Friday, 16 December 2016 13:06

అవినీతికి సెంటర్‌... డివైడర్‌

Written by 
Rate this item
(0 votes)

dividerఅవినీతి, అక్రమాల విషయంలో మనం 'అమరావతి' కథలు వింటున్నాం. భూసేకరణ నుండి తాత్కాలిక భూములు, స్విస్‌ ఛాలెంజ్‌పై సింగపూర్‌ కన్సార్టియంకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం, పనులకు అంచనాలు పెంచడం, పనుల్లో నాణ్యత లోపిం చడం... ఇవన్నీ చూస్తుంటే అవినీతి ఇంత దారు ణంగా వుంటుందా అనిపిస్తుంది. అయితే మనం దారుణమైన అవినీతి గురించి తెలుసుకోవడానికి అమరావతి దాకా పోనవసరం లేదు. నెల్లూరులోనే ఎన్నో ఆనవాళ్లున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ కేంద్రంగా జరిగే అవినీతి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నెల్లూరుజిల్లాకే చెందినవాడైన మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ఇక్కడి నగర పాలకులకు అవినీతి లైసెన్స్‌లు ఇచ్చినట్లుగా వుంది ఇక్కడి వ్యవహారం.

నెల్లూరు నగరపాలక సంస్థలో అవినీతి పలు రూపాలలో తన పనులు తాను చేసుకుపోతోంది. వాటిలో ఒక రూపమే డివైడర్‌ల అభివృద్ధి! ఈ డివైడర్‌ల అభివృద్ధి అంటే ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇటీవల నెల్లూరు నగరంలో డివైడర్‌ల అభివృద్ధి అంటూ దాదాపు కోటి రూపాయలు మంజూరు చేశారు. రోడ్ల మీద డివైడర్‌లు కొత్తగా కట్టడం లేదు. ఇప్పుడున్న డివైడర్లలో వున్న మట్టిని తీసి మళ్ళీ అదే మట్టిని నింపుతున్నారు. అక్కడ నాలుగు పిచ్చి మొక్కలు నాటి దానినే డివైడర్‌ అభివృద్ధి అంటున్నారు. ఈ పనులకే లక్షల రూపాయల బిల్లులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మేయర్‌ కనుసన్నలలో జరుగుతున్న పనులే! నాటు భాషలో చెప్పాలంటే ఉడ్డమోసపు పనులు.

గత పాలకవర్గంలోనూ నగరంలో డివైడర్లు నిర్మించారు. అయితే ఇవి కార్పొరేషన్‌ నిధులతో చేపట్టలేదు. డివైడర్‌ల మీద ప్రకటన బోర్డులు పెట్టు కోవడానికి అనుమతి తీసుకున్న వాళ్ల చేత డివైడర్లు కట్టించారు. దీని వల్ల కార్పొరేషన్‌కు రూపాయి ఖర్చు లేకుండా పోయింది. ఇప్పటి పాలకవర్గంలో లాగా గత పాలకవర్గం కూడా ఇంతటి దారుణ మోసాలకు పాల్పడివుంటే ఈ కార్పొరేషన్‌ బిల్డింగ్‌ను కూడా అమ్ముకోవాల్సి వచ్చేది.

Read 2205 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter