Friday, 02 December 2016 10:53

నెల్లూరు జనంపై... దోమల దండ యాత్ర

Written by 
Rate this item
(0 votes)

mosquitoరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా శత్రు దేశాల మీద యుద్ధానికి పోతున్నట్లుగా 'దోమలపై దండయాత్ర' అన్నాడు. దీని పేరుతో ఖర్చు కూడా వ్రాసారు. నెల్లూరులో మాత్రం అదికాస్తా రివర్స్‌లో వుంది. ఇక్కడ ప్రజలపై దోమల దండయాత్రలాగా పరిస్థితి ఉంది. నెల్లూరు టౌన్‌ ముదురుదోమలకు పెట్టింది పేరు. కార్పొరేషన్‌ పారిశుద్ధ్య సిబ్బంది బాగా పని చేస్తున్నారు, ఫాగింగ్‌ చేస్తున్నారు, మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు, మురికి గుంటల్లో ఆయిల్‌బాల్స్‌ వేస్తున్నారంటేనే నెల్లూరులో దోమలు జనాన్ని పీకి పాకాన పెడుతుంటాయి. అలాంటిది ఈ పనులన్నీ చేయకుంటే... దోమలు ప్రజల రక్తాన్ని స్ట్రా వేసుకుని పీల్చేయవు.

ప్రస్తుతం నెల్లూరులో అదే జరుగు తోంది. నెల్లూరు నిండా దోమలు విజృం భిస్తున్నాయి. ఇళ్లల్లో జనాలు దోమలు చంపుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. దోమలను నిర్మూలించాల్సిన నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్‌ విభాగం వాళ్లు మాత్రం పారిశుద్ధ్యం పనులను పక్కన పెట్టేసి చోద్యం చూస్తున్నారు. నెల్లూరులో పారిశుద్ధ్యం పనులు పరమ అధ్వాన్నంగా ఉంటున్నాయి. ఎక్కడ చెత్త దిబ్బలు అక్కడే... ఎక్కడి పందుల గుంపులు అక్కడే! ఎక్కడా ఫాగింగ్‌ లేదు. మురికి కాలువల్లో సిల్డ్‌ తీయడం లేదు. ఇటీవల కాలంలో పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెకు దిగారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలం గానే కార్మికులు సమ్మెకు దిగడం, నగర పౌరులు వారం రోజులపాటు మురికిలో మగ్గిపోవడం జరిగింది.

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హెల్త్‌ ఆఫీసర్‌ మూలంగానే నగరం మురికి కూపంగా మారుతోంది. ఏసిబికి పట్టుబడ్డా కూడా ఈ హెల్త్‌ ఆఫీసర్‌ను మేయర్‌ తిరిగి రప్పించుకున్నాడు. హెల్త్‌ విభాగానికి సంబంధించి కలెక్షన్‌ల పనులు అతనికి అప్పగించాడు. దీంతో పనులు చేయకుం డానే బ్లీచింగ్‌ చల్లకుండానే, కాలువల్లో సిల్డ్‌ తీయకుండానే బిల్లులు పెట్టడం... 50మంది పారిశుద్ధ్య కార్మికులుంటే వంద మందికి బిల్లులు పెట్టడం... హెల్త్‌ విభా గంలో అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నెల్లూరులో హెల్త్‌ ఆఫీసర్‌ పదవీకాలం ముగిసినా తన కలెక్షన్‌లు ఎక్కడ పోతాయోనని చెప్పి మేయర్‌ అతనిని వదలడం లేదు. ఇతను హెల్త్‌ ఆఫీసర్‌గా వచ్చాక నాలుగుసార్లు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. రాజకీయ కక్ష్యలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లను బదిలీలు చేశారు. చివరకు లాటరీ ద్వారా బదిలీలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారంటే ఎంత సిగ్గు చేటైన విషయం.

నగరంలో పారిశుద్ధ్య పనులనేవి పెద్దగా జరగడం లేదు. కాని పారిశుద్ధ్యం పేరుతో దిగమింగేది మాత్రం గతం కంటే ఘనంగా పెరిగింది. పాలకులు ప్రజల సొమ్మును, నెల్లూరు దోమలు ప్రజల రక్తాన్ని పోటీపడి పీల్చేస్తున్నారు.

Read 2112 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • అమ్మో... దొంగల ముఠా
    కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter