16 December 2016 Written by 

డిజిటల్‌ ఇండియా

swipe'డిజిటల్‌ ఇండియా'...ఇక రానున్నది ఇదే. ఇప్పటికే అది ప్రారంభమై క్రమేణా వ్యవస్థీకృత మవుతోంది. భారత్‌ భవితకు బంగరుబాటలు వేసే లక్ష్యంతో ముందుకు వస్తున్న ఈ ఆర్థిక వ్యవస్థ ఇక రానున్న రోజుల్లో మరింత బలీయమై, అవినీతికి..అక్రమాలకు అంటకత్తెర వేస్తూ..అచ్చమైన స్వచ్ఛపాలనకు దారులు తీస్తుంది. ఈ పుణ్యమంతా మోడీ సర్కారుదే. ఇన్నాళ్లూ దేశంలో అంతులేని కుంభకోణాలతో, అక్రమార్జనలతో, అవినీతితో కుళ్ళిపోయిన వ్యవస్థను కూకటివేళ్ళతో సహా పెకలించివేసి సుదృఢమైన సుపరిపాలన వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. పెద్దనోట్ల రద్దుతో అవినీతి అక్రమార్జనలకు అడ్డుకట్ట పడుతోంది. బడాబాబులు వందలు, వేల, లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా వెనకేసుకున్న వైనాన్ని పెద్దనోట్ల రద్దు నిర్ణయం బట్టబయలుచేస్తోంది. సామాన్య ప్రజలు, కష్టజీవులు నిత్యదరిద్రంతో బాధలు పడుతూ వుంటే, 'నల్ల' దొరలు మాత్రం కోటానుకోట్లుగా నల్లధనాన్ని భోషాణాల్లో దాచుకుని వుండడం, మరోవైపు ఉగ్రవాదుల దుష్కృత్యాలకు.. నకిలీనోట్ల చెలామణికి అంతూపొంతూ లేకుండా వుండడం..వగైరాలన్నిటికీ ఒకే ఒక విరుగుడు మందు.. పెద్దనోట్ల రద్దు. దీంతో అవినీతి మూలాలు కదల బారుతున్నాయి. అక్రమార్జనపరుల గుండెలు బెంబేలెత్తుతున్నాయి. అటు బ్యాంకుల్లో అంతపెద్ద మొత్తాలు వేసుకోలేక, ఇటు ఇళ్ళలో అంతంత డబ్బు దాచుకోలేక అక్రమార్కులు పడే అవస్తలు అన్నిన్ని కావు. నల్లడబ్బును తెల్లగా మార్చుకోవాలని రక రకాల యత్నాలు చేసేవారూ దొరికిపోక తప్పని స్థితి వచ్చేసింది. ఇప్పటికే ఎంతోమంది దొరికి పోతున్నారు కూడా.

ఏదేమైనప్పటికీ, పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు కంకణం కట్టుకున్న ప్రధాని మోడీని, మోడీ సర్కా రును ఎంతైనా అభినందించక తప్పదు. ఈ మార్పు భారతావనిలో మరిన్ని సరికొత్త మార్పులకు దారితీస్తుందని చెప్పక తప్పదు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క ప్రజలు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఇంకెన్నో రోజులు వుండవు.. త్వరలోనే ఆ కష్టాలు మటుమాయం కానున్నాయి. అయినా, ఇంతపెద్ద దేశంలో ఒక కొత్త వ్యవస్థ.. అందులోనూ పెనురాకాసిలా వున్న అవినీతిని నిర్మూలిస్తూ..ఒక స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ...ఆవిర్భావం జరగాలంటే ఎన్నో సమస్యలు తప్పవు. వాటిని కష్టమోనిష్టమో కొద్దికాలం భరాయించక తప్పదు. కొద్దిరోజులు కష్టపడినా ఇక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ వుండవు. అందులోనూ అవినీతిరహిత విధానాలకు, బస్తాలకొద్దీవున్న నల్లడబ్బు పీచమణిచేందుకు చేస్తున్న ఈ బృహత్‌ యజ్ఞంలో మనమూ ఒకరం కావడం..రానున్న పవిత్రభారత్‌కు మనవంతు సహకరించగలగడం నిజంగా ఒక అదృష్టమేననుకోవాలి. ఎప్పటికైనా సరే మార్పు అనివార్యం. ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పు భారత్‌ భవితను మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ చెల్లింపు మార్గాలు ప్రజలకు బాగా దగ్గరవుతున్నాయి. జేబులో నోట్లకట్టలు పెట్టుకుని బజారుకువెళ్ళే రోజులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి. ఓ చిన్నకార్డు జేబులోవుంటే చాలు మన డబ్బంతా మన జేబులో వున్నట్లే. కార్డు గీకితే చాలు, ఏ వస్తువు కావాలో అది ఇక వచ్చేసినట్లే. డిజిటల్‌ విధానం అంటే అదే. భారత్‌ ఇన్నాళ్ళకి..ఇన్నేళ్ళకి ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానపు ఒరవడితో..డిజిటల్‌ విజ్ఞానంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇక అందరూ పాతకాలపు పద్ధతులు మాని, కొత్త పద్ధతులతో, అధునాతన సాంకేతిక పద్ధతులతో..విజ్ఞతతో డిజిటల్‌ ద్వారాలు తెరవాల్సి వుంది. ఎంతో శ్రేయస్కరమైన నగదురహిత లావాదేవీలకు సంసిద్ధం కావాల్సివుంది. అందుకు బాసటగా వున్న ప్రభుత్వంతో సహకరించి, డిజిటల్‌ విప్లవానికి బాటలు వేసుకోవాల్సి వుంది. ఎన్నో దేశాలు డిజిటల్‌ విధానాలతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ మార్పు మనకూ ఇక అనివార్యం. లేకుంటే వెనుక బడిపోవడం ఖాయం. డిజిటల్‌ లావాదేవీ పద్ధతులతో, నగదు రహిత విధానాలతో, దేశాన్ని ఎంతగా నగదు రహితం చేస్తే అంతగా స్వచ్ఛమైన ఆర్థికవ్యవస్థ ఆవిర్భవిస్తుందన్న గట్టి విశ్వాసంతో ప్రధాని మోడీ వేసిన ఈ పునాదులే..రేపటి డిజిటల్‌ ఇండియాకు మార్గాన్ని సుగమం చేయనున్నాయి. అవినీతి, అక్రమార్జనలను నిరోధించి, నానాటికీ అస్తవ్యస్తంగా మారుతున్న ఆర్థికవ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనం చేస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. అందుకే ఆధార్‌ అనుసంధానంతో, సెల్‌ఫోనే ఒక బ్యాంక్‌గా అవతరించి, మన డబ్బుకు ఎలాంటి ఢోకా లేకుండా కొనుగోళ్ళు చెల్లింపులు చేసుకునే విధానానికి దేశ వ్యాప్తంగా ప్రజలనుంచి వూహించని ఆదరణ పెరుగు తోంది. అవినీతి అక్రమాలకు తావులేకుండా..ఇక ఈ-వాలెట్లు, రూపే కార్డ్‌లు, డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ కార్డులతో ప్రజలంతా నగదు రహితంగా డిజిటల్‌ చెల్లింపులు జోరందుకోబోతున్నాయి. గ్రామగ్రామానా విస్తరించిన మొబైల్‌ ఫోన్స్‌ అవినీతిక్షాళన మహోద్యమానికి ఎంతో ఉపకరిస్తున్నాయి. డిజిటల్‌ యంత్రమే..ఒక మంత్రంగా మారుమ్రోగనుంది. మొబైల్‌ ఫోన్ల ద్వారా జరిగే నగదు రహిత లావాదేవీలతో దేశంలో ఎంతో శ్రేయస్కరమైన..అవినీతిరహితమైన ఆర్ధికవ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇదే భవిష్యత్తులో.. ప్రజలందరూ కలలు కన్న శ్రేయోరాజ్యంగా ఆవిష్కృతమవుతుంది. ప్రతి వస్తువునూ ఇక డిజిటల్‌ పద్ధతి ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న బృహత్‌యత్నం అత్యంత త్వరలోనే దేశమంతటా సాకారం కానుంది.

అవినీతిని రూపుమాపే డిజిటల్‌ యంత్రాంగం పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తే..సమస్త జనుల సంక్షేమం దానంతటదే అందుబాటులోకి వస్తుంది. ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. అందుకు అన్నివిధాలా బాటలు వేస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి, భారత సర్కారుకు అభినందనలు!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
    విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter