02 December 2016 Written by 

ఆగని దురాగతాలు

terroristsసరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి భారీ దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఒక మేజర్‌తో సహా, ఏడుగురు సైనిక సిబ్బంది అమరులయ్యారు. బిఎస్‌ఎఫ్‌ డిఐజితో పాటు మరో 8 మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పాకిస్తాన్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా బజ్వా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. యూరీ ఘటనతో భారత్‌ సర్జికల్‌ దాడులు జరపడంతో పాక్‌లో కలవరం పుడుతోంది. ఉగ్రవాదులను ఉసిగొల్పి భారత భూభాగంలోకి పంపడం, భారత్‌లో భీభత్సాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న పాక్‌ ప్రేరేపిత

ఉగ్రవాదులు భారత్‌లో తాజాగా మరో రెండు ఘటనలకు పాల్పడ్డారు. రాత్రివేళల్లో ఉగ్రవాద ముష్కరులు భారత్‌లోకి జొరబడడం, గ్రెనేడ్లు విసురుతూ, తూటాలు పేలుస్తూ విచక్షణా రహితంగా భారత సైనిక శిబిరాలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల యూరీలో వున్న ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ నిర్వహించడంతో పాక్‌లో కలవరం రేకెత్తింది. దీంతో పాక్‌ ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తత

లను రేకెత్తిస్తూ అవకాశం కోసం పొంచి చూస్తూనే వుంది. రాత్రి వేళల్లో.. విపరీతంగా మంచుకురుస్తున్న సమయం చూసి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇదే అదనుగా భారత భూభాగంలోకి సైగ్గా దూసుకువచ్చి భారత సైనికులపై ఎడాపెడా కాల్పులకు, దాడులకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు సమాయత్తం కావాలని భారత ప్రధాని మోడీ ఎంతో సంకల్పదీక్షతో ఉగ్రవాద రక్కసిని సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తుండడమే కాక, ఉగ్రవాదానికి ఊతమిచ్చే నకిలీనోట్లకు తెరదించుతూ, ఉగ్రవాదానికి శాశ్వత ప్రాతిపదికన అడ్డుకట్ట వేస్తూ నల్లధనాన్ని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు కనీవినీ ఎరుగనివిధంగా అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ దశలో పాక్‌ తన కుయుక్తులను ప్రదర్శిస్తూనే వుంది. ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపి భీభత్సాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే వుందనడానికి తాజా ఘటనలే ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువన ఉగ్రవాదులు జమ్ము-కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల్లో జొరబడి సైనికకేంద్రాలపై దాడులకు పాల్పడడం, జమ్ములో పోలీసు దుస్తుల్లో ఆర్మీ యూనిట్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దాడులు చేయడం దారుణం. తొలుత ఉగ్రవాదులు మంగళవారం వేకువన పోలీసు దుస్తులతో భారత్‌లోకి జొరబడేందుకు ప్రయత్నిం చారు. సరిహద్దుల్లోని సాంబ్రా, నగ్రోటా ప్రాంతాల మీదుగా ఉగ్రవాదులు వస్తూ భారత ఆర్మీక్యాంప్‌పై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న నగ్రోటా ప్రాంతం గుండా భారత సరిహద్దు భూభాగంలోకి ఉగ్రవాదులు ప్రవేశించి ఆర్మీక్యాంప్‌ వద్ద వున్న సైనికులపై కాల్పులు జరపడంతో సైనికులు ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొని ఆ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే, ఈ ఘటనలో ఒక మేజర్‌ సహా ఏడుగురు సైనికులు తమ ప్రాణాలను కోల్పోవడం ఎంతో బాధాకరం. సాయుధ ఉగ్రవాదులు మొదట నగ్రోటాలోని ఆర్మీ ఆర్టిలరీ విభాగంలోకి దూసుకువచ్చి, అక్కడున్న రెండు నివాసభవనాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ దశలో అక్కడున్న అధికారులను, ఇద్దరు మహిళలను, ఇద్దరు చంటిబిడ్డలను బందీలుగా పట్టుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే, మన సైనికాధికారుల సతీమణులు వెంటనే అప్రమత్తమై ఆ ఉగ్రవాద ముష్కరులను తమ ఇళ్ళలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. క్వార్టర్స్‌లో వున్న ఇళ్లలోకి ఉగ్రవాదులు జొరబడకుండా ప్రవేశద్వారం వద్ద ఇంట్లో వున్న వస్తువులన్నిటినీ అడ్డుపెట్టి వారు లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఎంతో ధైర్యసాహసాలతో ఉగ్రవాదులను నిలువరించి ఆ సైనికాధికారుల సతీమణులు వీరపత్నులనిపించుకున్నారు. లేకుంటే ఉగ్రవాదులు అక్కడున్న సైనికాధికారులను, వారి కుటుంబసభ్యులను కూడా బందీలుగా పట్టుకుని మరింత నష్టం కలిగించి వుండే వారు. అయితే, వారి పాచిక పారలేదు. ఈలోగానే సైన్యం అక్కడకు చేరుకుని ఆ ముగ్గురు ఉగ్రవాదు లను మట్టుబెట్టింది. ఇదే సమయంలో రామ్‌గడ్‌ సెక్టార్‌లో జరిగిన మరో ఘటనలో మరో ముగ్గురు ఉగ్రవాదులు సరిహద్దుల్లోని సాంబా- చామ్లియాల్‌ ప్రాంతం వద్ద చొరబాటుకు ప్రయత్నించారు. అక్క డున్న బిఎస్‌ఎఫ్‌ క్యాంప్‌పై దాడికి పాల్పడడంతో, సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఉగ్రవాదులను ఎదుర్కొంది. కొన్ని గంటలపాటు జరిగిన ఈ భీకర పోరులో చొరబాటుకు ప్రయత్నించిన ఆ ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చడం భారత సైనికుల సాహసానికి నిదర్శనం. అయితే, ఈ ఘటనలో ఒక డిఐజితో పాటు మరో సైనిక అధికారి, పలువురు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలు కావడం బాధాకరం. ఈ రెండు వరుస దాడులతో జమ్మూ-శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి.

సర్జికల్‌ దాడుల తర్వాత కూడా పాక్‌ రెచ్చిపోతుండడం, ఉగ్రవాదులను పదేపదే భారత్‌పైకి ఉసి కొల్పుతుండడం ఇంకా మానలేదు. దాడులు, భీభత్సాలతో భారత్‌ను కల్లోలం చేయాలనే కుట్రలతో ఉగ్రవాదులు దాష్టీకాలకు పాల్పడుతూనే వున్నారు. కాల్పుల విరమణను పదేపదే ఉల్లంఘించి పాక్‌ దురాగతాలకు పాల్పడుతూనే వుంది. పాక్‌ కుయుక్తులు, పేట్రేగిపోతున్న ఉగ్రవాదుల దాడులు అన్నీ ప్రపంచానికి క్రమేణా అర్ధమవుతూనే వున్నాయి. పర్యవసానం ఎలా ఉంటుందో మరి.. వేచి చూడాల్సిందే!

ఏదేమైనా... ఈ ఘటనలతో భారత్‌కు మరింత అప్రమత్తత అవసరం. ఈ సందర్భంగా ఉగ్రవాద ముష్కరమూకలను ధైర్యంగా ఎదిరించి మట్టుబెట్టిన మన సైనికుల సాహసం మనందరికీ..మన జాతికే గర్వకారణం. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటూ అసువులు బాసిన భారత వీర జవాన్లకు..జోహార్లు!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
    విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter