Saturday, 10 December 2016 12:24

కార్డులతోనే కాపురాలు చేయొచ్చు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది 'ఏబిసిడి' ఛానెల్‌ స్టూడియో... హైటెక్‌రత్న, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆ ఛానెల్‌ అధినేత గోకుల్‌కృష్ణ 'జికెతో తెరచుకున్న గుండె' కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుపై మీ స్పందన ఏంటని జి.కె. అడిగాడు. నాకు చాలా అసహనంగా వుంది. సునామీలను కుడి చేత్తో, తుఫాన్‌లను ఎడమచేత్తో ఆపినవాడిని, భూకంపాలను కాలి క్రింద తొక్కి పెట్టినోడిని... నాకే ఇది అసహనంగా వుందంటే ఇక ప్రజలకు ఎంత అసహనంగా ఉం టుందో, పెద్దనోట్ల రద్దు అసహనంపై ఇక ఉద్యమం చేయాలనుకుం టున్నాను అని చెప్పాడు. అప్పుడు జి.కె ప్రేక్షకులకు ఒక ప్రశ్న వదిలాడు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం తనకే అసహనం కలిగిస్తుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తారా? అవును అయితె 'ఎస్‌' అని, కాదు అయితే 'నో' అని టైప్‌ చేసి ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా మాకు పంపండి అని చెప్పాడు. ఒక్క నిముషం తర్వాత స్క్రీన్‌ మీద 99శాతం మంది 'ఎస్‌' అని 1 శాతం మంది 'నో' అని ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు కూడా రిజల్ట్స్‌ ఇచ్చారు.

ఇదంతా కూడా ఢిల్లీలోని తన కార్యాలయంలో కూర్చుని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నాడు. ఆయన పక్కనే కేంద్రమంత్రులు మనోహర్‌ పారికర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడులు కూడా వున్నారు. మోడీ వుండి... ఏం వెంకయ్యాజీ, మన చంద్రబాబుకేంటో అసహనంగా ఉందంటా... ఆ కేసీఆర్‌కు ఫోన్‌ చేసి 'ఓటు-నోటు' కేసు ఎక్కడదాకా వచ్చిందో చూడమను అని చెప్పాడు. అప్పుడు వెంకయ్య కలుగజేసుకుని... అతనిని ఖాళీగా పెడితే ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు సార్‌, ఈ పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో అతనిని కూడా ఇన్‌వాల్వ్‌ చేద్దాం. అప్పుడు మనతో పాటూ లాక్కోలేక పీక్కోలేక అగచాట్లు పడుతుంటాడని అన్నాడు. ఏం చేద్దామంటారని మోడీ అడిగాడు. బాబుకు టెక్నాలజీ అంటే మహా పిచ్చి. బిల్‌గేట్స్‌కు కూడా కంప్యూటర్ల మీద ఈయన కున్నంత మోజుండదు. కాబట్టి 'క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌ కమిటి' అని ఒక దానిని వేసి ఆయనను కన్వీనర్‌గా పెడదాం, ఇక మనల్ని నోరెత్తి ఒక్క మాట అనలేడని వెంకయ్య సలహా ఇచ్చాడు. అలాగే చెయ్యండని మోడీ చెప్పాడు.

-----

హైదరాబాద్‌లోని ఏబిసిడి ఛానెల్‌ స్టూడియోలో జి.కె ఇంటర్వ్యూ కొనసాగుతోంది. అప్పుడే చంద్రబాబు సెల్‌ఫోన్‌ మోగింది. బాబు ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి వెంకయ్య... నిన్ను క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ కమిటి కన్వీనర్‌గా ప్రధాని నియమించారు. ఈ పదవికి నువ్వే అర్హుడివి. నువ్వే న్యాయం చేయగలవు... అని చెప్పి పెట్టే సాడు. బాబు ఈ విషయాన్ని ఎదురుగా వున్న జి.కెకు చెప్పాడు. వెంటనే ఛానెల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ 'క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ కమిటి కన్వీనర్‌గా చంద్రబాబు' అంటూ పది నిముషాల పాటూ పదేపదే చూపించారు. ఓ పక్క అది చూపిస్తూ ఇంకో బాక్స్‌లో ఇంటర్వ్యూ కొనసాగిస్తూ... ఇప్పుడు చెప్పండి ఈ పదవి రావడం పట్ల మీరెలా ఫీలవుతున్నారని జి.కె. అడిగాడు. దానికి బాబు... నా ఆలోచనలకు తగ్గ బాధ్యత ఇది. కరెన్సీ రూపంలో లావాదేవీలు ఉండకూడదని, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, చెక్కులు, పేటిఎం వంటి సాంకేతిక మార్గాల ద్వారా చెల్లింపులు జరగాలని నేను మొదట్నుండి కోరుకుంటున్నాను. ప్రజల్లో ఆ మార్పు తెచ్చే ప్రక్రియను కేంద్రం నాకే అప్పగించిందంటే, నా తెలివితేటల పట్ల వారికెంత నమ్మక ముందో అర్ధమవుతుంది. పెద్దనోట్ల రద్దు అనేది దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమే! ప్రజలు 'క్యూ'లలో నిలబడి అసహనం చెందాల్సిందేమీ లేదు. నోట్ల మార్పిడి కోసం ప్రజలు 'క్యూ'లో నిలబడడాన్ని అసహనంగా కూడా భావించడం లేదు అని చెప్పాడు. అప్పుడు వెంటనే జి.కె. ''పెద్దనోట్ల రద్దుపై ప్రజలు అసహనం చెందడం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని మీరు సమర్ధిస్తారా?'' మీ సమాధానం అవును అంటే 'ఎస్‌' అని, కాదు అయితే 'నో' అని టైప్‌ చేసి యధాఫళంగా ఎస్‌ఎంఎస్‌లు పంపండి అని ప్రశ్న వదిలాడు. ఒక్క నిముషంలోనే మళ్ళీ 'ఎస్‌'కు 99శాతం మంది 'నో'కు ఒక్క శాతం మంది ఓటేసినట్లు ఫలితాలిచ్చారు. చంద్రబాబు ఆ రిజల్ట్స్‌ చూసి... మీకు ఎస్‌ఎంఎస్‌లు ఇంత తొందరగా వస్తాయా? అయినా ఎంతమంది ఈ కొద్ది టైంలో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తారని ధర్మ సందేహం వెలిబుచ్చాడు. ప్రజలు పంపించే ఎస్‌ఎంఎస్‌లు చూస్తే నాతోపాటూ మీకు కూడా మూడ్‌ మారుద్ది. అయినా మన ఛానల్‌లో వాళ్లెవరో పంపించే రిజల్ట్స్‌ తీసుకోవడ మేంటి... ఆ రిజల్ట్స్‌ కూడా మేమే నిర్ణయిస్తామని చెప్పాడు. సరే నేను నా విధుల్లోకి దిగాలి... ఒకట్రెండు నెలల్లో ప్రజలంతా కరెన్సీని మరచిపోయి కార్డుల వైపు మళ్లేలా చూడాలి. నేను మళ్లీ కలుస్తా నంటూ చంద్రబాబు లేచాడు.

----

అది సింగపూర్‌ కమ్‌ అమరావతి రాజధాని పరిధిలోని వెలగపూడి గ్రామం. నగదు రహిత కమిటి కన్వీనర్‌ చంద్రబాబు, కమిటీ సభ్యులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌, నారాయణస్వామిలు ఆ గ్రామంలో ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఒక మహిళ తలుపు తీసింది. నీ పేరేంటమ్మా అని చంద్రబాబు అడిగాడు. వెంకాయమ్మ అని ఆమె చెప్పింది. చూడు వెంకాయమ్మా... నీ దగ్గర కార్డు ఉందా అని చంద్రబాబు అడిగాడు. ఉన్నాయయ్యా అని వెంకాయమ్మ చెప్పింది. వెరీగూడ్‌ వెంకాయమ్మ... నీలాంటి మహిళలే ఈ దేశానికి స్ఫూర్తి కావాలి... ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలున్నాయి వెంకాయమ్మా... మీ ఇంట్లో డబ్బులు పెట్టుకోవాల్సిన పనే లేదు. ప్రొవిజన్‌ షాపుకు పోయి కార్డు ఇస్తే సరుకులు ఇస్తారు, రేషన్‌ షాపుకు వెళ్లి కార్డు ఇచ్చినా నిత్యావసర వస్తువులిస్తారు. కరెంట్‌ బిల్లులు, ఫోన్‌ బిల్లులను కూడా కార్డు ద్వారానే కట్టొచ్చు. చందన బ్రదర్స్‌, కళానికేతన్‌, శుభమస్తు వంటి షాపింగ్‌మాల్స్‌కు వెళ్లి ఎంచక్కా ఈ కార్డులతో కావాల్సినవి కొనుక్కోవచ్చు. హోటల్‌కెళ్లి కడుపు నిండా తిన్నా బిల్లుకు డబ్బులివ్వబల్లేదు అని చంద్రబాబు చెబుతుండగా లోపల నుండి వెంకాయమ్మ భర్త రాయల్‌స్టాగ్‌ రాజన్‌ వచ్చాడు. గురుడు మంచి నిషాలో వున్నాడు. షంద్రబాబు సర్‌... బార్‌లో పీకల దాకా తాగి డబ్బులివ్వబల్లేదా... కార్డు షరిపోతుందా... అని అడిగాడు. అందుకు చంద్రబాబు... అసలు మీరు వేటికీ డబ్బులివ్వాల్సిన పని లేదు. అన్నింటికీ కార్డే వాడొచ్చు అని చెప్పాడు. అంతే వెంకాయమ్మ చంద్రబాబు రెండు చేతులు పట్టుకుని... మా బాబే, మా బంగారు నాయనే... ఎన్నికలప్పుడు బాబు వస్తే బ్రతుకులు మారుతాయంటే ఏంటో అనుకున్నా... నిజంగానే మా బ్రతుకులు మార్చేసావు. మాకు డబ్బులు సంపాదించుకునే పని లేకుండా చేసావు, నీ ఋణం ఎలా తీర్చుకోవాలి నాయనా... జన్మజన్మలకు నువ్వే మా సీఎం కావాలని ఏడుస్తూ చెప్పసాగింది. చంద్రబాబుకు డౌటొచ్చి ఇంతకీ మీ దగ్గర ఏం కార్డుంది అని అడిగాడు. వెంటనే వెంకాయమ్మ లోపలకెళ్ళి అర నిముషంలో తిరిగొచ్చింది. ఇదిగో నాయనా... ఇది రేషన్‌కార్డు, ఇది ఆధార్‌కార్డు, ఇది ఆరోగ్యశ్రీ కార్డు... ఇదేమో కిసాన్‌ కార్డ్‌... ఇదిగో ఇదేమో ఓటర్‌ కార్డు అంటూ కార్డులన్నీ చంద్రబాబు చేతిలో పెట్టింది. కార్డ్‌ అంటే జనం ఈ కార్డులనుకుంటున్నారా... క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు కాదా అని మనసులో అనుకుంటూ చంద్రబాబు అవాక్కయ్యాడు.

Read 132 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter