02 December 2016 Written by 

బ్లాక్‌మనీకి... బాటలు వేసిన బ్యాంకులు

black moneyబ్లాక్‌మనీని అరికట్టాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లు రద్దు చేస్తే అంతకంటే పెద్దనోటైన 2వేల నోట్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి భారీగా వెళ్లిపోయాయి. 2వేల నోట్ల కట్టలపై పెద్దఎత్తున కమిషన్‌ వ్యాపారం కూడా జరిగింది. 2వేల నోట్లను దారిమళ్లించడంలో కొందరు బ్యాంకు అధికారులు, పోస్టాఫీసు సిబ్బంది కీలకపాత్ర పోషించారు. లక్షకు 70వేల లెక్కన కమిషన్‌ వ్యాపారం చేశారు. ప్రజలకు ఇవ్వడానికి పంపిణీ చేసిన 2వేల నోట్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం.

నోట్ల మార్పిడికి ప్రభుత్వం గుర్తింపు కార్డు జెరాక్స్‌ కాపీని సమర్పించాలని చెప్పింది. అయితే అందులో ఖాతాదారుడి సంతకం పెట్టాలన్న నిబంధన లేదు. సంతకం లేకుండానే జెరాక్స్‌ గుర్తింపు కార్డు కాపీని తీసుకుని నగదు మార్పిడి చేస్తూ వచ్చారు. అయితే కొందరు బ్యాంకు అధికారులు, పోస్టాఫీసు సిబ్బంది వచ్చిన గుర్తింపు జెరాక్స్‌లనే మళ్ళీ మళ్ళీ జెరాక్స్‌లు తీసి, వాటి ఆధారంగా డబ్బులు డ్రా చేసినట్లు చూపించి, ఆ డబ్బులనే బయట కమిషన్‌కు ముట్టజెప్పారు. ఉదాహరణకు గోపాలయ్య ఒకసారి బ్యాంకుకు వెళ్లి తన ఆధార్‌కార్డు జెరాక్స్‌ కాపీ ఇచ్చి నాలుగువేల రూపాయలు తెచ్చు కున్నాడనుకుందాం. బ్యాంకు సిబ్బంది అదే కాపీని పది జెరాక్స్‌ కాపీలు తీయించి అదే పేరుతో 40వేలు డ్రా చేసి ఉండొచ్చు. ఇలాంటి డబ్బునే బయట అమ్మి ఉం డొచ్చు. ఈ విధంగా చాలామంది వద్ద మళ్లీ బ్లాక్‌మనీ పోగయ్యింది. అదే గుర్తింపుకార్డు జెరాక్స్‌ కాపీ మీద ఖాతాదారుడి సంతకాన్ని తప్పనిసరి చేసి ఉంటే రెండువేల నోట్లు దారి మళ్లడానికి అవకాశం ఉండేది కాదు. నకిలీ జెరాక్స్‌ కాపీల మూలంగా అవసరాని కంటే ఎక్కువుగా రెండువేల నోట్లు, వంద నోట్లు పక్కదారి పట్టించబట్టే బ్యాంకుల ముందు, పోస్టాఫీసులలో నగదు మార్పిడి కోసం ఇప్పటికీ 'క్యూ'లు తగ్గడం లేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter