Friday, 02 December 2016 10:58

బ్లాక్‌ను వైట్‌గా మారుస్తున్న వివేకా

Written by 
Rate this item
(0 votes)

galpika''ఓ అప్పారావు... ఓ సుబ్బా రావు... ఓ వెంకట్రావు... ఓ రంగా రావు... ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా... అయినా కానీ... రెడీ రెడీ రెడీరెడీ... అంగట్లో అన్నీ ఉన్నాయ్‌, వాకిట్లో అందాలున్నాయ్‌... చీకట్లో చిందులు ఉన్నాయ్‌... ఏమేమ్‌ కావాలి... నీకేమేమ్‌ కావాలి... మాలో ఎవ్వరు కావాలి...'' బొబ్బిలి పులి సినిమాలోని పాట రింగ్‌టోన్‌తో అదే పనిగా తన సెల్‌ ఫోన్‌ మోగుతుండ డంతో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(65) కళ్లు తెరిచాడు. ఆయనకు అంతా చీకటిగా వుంది. ఇంత అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేసింది ఎవరా... అనుకుంటూ ఫోన్‌ ఆన్‌ చేశాడు. అవతల నుండి వాయిస్‌ రికార్డ్‌ మెసేజ్‌... ''మీ బ్లాక్‌ మనీని వైట్‌ మనీ చేసుకోవాలనుకుం టున్నారా... మీకు అండగా వుంది బ్లాక్‌బస్టర్‌ మనీ డాట్‌ కామ్‌. లక్ష రూపాయల లోపు బ్లాక్‌మనీని వైట్‌గా మార్చాలనుకుంటే ఒకటి నొక్కండి, ఒక లక్ష నుండి 10లక్షలలోపు కోసం రెండు నొక్కండి, 10లక్షల నుండి కోటి రూపా యల కోసం మూడు నొక్కండి, కోటి రూపాయలకు పైన మార్చాలనుకుంటే నాలుగు నొక్కండి... కేవలం ముప్ఫై శాతం కమీషన్‌తోనే మీ బ్లాక్‌మనీని వైట్‌ మనీగా మారుస్తాం... డబ్బు మీది... భద్రత మాది'' అనే క్యాప్షన్‌తో ఆ వాయిస్‌ మెసేజ్‌ ముగిసింది. వివేకా ఏ నెంబర్‌ నొక్కకుండానే కాల్‌ కట్‌ చేసి, సెల్‌ఫోన్‌లో టైం చూసాడు.

ఉదయం 6గంటలైంది. అయినా ఇంకా చీకటిగా ఉందేదబ్బా అనుకుంటూ కళ్లు జిలగా ఉండడంతో నులుముకో బోయాడు... కళ్ల వద్ద ఆయనకు నల్ల ద్దాలు తగిలాయి. అప్పుడు గుర్తు కొచ్చిందాయనకు... రాత్రి పడుకో బోయే ముందు కళ్లకున్న నల్లద్దాలు తీయడం మరచిపోయాననే విషయం. ఆయన నల్లద్దాలు తీసాడు. అప్పుడు ఆ గదంతా ఆయనకు ఎంతో కాంతి వంతంగా కనిపించసాగింది. రాజూ అంటూ తన పిఏను కేకేసాడు. రాజు చేతిలో ఆరోజు పత్రికలను పట్టుకుని లోపలకు వచ్చాడు. వివేకా పేపర్లను తిరగేయసాగాడు. ఏ పత్రికలో చూసినా... ''30శాతం కమిషన్‌తో చేతులు మారుతున్న నల్లధనం''... అన్న వార్తలే... ఈ వార్తలు చూసాక వివేకా మెదడులో ఒక మెరుపు మెరిసింది. వెంటనే రాజుతో... తెల్లధనం కోసం మన నెల్లూరు ప్రజలు ఎన్నో తంటాలు పడుతున్నారు. తమ దగ్గరున్న నల్ల డబ్బును తెల్లడబ్బు చేసుకోవడానికి ఉత్తి పుణ్యానికి లక్షకు 30వేల రూపా యలు కోల్పోతున్నారు. ఇలాంటి కష్ట కాలంలో మనం నెల్లూరోళ్లను ఆదు కోవాలి, మనమేంటో నిరూపించు కోవాలి... వెంటనే ఈ స్లోగన్స్‌తో ఫ్లెక్స్‌లు తయారు చేయించు అని కొన్ని నినాదాలు వ్రాసిన పేపర్లను రాజు కిచ్చాడు.

---------

అది ఏ.సి సెంటర్‌లోని ఆనం వివేకా కార్యాలయం. అక్కడొక పెద్ద ఫ్లెక్సీ బ్యానర్‌ మీద ఇలా వ్రాసి వుంది... మీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి ఇవ్వబడును. కమిషన్‌ వెయ్యికి వంద రూపాయలు మాత్రమే... ఇట్లు మీ, వివేకా... ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్‌లను నగరమంతా కట్టారు. ఇలా బ్యానర్లు కట్టిన విషయాన్ని అన్ని టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేయడంతో ఈ వార్త ఏపి, తెలంగాణలకే కాక దేశమంతా పాకి పోయింది. చాలామంది నల్లకుబేరులైతే వివేకా సెల్‌కు ఫోన్‌లు చేస్తూ... ఈ కష్టకాలంలో నల్లధనవంతుల పాలిట ఆపద్భాంధవుడిలా నిలిచావంటూ అభి నందించసాగారు. ఈ వార్త తెలిసి ఏపి నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు, వడ్డీ వ్యాపా రులు సూట్‌కేసులు, గోతాం సంచు లలో డబ్బులు తీసుకుని ఏ.సి సెం టర్‌కు వచ్చారు. వివేకా పిఏలు రాజు, ఫణిలు వచ్చిన వారందరినీ అక్కడే వేసిన టెంట్‌ల వద్ద కూర్చోబెట్టి టోకెన్‌లు ఇవ్వసాగారు. నల్లధనాన్ని తీసుకోవడానికిగాను నెల్లూరుజిల్లా వారికి ప్రత్యేకంగా ఒక కౌంటర్‌, బయట ప్రాంతాల వారికి ఇంకో కౌం టర్‌ పెట్టసాగారు. వివేకా నల్లధనాన్ని ఏ రూపంలో తెల్లధనంగా మారుస్తు న్నాడో తెలుసుకోవడానికి తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి, నారాయణ, బీద రవిచంద్ర, అజీజ్‌, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైకాపా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌లు తలో యాభైవేలు తెచ్చి టోకెన్‌ ప్రకారం తమ నెంబర్‌ వచ్చి నప్పుడు కౌంటర్‌లో కట్టారు. నల్లడబ్బు కట్టిన వారందరికీ కూడా గంట తర్వాత తెల్లడబ్బు ఇస్తామని షరతుపెట్టి ఉం డడంతో అందరూ రెండు వేల కొత్త నోట్లు ఇస్తారనే ఆశతో ఆసక్తిగా కూర్చుని ఎదురుచూడసాగారు. వివేకా ఆధ్వర్యంలో రెండు కౌంటర్లలోకి కట్టలు కట్టలుగా పాత డబ్బులు వస్తున్నాయి. కొంతమంది వివేకా అనుచరులు వాటిని తీసుకుని వెనుక గదిలోకి పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అన్ని టీవీ ఛానెల్స్‌ వాళ్లు కూడా ఒబి వ్యాన్‌లను అక్కడికే తీసుకొచ్చి నల్లధన మార్పిడిని, కోట్ల కొద్ది అక్కడ పడు తున్న డబ్బును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించసాగారు. ఇలా నల్లకుబేరుల నుండి పాతనోట్లు తీసుకునే ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే అక్కడికి కొన్ని కార్లు వేగంగా దూసుకొచ్చాయి. వాటిల్లో నుండి సిబిఐ అధికారులు వేగంగా దూకారు... దూకిందే తడవుగా డబ్బులు తీసుకుంటున్న కౌంటర్లను సీజ్‌ చేశారు. సిబిఐ వాళ్లను చూడగానే బయట ప్రాంతాలనుండి వచ్చిన నల్లకుబేరులు చెల్లాచెదురయ్యారు. సిబిఐ అధికారి ఒకరు... ఈ కుంభ కోణానికి మూలకర్త వివేకా ఎక్కడ? అని ప్రశ్నించాడు. అక్కడే వున్న అబ్దుల్‌ అజీజ్‌... అదిగో ఆ గదిలో వున్నాడని చూపించాడు. సిబిఐ అధికారులు అలర్ట్‌గా వుంటూ ఆ గదిలోకి ఒక్క ఉదుటున దూసుకెళ్లారు. వారి వెనుకే జిల్లా టీడీపీ, వైసిపి నాయకులు కూడా వెళ్లారు. అంతే అక్కడ కనిపించిన దృశ్యం చూసి సిబిఐ అధికారులతో పాటు నాయకులు కూడా గుడ్లు తేలే సారు. అక్కడ వివేకా కుర్చీలో కూర్చుని పాత నోట్ల కట్టలను వైట్‌ పెయింట్‌ డబ్బాలలో ముంచి బయటకు తీసి ఫ్యాన్‌ల క్రింద ఆరబెడుతున్నాడు. ఆ గదంతా కూడా సంతపేటలోని సింహపురి పెయింట్స్‌ షాపులో కొన్న ఏషియన్‌, నెరోలాక్‌, నిప్పాన్‌ పెయింట్‌ డబ్బాలున్నాయి. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడమంటే ఇలాగా... అని సిబిఐ వాళ్లు నోరెళ్లబెట్టగా... వారిని చూసి వివేకా... మీరెంత డిపార్ట్‌మెంట్‌ వాళ్లయినా కూడా ముందుగా ఇవ్వడం కుదరదు, వెళ్లి టోకెన్‌ తీసుకోండి... అని చెప్పి, తన పని తాను చేసుకో సాగాడు.

Read 229 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter