16 December 2016 Written by 

కౌంట్‌డౌన్‌.. ఇక రెండు వారాలే!

500 1000ఇక గట్టిగా రెండు వారాలు... బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు మనం 'క్యూ'లలో నిల్చోవడానికి మిగిలిన రోజులు. డిసెంబర్‌ 30తో నోట్ల మార్పిడికి ఆఖరిరోజు. ఆ తర్వాత ప్రధాని చెప్పినట్లు 'అచ్చేదిన్‌' వస్తుందా, జనం 'చచ్చేదిన్‌'లు వస్తాయా అన్నది వేరే సంగతి! పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం, చిన్న నోట్ల కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నవంబర్‌ 8వ తేదీ రాత్రి పెద్దనోట్లు రద్దును ప్రకటించారు. 9వ తేదీ నుండి బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు 'క్యూ'లు మొదలయ్యాయి. క్యూలలో జనం మొదటి రోజు ఏ విధంగా వున్నారో ఈ రోజుకీ అదే విధంగా ఉంటున్నారు. నోట్ల రద్దు తర్వాత వారంలోపే అంతా సర్ధుకుంటుందని, వారం తర్వాత 'క్యూ'లు వుండవని భావించారు. కాని ఆర్‌బిఐ పంపించిన కొత్త కరెన్సీ సగం బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లడం, ఒకసారి తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ డబ్బులు విత్‌డ్రాకు వస్తుండడంతో బ్యాంకులు, ఏటిఎంల ముందు ఏ మాత్రం క్యూలు తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా కూడా నగదు డిమాండ్‌ అధికంగా వుండగా సరఫరా అంతంత మాత్రంగా వుంది. ప్రజలకు డబ్బు అందివ్వలేక బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. ఏటిఎంలలో పెట్టిన డబ్బు రెండు గంటల్లో ఖాళీ అవుతుంది. జిల్లాలో ఎప్పుడు చూసినా 80శాతం ఏటిఎంల ముందు 'నో క్యాష్‌' బోర్డులే దర్శనమిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మొత్తం వందల కోట్లలోనే వ్యాపార నష్టం వుంటుంది. 2016 నష్టాలతో ముగుస్తుంది. ఈ నెలాఖరుతో ఈ నోట్ల కష్టాలు ముగుస్తాయి. కనీసం కొత్త సంవత్సరంలోనన్నా కొత్త కరెన్సీ సమస్యలు తీరుతాయోమోనని ప్రజలు ఆశిస్తున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter