Friday, 18 November 2016 08:21

బీచ్‌ఫెస్టివల్‌లో బిత్తరపోయిన బీజేపీ నేతలు

Written by 
Rate this item
(0 votes)

galpikaజరిగిన కథ : ఫిబ్రవరి నెలలో విశాఖలో బీచ్‌ఫెస్టివల్‌ నిర్వహించాలనుకున్న హైటెక్‌రత్న చంద్రబాబు, అతని మంత్రి వర్గ సభ్యులు ఢిల్లీ వెళ్లారు. బీచ్‌ఫెస్టివల్‌కు రావాలని ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులందరినీ ఆహ్వానిస్తారు. బీచ్‌ఫెస్టివల్‌ అంటే హైందవ సాంప్ర దాయం ప్రకారం జరిగే పండుగేమో ననుకుని వారంతా కూడా సాగరతీరం పండుగకు రావడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. చివరగా అద్వానీని పిలవడానికి వెళ్లినప్పుడు... ఆయన దేశంలోని వివిధ పీఠాధిపతులు వస్తు న్నారా అని ప్రశ్నిస్తే, చంద్రబాబు, మంత్రులు వివిధ దేశాల నుండి వస్తున్న మోడల్స్‌ పేర్లు చెబుతారు. వాళ్లంతా వివిధ దేశాలకు చెందిన ఆథ్యాత్మిక వేత్త లేమోనని అద్వానీ మనసులో అనుకుం టాడు. చంద్రబాబు టీమ్‌ ఆహ్వానాల పని పూర్తి చేసుకుని అమరావతికి బయలు దేరుతుంది. ఆ తర్వాత....

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బీచ్‌ ఫెస్టివల్‌ ఆహ్వానపత్రికను తీసుకుని ఇంటికెళతాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ కార్డును ముఖం మీద పెట్టుకుని నిద్రలోకి జారుకుంటాడు.

---------------

అది విశాఖ సాగరతీరం. తీరం అంతా కోలాహలంగా వుంది. విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పుడే ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక విమానం దిగింది. అందులో నుండి నరేంద్రమోడీ, అద్వానీ, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌పారికర్‌, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరాని, సురేష్‌ప్రభు, అమిత్‌షా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రమణ్‌సింగ్‌ వంటి బీజేపీ పెద్దలంతా దిగారు. అందరూ సాంప్ర దాయ దుస్తుల్లో వున్నారు. అందరి చేతుల్లోను పల్లేలు, వాటిలో కొబ్బరికాయ, పండ్లు, పూలు, పసుపు, కుంకుమలు వున్నాయి. బీజేపీ నేతలను ఆహ్వానించ డానికి అక్కడకు వెళ్లిన మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు... వారి డ్రెస్‌లను, వారి చేతుల్లో వున్న పల్లేలను చూసి ఆశ్చర్యంతో... మీరు బీచ్‌ ఫెస్టి వల్‌కు వచ్చారా? సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చారా...? అని అడిగాడు. అందుకు అద్వానీ... మేం బీచ్‌ ఫెస్టివల్‌కే వచ్చామన్నాడు. అందుకు అయ్యన్నపాత్రుడు... బీచ్‌ఫెస్టివల్‌కు వస్తే ఈ డ్రస్‌లేంటి... ఈ పసుపు కుంకుమ లేంటి... ఏదో జాతర కొచ్చినట్లు అని అడిగాడు. వెంకయ్య వుండి... జరిగేది సాగరతీరం పండుగ కదా... గంగమ్మకు సారె తెచ్చామన్నాడు. అప్పుడు అయ్యన్న పాత్రుడు మనసులో... మా చంద్రబాబు బీచ్‌ఫెస్టివల్‌ను మీకు ఇంకో కోణంలో చెప్పినట్లున్నాడు. నాకెందుకొచ్చిన తల నొప్పిలే... అక్కడకొస్తే మీకే అర్ధమవు తుందిగా అని అనుకుంటూ వారిని కార్లలో ఎక్కించుకుని కాన్వాయ్‌గా బీచ్‌ వద్దకు వెళ్లాడు. బీచ్‌ సమీపంలో దిగిన బీజేపీ నేతలు చేతుల్లో పల్లేలతో ముం దుకు కదిలారు. చంద్రబాబు తమకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలుకు తాడని వూహించిన వెంకయ్య చుట్టూ చూసాడు. ఎక్కడా అలాంటి వాతా వరణం కనిపించలేదు. దూరంగా కొంత మంది మాత్రం వెస్ట్రన్‌ మ్యూజిక్‌లో మునిగిపోయి వున్నారు. వీళ్లు తీరం వైపు పోబోతుండగా మెయిన్‌గేటు వద్ద సెక్యూ రిటీ ఆపేసి... ఈ డ్రెస్‌లతో లోపలకు పోనీయమని చెప్పారు. వెంకయ్య వుండి... మా డ్రెస్‌లకేం... అన్నీ సాంప్ర దాయంగానే వున్నాయి కదా అని అడిగాడు. అందుకు సెక్యూరిటీ చీస్‌... ఇలాంటి సాంప్రదాయ దుస్తుల్లో వున్న వారికి ప్రవేశం లేదు. మగవాడైతే బనీను, డ్రాయర్‌, ఆడవారైతే బికినీ వేసుకుని వెళ్లాలన్నాడు. ఆ మాటకు వెంకయ్యకు కళ్లు బైర్లు కమ్మాయి... బీచ్‌ ఫెస్టివల్‌ గురించి మేం వూహించింది ఒకటైతే ఇక్కడ ఇంకోటి జరుగుతున్నట్లుగా వుంది. అసలేం జరుగుతుందిక్కడ... నాకు వెంటనే తెలియాలి అని మనసులో అనుకున్నాడు. అంతలో 'హాయ్‌ అంకుల్‌' అంటూ చెవికి రింగులు, కళ్లకు నల్లద్దాలు, ఒంటి మీద చెడ్డీ, బనీను వేసుకున్న యువకుడు వచ్చాడు. వెంకయ్య కోపంతో... ఎవర్రా నువ్వు... నన్ను అంకుల్‌ అంటున్నావు అని గదిమాడు. వెంటనే ఆ యువకుడు కళ్లద్దాలు తీసి... అంకుల్‌ నేను లోకేష్‌ను, చంద్రబాబు గారి అబ్బాయిని అని అన్నాడు. అప్పుడు వెంకయ్య ఆశ్చర్యంతో... మీకేం పోయే కాలం వచ్చిందిరా... మీరు చెప్పింది ఏంటి, ఇక్కడ చేస్తున్నదేంటి... అని అడిగాడు. దానికి లోకేష్‌... బీచ్‌ఫెస్టివల్‌ అంటే కర్పూరం వెలిగించి, గంగాహార తినిచ్చి, దండం పెట్టుకుని ప్రసాదాలు తినిపోవడం అనుకున్నారా... పక్కన గర్ల్‌ఫ్రెండ్‌, చేతిలో బీరు, దూరంగా ఓ టెంట్‌... ఇది అసలైన ఫెస్టివల్‌ అంటే... ఈ ఫెస్టివల్‌లో వున్న మజా మీకు చూపించడానికే పిలిపించామన్నాడు. అప్పుడే చంద్రబాబు, మంత్రులు కూడా నిక్కర్లు, బనియన్లలో వెస్ట్రన్‌ మ్యూజిక్‌లకు స్టెప్పులేస్తూ అక్కడకు వచ్చారు. నరేంద్ర మోడీ కోపంతో... సాగరతీరం పండుగ అంటే ఇదా... నాగసాధువులు, దిగంబర సన్యాసులు వస్తున్నారన్నావ్‌, వాళ్లేరి? అని ప్రశ్నించాడు. అదిగో అంటూ చంద్ర బాబు ఒక వైపు చూపించాడు. అక్కడ ఫారిన్‌ అమ్మాయిలు ఒంటి మీద డ్రాయర్‌, బ్రాలతో అబ్బాయిలతో కలసి చిందు లేస్తున్నారు. తర్వాత చంద్రబాబే... వీళ్లంతా దిగంబర సన్యాసులే కదా... వీరికి పెళ్లిళ్లు, సంసారాలు ఏమీ వుం డవు... ఈ ఫెస్టివల్‌కు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించానన్నాడు. మరి ఆయా దేశాల నుండి మతాధిపతులు, పీఠాధిపతులు వస్తున్నారని చెప్పావ్‌... అని ప్రశ్నించాడు. వాళ్లు కూడా వచ్చారు... అదిగో అటు చూడండి అంటూ దక్షిణం వైపు చూపిం చాడు చంద్రబాబు. అక్కడన్నీ విస్కీ, బ్రాందీ కౌంటర్లు పెట్టి కొందరున్నారు. చంద్రబాబు వారిని చూపిస్తూ వారే విదేశాల నుండి మద్యం తెచ్చిన మఠాధి పతులు అని వివరించాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ భక్తి కచేరి అని చెప్పారు కదా అని రాజ్‌నాథ్‌సింగ్‌ అడిగాడు. మంగళంపల్లి భక్తి కచేరి కాదు... పాప్‌ సింగర్‌ మడోన్నా రక్తి కచేరి అని చెప్పాం... అదిగో అది కూడా వుం దంటూ ఉత్తరం వైపు చూపించాడు లోకేష్‌బాబు. అక్కడ ఓ స్టేజీ మీద మడోన్నా ఒంటి మీద ఒక్కో వస్త్రం విప్పుతూ పూనకం వచ్చినట్లు వూగుతూ పాడుతుంటే... అక్కడున్న జనం కూడా బట్టలు విప్పుకుంటూ చిందులేస్తున్నారు. అదంతా చూస్తున్న మోడీకి అప్పటికే అరికాల్లో మంట నెత్తికెక్కింది. మిగతా బీజేపీ నాయకులు కూడా ఆవేశంతో రగిలిపోతుంటే పరిస్థితిని అంతా గమ నిస్తున్న వెంకయ్య... చంద్రబాబూ... బీచ్‌ ఫెస్టివల్‌ ఆపు... ఆపు... ఆపు... అంటూ కేకలేయసాగాడు. అలా ఆపు... ఆపు అంటూ కేకలేయడంతో ఆయన పక్కనే వున్న సతీమణి ఉషమ్మ ఉలిక్కిపడి లేచింది. పక్కనే చెంబులో వున్న నీళ్లను వెంకయ్య ముఖాన గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు వెంకయ్య... తత్తరపాటుతో లేచి కూర్చున్నాడు. పదినిముషాలకు తేరుకున్న ఆయన... అప్పటిదాకా బీచ్‌ ఫెస్టివల్‌ సీనంతా కల అని గ్రహించాడు. బీచ్‌ ఫెస్టివల్‌ ఇలానే ఉంటుందేమో... ఎందుకైనా మంచిది... చంద్రబాబుతో చెప్పి ఆపి వేయించాలనుకుంటూ మళ్లీ ముసుగుతన్ని నిద్రలోకి జారుకున్నాడు.

Read 145 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter