Friday, 25 November 2016 13:20

వ్యాపారాలన్నీ బంద్‌

Written by 
Rate this item
(0 votes)

mgbపెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క సామాన్య ప్రజలే కాదు వ్యాపారాలన్నీ పడిపోయి వ్యాపారస్థులు విలవిలలాడుతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక వ్యాపార లావాదేవీలు సగానికి సగం పడిపోయాయి. వెయ్యి, 500 నోట్లు రద్దు చేశారు. కొత్తగా 2వేల నోటు విడుదల చేశారు. మార్కెట్‌లో చిల్లర లేక ఇవి చెలామణి కావడం కష్టసాధ్యంగా మారింది. వంద, యాభై, 20, 10... చిన్ననోట్ల హవా పెరిగింది. మార్కెట్‌లో ఈ నగదు శాతం తక్కువ. చెలామణిలో ఎక్కువుగా ఉన్నది 500నోట్లే! కొత్తగా 500 నోటు విడుదల కావడం ఆలస్యమైంది. దీంతో వ్యాపారస్థులకు సినిమా కష్టాలు మొదలయ్యాయి.

మొదటి దెబ్బ రియల్‌ ఎస్టేట్‌ మీద పడింది. అసలే అంతంతమాత్రంగా వున్న రియల్‌ మార్కెట్‌ పెద్ద నోట్ల రద్దుతో కుదేలయ్యింది. రియల్టర్లు డీలా పడిపోయారు. రియాల్టీ మీదనే వందల కోట్లలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వడ్డీ వ్యాపారులు ఖంగుతిన్నారు. కొందరు బాకీల వసూళ్లకు పరుగులు తీస్తుంటే, ఇంకొందరు లక్షలు, కోట్లలో తిరిగి వచ్చిన అప్పులను తెల్ల ధనంగా ఎలా మార్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. ఇక రియల్‌ ఆధారంగా జరుగుతున్న వ్యాపారాలన్నీ కూడా తగ్గాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి. స్టీలు, సిమెంట్‌ వ్యాపారాల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. వ్యాపారాలు లేక జిల్లాలో వేలాది లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు ఆగిపోయాయి. ప్రజల వద్ద చిల్లర కొరతతో పాటు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేకపోవడంతో మందుబాబులు మద్యం షాపులు, బార్లకు పోవడం తగ్గించేశారు. ఇంతకుముందు రోజూ హాఫ్‌ తాగేవాళ్లు ఇప్పుడు క్వార్టర్‌ లేదా రెండు పెగ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. కూరగాయలు, చిల్లర వర్తకంలోనూ జోరు తగ్గింది. నోట్ల రద్దు ప్రకటించిన పక్కరోజు బంగారు అమ్మకాలు జోరుగా సాగాయి. అయితే బంగారం అమ్మకాలపై పాన్‌కార్డు నిబంధనను పెట్టడంతో ఈ అమ్మకాలు కూడా పడిపోయాయి. చాలాచోట్ల బంగారం దుకాణాలను మూసేసారు.

ముఖ్యంగా లగ్జరీ వ్యాపారాలపై దీని ప్రభావం బలంగా వుంది. ఇంతకుముందు ఆయా ఆటోమొబైల్‌ షోరూమ్‌లలో లగ్జరీ కార్లు, చిన్న కార్లు, బైక్‌ల అమ్మకాలు తీవ్రస్థాయిలో ఉండినాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీల కార్లు డెలివరీకైతే 10 నెలల దాకా గడువు పెడుతూ వచ్చారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కార్లు, మోటార్‌ బైక్‌ల అమ్మకాలు బాగా తగ్గాయి. చేతిలో వున్న చిల్లరను జాగ్రత్తగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రజలు సినిమాలు, షాపింగ్‌లకు పోవడం లేదు. బట్టల కొనుగోళ్లు కూడా తగ్గాయి. రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టుల వ్యాపారం కూడా సగానికి పడిపోయింది. ఆయా వ్యాపార సంస్థలైతే ఈ నెల వ్యాపారాలు లేక తమ సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో వున్నాయి. ముఖ్యంగా జీతాలు ఇవ్వడానికి కొత్త నోట్లు లేవు. పాత నోట్ల రూపంలో జీతాలు ఇవ్వలేరు. రైతులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైర్ల సీజన్‌ కావడంతో ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ సంబంధిత కొనుగోళ్లు ఉంటాయి. వీటి కొనుగోలుకు పాతనోట్లు తీసుకోవడం లేదు, రైతుల వద్దకు కొత్త నోట్లు రావడం లేదు. మొత్తానికి పెద్దనోట్ల రద్దు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. కొత్తనోట్లు, పూర్తి స్థాయిలో చిల్లర అందుబాటులోకి వచ్చినా పడిపోయిన ఈ వ్యాపారాలన్నీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

Read 168 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter