎవరెన్ననుకున్నా ఆయన తలవంచలేదు. అన్నిటికీ ఆయన ఎదురొడ్డి పోరాడారు. అందరి వూహలనూ చిత్తు చేసి..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించి విజయకేతనం ఎగర వేశారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. సంచలనాలకే సంచలనంగా నిలచి.. ఎవరి అంచనాలకు అందకుండానే అమెరికా ప్రజల మనసులను గెలిచి.. అగ్రరాజ్యానికి అధిపతిగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించబోతున్నారు. ప్రత్యర్థుల ఆశల్ని అడియాసలు చేసి.. సర్వేలన్నిటినీ తికమకచేసి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించి..యావత్‌ ప్రపంచమే నివ్వెరపోయేలా చేసి రియల్‌ హీరో అన్పించుకున్నారు. ఆయన పేరే ట్రంప్‌..డొనాల్డ్‌ ట్రంప్‌!...

డొనాల్డ్‌ ట్రంప్‌!... ఆయనో సంచలనం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం ఇంకా సంచలనం. ట్రంప్‌ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అమెరికా రాజకీయ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు గాను అధ్యక్ష అభ్యర్ధి విజయం సాధించాలంటే 270 ఓట్లు అవసరం. రిపబ్లికన్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ట్రంప్‌ ఆ మ్యాజిక్‌ఫిగర్‌ను ఒక్కసారిగా అధిగమించి ఎవరూ ఊహించనివిధంగా డెమోక్రాట్ల కోటలను సైతం బద్దలుకొట్టారు. అత్యధికంగా 289 ఓట్లతో తిరుగులేని విజయాన్ని సాధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవశం చేసుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా 45వ అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అందరూ గెలుస్తారనుకున్న డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ 218 ఓట్లకే పరిమితమయ్యారు. అనేక సర్వేల్లో హిల్లరీకే విజయం తప్పదని భావించినా హిల్లరీ ఘోరపరాజయం పొందడం, చివరికి ట్రంప్‌దే ఘనవిజయం కావడం అందరి అంచనాలనూ తలకిందులు చేసి నట్లయింది. ఉద్యోగ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి దేశానికి విముక్తి, వలసలకు అడ్డుకట్ట వేస్తా, అమెరికాను గ్రేట్‌ అమెరికాగా తీర్చిదిద్దుతా..వంటి ట్రంప్‌ హామీలు అమెరికా ప్రజల మనసులను గెలుచుకున్నాయి. అమెరికాలోని కీలకమైన రాష్ట్రాలన్నీ ట్రంప్‌ వైపే మొగ్గు చూపాయి. సెనేట్‌, ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్లకే పూర్తి మెజారిటీ సిద్ధించింది.ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం జరిగినా, ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేసినా ట్రంప్‌కే ఘనవిజయం లభించింది. దీంతో హిల్లరీ అభిమా నులు విచారంలో మునిగిపోగా, ట్రంప్‌ అభిమానులు సంబరాల్లో తేలియాడుతున్నారు. జనవరి 8వతేదిన డొనాల్ట్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికా 45వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter