16 December 2016 Written by 

వార్ధ వ్యర్ధమైంది!

vaardhaబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా మారింది. రేపు రాత్రికి నెల్లూరు-బందరుల మధ్య తీరం దాటనుంది... కొన్నేళ్ల క్రితం రేడియోలలో ఇలాంటి వార్తలు విన్నప్పుడు ప్రజలు వణికిపోయేవాళ్లు. ఓ నెలకు సరిపడా తిండిగింజలు నిల్వ చేసుకునే వాళ్లు. పూరిళ్లు, రేకుల ఇళ్లు వదిలేసి కొంచెం గట్టిగా ఉండే ఇళ్లలో తలదాచుకునేవాళ్లు. తుఫాన్‌ వస్తుందంటే సముద్రంలో నుండి ఓ గాలిభూతం లేచి తమ మీద పడుతున్నంతగా భయపడేవాళ్లు.

కాని ఇప్పుడు... పరిస్థితి మారింది. వాయుగుండాలకు స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానించే పరిస్థితులొచ్చాయి. తుఫాన్‌ లను మా ప్రాంతంలో తీరం దాటించేలా చేయమని భగవంతుడిని కోరుకునే దిక్కుమాలిన దుస్థితి దాపురించింది. దీనికి కారణం తీవ్ర వర్షాభావ పరిస్థితులే! సీజన్‌ల వారీగా కురవాల్సిన వానలు కురవకపోవడమే!

సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడితే తప్పితే నెల్లూరుజిల్లాలో సాధారణ వర్షాలు కనుమరుగయ్యాయి. చిత్త, విశాఖ, స్వాతి వంటి కార్తెల్లో కూడా వర్షాలు కురవడం లేదు. పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో అయితే ప్రతి ఏడాది జూన్‌, జూలై నెలల్లో ఒక పదును వాన పడేది. తిరిగి అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఈశాన్య ఋతుపవనాల వల్లగాని, సముద్రంలో అల్పపీడనాల వల్లగాని భారీ వర్షాలు కురిసి చెరువులు, బావులు, రిజర్వాయర్‌లు నిండేవి. దీనివల్ల సంవత్సరం పొడవునా తాగునీళ్లకు సాగు నీళ్లకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు జిల్లాలో తుఫాన్‌ల మూలంగా కూడా వర్షాలు లేకుండా పోయాయి.

గత ఏడాది నవంబర్‌లో జిల్లాలో కుండపోత వర్షాలు కురిసాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు ముంపుకు గురికావడం కూడా జరిగింది. ఈ ఏడాది నవంబర్‌ దాటిపోయింది. డిసెంబర్‌ నెల సగమై పోయింది. ఇక జిల్లాకు వర్షమే లేదా అని అనుకుంటున్న తరుణంలో 'వార్ధా' తుఫాన్‌ ఆశలు రేపింది. మొదట ఈ తుఫాన్‌ బందరు - నెల్లూరు మధ్య తీరం దాటు తుందని అంచనా వేసారు. నెల్లూరు వద్ద తీరం దాటుద్దని టీవీ ఛానెల్స్‌ ఘోషించినా ప్రజలు బెదరలేదు, సరికదా సంతోష పడ్డారు. ఈ తుఫాన్‌ మూలంగా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతుంటే నీళ్ల కరువు తీరినట్లేనని ఆశపడ్డారు. తీరా చూస్తే ఈ తుఫాన్‌లకు కూడా నెల్లూరుపై కనికరం లేనట్లుంది. తుఫాన్‌ చెన్నై వద్ద తీరం దాటింది. భారీ వర్షాలన్నీ కూడా తమిళనాడులో పడ్డాయి. నెల్లూరుజిల్లాలో నామమాత్రపు వర్షాలు పడ్డాయి. అది కూడా జిల్లాలో తూర్పువైపు మండ లాలలోనే! మెట్ట ప్రాంతంలో ఆకాశం మబ్బులు పట్టి ఉండటం తప్పితే చినుకు లేదు. భారీ తుఫాన్‌లప్పుడు కూడా జిల్లాలో వర్షాలు లేకపోతే ఇక సాధారణ పరిస్థితుల్లో వానలేం పడతాయో!

ఊరట కలిగించని 'వార్థా' వాన

వార్థా తుఫాన్‌ గమనం మారడంతో ఎట్టకేలకు జిల్లాకు తుఫాన్‌ ముప్పు తప్పింది. అంతేకాదు, తుఫాన్‌వల్ల గాలులు వీచి కొంతమేరకు నష్టం వాటిల్లినా, వార్థా ప్రభావంతో కురిసిన వర్షం రైతాంగానికి, ముఖ్యంగా మెట్టప్రాంత రైతులకు పెద్దగా వూరట కలిగించలేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • 'పీకే'దేమీ లేదు
    జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…
  • కాలం కరిగిపోతుంది... ఆశ ఆవిరవుతోంది!
    నిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ…

Newsletter