25 November 2016 Written by 

మూగబోయిన 'మురళీ'రవం

bala muraliప్రఖ్యాత సంగీతజ్ఞుడు, తన గానమాధుర్యంతో.. గంధర్వగానంతో అందరినీ సంగీత జలధిలో ఓలలాడించిన మహత్తర సంగీత ఝరి..మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక లేరు. ఆయన చెన్పైలో ఈ నెల 22న అస్తమించారు. 86ఏళ్ళ వయసులో ఆయన సంగీత ప్రపంచాన్ని వీడి.. రాగసుధారస తీరాలతో తరలివెళ్ళిపోయారు. నిద్రలోనే ఆయన నిష్క్రమించారు.

వృద్ధాప్యంతో ఇటీవల ఆయన స్వల్ప అస్వస్థతతో వుండే వారు. సంగీతమే ఊపిరిగా జీవించి, సంగీత ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఆ మహోన్నత సంగీతవేత్త ఇక లేరని తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా శోకసాగరంలో మునిగిపోయారు. ఎంతో మంది ప్రముఖులు వచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడిపెట్టారు.

ఎనిమిదేళ్ళ వయసులో బాలమురళీకృష్ణ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. 1939 నుంచి ఇప్పటిదాకా సుమారు పాతికవేలకు పైగానే సంగీత కచేరీలు చేసి అందరినీ సంగీతా మృతంలో ఓలలాడించారు. 1957 జనవరి 12న 'సతీసావిత్రి' చిత్రం ద్వారా ఆయన గాయకుడిగా, సంగీతదర్శకునిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1967లో వచ్చిన భక్తప్రహ్లాద చిత్రంలో ఆయన నారదుడి పాత్రను అత్యద్భుతంగా పోషించి అందరి గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. 'ఆదియు ఆనాదియు నీవే దేవా' అంటూ ఆయన ఆ చిత్రంలో ఆలపించిన గీతం అందరి మనసుల్లో ఇట్టే నిలచిపోయింది. సంగీతరంగానికి ఎనలేని సేవలందించిన మహత్తర సంగీతవేత్త, కర్నాటకసంగీత విద్వన్మణి బాలమురళీకృష్ణ. ఆయన కంఠ స్వరం.. ఆయనకో గొప్ప వరం. ఆయన పాటలు ప్రేక్షకజన సమ్మోహనాలు. ఆయన శృతిపక్వమైన స్వరాలు సంగీత కళామ తల్లికే వెలలేని ఆభరణాలు. అందుకే ఆయన్న ఎన్నో విశిష్టమైన, ప్రఖ్యాతమైన అవార్డులు వరించాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ వంటి అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమసంగీత దర్శకునిగా కూడా ఆయన పలు అవార్డులను అందుకున్నారు. సంగీత రంగానికే ఆయన మకుటంలేని మహారాజుగా వెలుగొందారు. పలు భాషా చిత్రాల్లో ఆయన ఆలపించిన అనేక గీతాలు శ్రోతలను పార వశ్యులను చేసేవి. అత్యద్భుతమైన తన గానామృతంతో ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. ఇప్పటికీ ఆయన పాడిన 'సలలిత రాగసుధారస సారం' (నర్తనశాల), ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు'(ఉయ్యాల జంపాల), 'పలుకే బంగార మాయెనా'(అందాల రాముడు), 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా'(గుప్పెడు మనసు) వంటి ఎన్నో పాటలు నేటికీ శ్రోతల హృదయాలను అలరిస్తూనే వున్నాయి.

ప్రత్యేకించి ఆయనకు నెల్లూరుతో అనుబంధం ఉండడం, నెల్లూరుకు వియ్యంకుడు కావడం విశేషం. నెల్లూరుకు చెందిన నాటక రచయిత పులిగొండ్ల రామకృష్ణయ్య కుమార్తెను కోడలిగా చేసుకుని నెల్లూరుతో వియ్యంకుడిగా ఆయన బంధుత్వాన్ని కలుపుకున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఆయన నెల్లూరుకు వచ్చి తన గాత్ర మాధుర్యంతో సింహపురి సంగీతాభిమానులను ఓలలాడించారు. సంగీత సరస్వతికి సుస్వరమణిమకుటంగా భాసించిన బాలమురళీకృష్ణ తన సినీసంగీత ప్రస్థానం మరో రెండునెలల్లో షష్టిపూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఆయన కన్నుమూయడం ఎంతో బాధాకరం.

ఏదేమైనా ఆయన లేని లోటు తీరనిది.. ఎవరూ తీర్చలేనిది. ఆ మహా సంగీత తరంగం.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారిపోయింది. పాట.. కనురెప్పల్లో నీరు నిలిచిపోయింది. అద్వితీయమైన రాగస్వరాలతో కూడిన ఆ సమ్మోహనమైన ఆ మురళీగానం మూగబోయింది. కదులుతున్న కన్నీటిమాటున..ఏ దూర సుదూర తీర సరోవరాలకావలికో...తరలి వెళ్లిపోయింది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter