10 December 2016 Written by 

అస్మదీయులకు ప'న్నీరు'..తస్మదీయులకు కన్నీరు!

wet dryఆ మహాకవి వేమనే ఇప్పుడుండుంటే ..'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నది కాస్తా మార్చేసి, రాజకీయములందు..నీళ్ళ రాజకీయములు వేరయా'..అని వుండేవారేమో!..ఎందుకంటే అన్ని రాజకీయాల్లోకన్నా నీళ్ళ రాజకీయాలే మిన్న అన్నట్లుగా వుంటున్నాయి నేటి జిల్లా రాజకీయాలు. అందుకే జిల్లాలో ఈ రబీ సీజన్‌ కాస్తా..నీళ్ళ రాజకీయాల సీజన్‌గా మారిపోయింది. పంటపొలాల సాగులో కూడా ఇప్పుడు అధికారపక్ష పొలాలు..ప్రతిపక్ష పొలాలు అన్నట్లుగా సీన్‌ మారిపోతున్నట్లుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'నారు ఒకటే అయినా..నీరు వేరయా' అంటున్నాయి తాజా రాజకీయాలు. ఈ నేపథ్యంలో అధికారపక్షం ప్రాంతంవారికి పుష్కలంగా గంగ..ప్రతిపక్షప్రాంతం వారికి తీరని బెంగ..మిగిలిందని సాగునీరందని రైతన్నలు కన్నీరు పెడుతున్నారు.

అభివృద్ధి అంటే ఎక్కడైనా సరే సమ గ్రాభివృద్ధి వున్నప్పుడే సాధ్యం. అధికారం లోకి వచ్చాక ప్రాంతాల పట్టింపు వుండ కూడదు. ఓటేసినా వేయకున్నా..గెలిచాక నాయకులు ప్రజలందరినీ సమభావంతోనే చూడాలి. ఏదో కక్ష కట్టినట్లు.. అవతలి వారికి ఓటేశారు కనుక వారికి నీళ్ళివ్వం.. కరెంటివ్వం అన్నట్లుగా ప్రవర్తించి వారిని క్షోభపెట్టడం ఏనాటికీ సమంజసం కాదు. పార్టీ ఏదైనా సరే, గెలిచాక అందరికీ న్యాయం చేయాలి. తాము ఓట్లేయకున్నా తమకు అన్యాయం చేయని నాయకులను ప్రజలు ఎప్పుడూ మంచిగానే గుర్తుపెట్టు కుంటారు. ఆ నిజం గ్రహించగలిగితే ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఆ మంచి నాయ కులకు మంచి ఫలితాలే వస్తాయి. అయితే, జిల్లాలో మాత్రం అలాంటి న్యాయం బాగా లోపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే జలా శయం నుంచి వచ్చే కాలువల గుండా ప్రవహించే నీరు..అధికారపక్షం ప్రాంతా ల్లోకి జోరుగా ప్రవహించడం, ప్రతిపక్ష ప్రాంతాల వద్దకు వచ్చేసరికి మూతి ముడుచుకుని మరోదారి మళ్ళిపోవడం.. ఎంతైనా అన్యాయమేనంటున్నారు రైతన్నలు. జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, కావలి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపి గెలిచింది కనుక, పాలకపక్షం వారు ఈ నియోజకవర్గ ప్రజలకు అంది వ్వాల్సిన సౌకర్యాల విషయంలో నామ మాత్రంగానే వ్యవహరిస్తున్నారనేది ప్రతి పక్షం వారి విమర్శ. అందులో భాగంగానే ఈ రబీ సీజన్‌లో సోమశిల జలా శయంలో పుష్కలంగా నీరున్నా, వరి వేసు కున్న ప్రతిపక్షప్రాంత రైతాంగానికి.. ముఖ్యంగా అనేక గ్రామీణప్రాంతాల ఆయకట్టుదారులకు సాగునీరు సరిగ్గా అందడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించిన అనేక గ్రామాల్లో పొలాలు నీరందక బీడుపడిపోతున్నాయని, నార్లకు నీరందక నోళ్ళెండబెడుతున్నాయని, అయినా అధికారవర్గాలకి ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వుంటున్నారే తప్ప స్పందించకపోవడంలో అంతరార్ధం ఏమిటని ఆయా గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులందరూ తీవ్రఆవేదనతో అంటున్నారు. వైఎస్సార్సీపి ఇక్కడ గెలి చింది కనుక, పాలకులు సాగునీరివ్వ కుండా ఇబ్బందిపెడుతున్నారనే ఆవేదన అందరిలోనూ కనిపిస్తోంది. రూరల్‌లోని ఓగూరుపాడు, అక్కచెరువుపాడు, చెముడు గుంట, కంసాలగుంట, అంబాపురం తదితర 50గ్రామాల్లో చెరువులకు ఈ రబీలో సక్రమంగా సాగునీరందలేదని, చెరువుల్లో నీరు లేకపోవడం, వానలు కురవకపోవడంతో వేసుకున్న నార్లు ఎండిపోతున్నాయని రైతులు లబోదిబో మంటున్నారు. అదేవిధంగా ఇతర ప్రతిపక్ష నియోజకవర్గాల్లోనూ ఇదే దుస్థితి దాపు రించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అస్మదీయులకు ప'న్నీరు'.. తస్మ దీయులకు కన్నీరు అన్నట్లుగా, అధికార పక్షానికి ఓట్లేసిన ప్రాంతాలకి సాగునీరు పుష్కలంగా అందుతున్నాయని, ప్రతిపక్ష నాయకులు గెలిచిన ప్రాంతాల్లో.. ఇక భవిష్యత్తులో వారికి గెలుపన్నదే లేకుండా వుండాలని కాబోలు.. చుక్క నీరందించ కుండా పంటపొలాలను ఎండబెట్టేస్తున్నా రని, ఇదెక్కడి న్యాయమని ఆయా ప్రాం తాల రైతన్నల ఆవేదన.

ఇదేమి న్యాయం? అని ఎవరేనా ఆవేదనతో ప్రశ్నిస్తే, ప్రస్తుతానికింతే సరి పెట్టుకోండి. సీజన్‌ అయిపోగానే నీళ్ళేమైనా మిగిలితే ఇచ్చేందుకు చూస్తాంలే అని అధికారులు తాపీగా అంటున్నారని మరి కొందరి రైతుల వేదన. జిల్లా కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులైనా ఈ దుస్థితిని గమ నించి, స్వపక్షం-విపక్షం అనే వివక్ష లేకుండా అన్నిప్రాంతాల రైతులందరికీ సాగునీరు సమంగా అందించాలని వారి విజ్ఞాపన. అనేకగ్రామాల్లో ఒక్క పంట పొలాలకే కాదు, సాగునీరు కూడా లే పోవడంతో వేలాది మూగజీవాలకు తాగునీరు లేకుండా పోయిందని, ఆ జీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుందని పశుపోషకులు, రైతులు వాటి అవస్తలు చూసి కన్నీరు పెడుతున్నారు. కనీసం మానవతా దృక్ఫధంతోనైనా అధికారులు స్పందించి, వెంటనే అన్ని ప్రాంతాలకు అవసరమైన సాగునీటిని పంపకం చేయాలని, ఈ రబీసీజన్‌ ముగి యకముందే సాగునీరందని ప్రాంతాలకు సాగునీరందించి రైతాంగాన్ని, పాడిపశువులను, మూగజీవాలను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter