Friday, 16 December 2016 13:31

బ్లాక్‌మనీ కోసం బాబు సూపర్‌ స్కెచ్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని టెన్‌జనపథ్‌... కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలతో అక్కడంతా అట్టహాసంగా వుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులందరూ పుష్ప గుచ్ఛాలతో సోనియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చిన అతిథులందరికీ వి.హెచ్‌.హనుమంతురావు, రేణుకాచౌదరి, మధుయాష్కీలు స్వీట్లు, కాఫీ అందిస్తున్నారు. అయితే వచ్చిన వాళ్లంతా కూడా వంద రూపాయల్లోపు ఖరీదు చేసే బొకేలే తెస్తున్నారు గాని, వేలు, లక్షలు ఖరీదు చేసే వివిధ రకాల గజమాలలు, ముత్యాల దండలు తేవడం లేదు. అది గమనించిన రాహుల్‌ తన తల్లితో... చూడమ్మా, అధికారం లేకపోయే సరికి వీళ్లకు మనం అలుసైపోయాము. ఇంతకుముందు మీ బర్త్‌డే అంటే గజమాలలు తెచ్చే వాళ్లు, భారీ ఎత్తున బాణాసంచా కాల్చే వాళ్లు. 2జీ స్పెక్ట్రం, బొగ్గు, హెలికాఫ్టర్‌ల డబ్బులు వేలకోట్లు దిగమింగి వెయ్యి రూపాయల దండ తేవడానికి కక్కుర్తి పడు తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమేనా మనం మన పార్టీని స్కాములకు కేరాఫ్‌ అడ్రస్‌గా చేసింది అని బాధపడసాగాడు. అందుకు సోనియా... మనవాళ్ళను అపార్ధం చేసుకోకు రాహుల్‌... వాళ్ల అభిమానంపై ఆవగింజంత అనుమానం పెట్టుకోకు... పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఇప్పుడు ఎవరి వద్దా డబ్బులు లేవు. ఇప్పుడు కూడా వీళ్లు ఇంటి అవసరాలు తగ్గించుకుని నా కోసం ఈ బొకేలు తెచ్చుం టారు. ఆ మోడీ పుణ్యాన ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు చెప్పు అని అంది. మామ్‌... నాకు ప్రధాని అయ్యే అవకాశ ముందంటారా అని రాహుల్‌ ప్రశ్నించాడు. మొన్నటిదాకా నాకు నీపై నమ్మకముండేది కాదు. కాని, ఇప్పుడెందుకో నమ్మకం కలుగు తోంది. నేను నరేంద్రమోడీని పెద్ద మేధావి, అతని నుండి ఇక మనకు అధికారం రావడం కష్టమనుకున్నాను. కాని, మనలా మోడీకి ఓట్ల బ్యాంకు రాజకీయాలు తెలియదని అర్ధమైంది. మనం మొదటి నుండి రూపాయి అవసర మయ్యే వాడికి రూపాయే ఇస్తాం, వంద అవసరమైన వాడికి వందిస్తాం... కాబట్టి ఇద్దరూ మనతో ఉండేవాళ్లు. అందుకే 60 ఏళ్లు మనం ఈ దేశాన్ని పరిపాలించగలిగాం. కాని, మోడీ వట్టి అమాయకుడు. రూపాయి అవసరమైన వాడికి, వంద అవసరమైన వాడికి... ఇద్దరికీ 50రూపాయలు ఇవ్వా లనుకున్నాడు. ఆ ప్రయత్నంలో వంద వాడిని 50కి తెచ్చాడుగాని, రూపాయి వాడిని 50కి తీసుకుపోలేకపోయాడు. భారతదేశమంటేనే ఓట్ల బ్యాంకు లెక్కల సమాహారం. ఈ లెక్కలు తెలియక మోడీ బోర్లాపడ్డాడు. పెద్దనోట్ల రద్దు ఒక రకంగా నీ మంచికే నాయనా, అని సోనియా చెప్పింది. దాంతో రాహుల్‌ ఎంతో ఆనందంగా సైకిల్‌ తొక్కుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు.

----------

ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోడీ కేంద్రమంత్రులు మనోహర్‌ పారికర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సురేష్‌ ప్రభు, అనంత కుమార్‌, ప్రకాష్‌ జవదేకర్‌, స్మృతి ఇరానీలు కూర్చుని వున్నారు. ఆ గదంతా కూడా చీకటిగా వుంది. లైట్లు వేయకూడదా అని వెంకయ్య అడిగాడు. కరెంట్‌ లేదని మోడీ చెప్పాడు. ఈ కాలంలో కూడా పవర్‌కట్టా అని వెంకయ్య అన్నాడు. కాదు... పవర్‌ కట్‌ చేసారని మోడీ అన్నాడు. అదేంటి, ప్రధాని కార్యాలయానికే కరెంట్‌ కట్‌ చేయడమేంటి, బిల్‌ కట్టలేదా అని వెంకయ్య ప్రశ్నించాడు. పెద్దనోట్ల రద్దు రచ్చలో పడి కరెంట్‌ బిల్లు కట్టడం మరచిపోయాము... తీరా నిన్న చూస్తే ఆఖరి రోజు. బిల్లు కట్టమని పాత నోట్లు పంపిస్తే తీసుకోలేదు. సమయానికి మన వద్ద కొత్త నోట్లు కూడా లేవని మోడీ చెప్పాడు. దేశంలో నల్ల కుబేరుల వద్ద కోట్ల కొద్ది కొత్త కరెన్సీ కట్టలున్నాయి. మనం మాత్రం ముందు జాగ్రత్త చర్యగా కొన్ని కొత్త నోట్లన్నా పెట్టు కోలేకపోయాము అని వెంకయ్య నిట్టూ ర్చాడు. ఇంతకీ పెద్దనోట్లు రద్దుపై ప్రజ లేమనుకుంటున్నారని మోడీ అడిగాడు. పారికర్‌ వుండి... నా మటుకు హాయిగా వుంది, కాశ్మీర్‌లో అల్లర్లు ఆగిపోయాయి. ఇక నా వ్యక్తిగతంగా అంటారా... పెద్దనోట్లు వున్నా ఒకటే లేకున్నా ఒకటే... అసలు నా దగ్గర డబ్బులు లేకున్నా ఒకటే అని చెప్పాడు. అరుణ్‌జైట్లీ వుండి... పెద్దనోట్ల రద్దు వల్ల పేదలు, పెద్దలు అంతా ఒకటే అయ్యారు సారు, సమతాభారత్‌ అంటే ఇదేనేమో! స్టార్‌ హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు పోయి కాస్ట్‌లీ తిండి తినేవాళ్లు తగ్గిపోయారు. అందరూ కాకా హోటళ్లకే పోతున్నారు. మల్టీప్లెక్స్‌లకు పోకుండా నాన్‌ ఏ.సి పాతకాలం థియేటర్లకే సినిమాలకు పోతున్నారు. ఎవరూ ఆడి, బెంజి కార్ల జోలికి పోవడం లేదు. బాగా బలిసి

నోళ్లు కూడా మారుతి 800, అంబాసిడర్‌ కార్లు కొంటున్నారు. ఇంకొందరైతే గుర్రపు బండ్లు కూడా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇక పెళ్ళిళ్ళలో ఖర్చు చూడాలి... ఇంతకుముందు ప్లేట్‌ భోజనం వెయ్యి రూపాయలు, డెక రేషన్‌కు పాతిక లక్షలు, అంతా కాంట్రాక్ట్‌కిచ్చే వాళ్లు. పెద్దనోట్ల రద్దు తర్వాత పెళ్ళిళ్ల వద్ద భోజనాలు, పెళ్లి పందిర్లు బంధుమిత్రులే వేస్తున్నారు. 50లక్షల్లో చేసే పెళ్లి, ఇప్పుడు 5లక్షల్లో అయిపోతుందని చెప్పాడు. నువ్వే మంటావు వెంకయ్యా అని మోడీ అడిగాడు. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ నా మీద ఏమీ వుండదు సార్‌, ఎందుకంటే నా జీవితంలో వెయ్యి నోటును రెండుసార్లు, ఐదొందల నోటును నాలుగుసార్లు చూసివుంటాను, అది కూడా నా పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోమని మా హర్ష, మా దీప ఇచ్చారు కాబట్టి ఆ నోట్లను చూడగలిగాను అని చెప్పాడు. వెంకయ్య చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు. అంతలో ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. మోడీతో ఆయన సార్‌, మన అంచనాలు తప్పవు తున్నాయి. మొత్తం పెద్దనోట్లు 14.50లక్షల కోట్లుండగా అందులో 10లక్షల కోట్లు మాత్రమే బ్యాంకులకు వస్తాయనుకున్నాం. మిగిలిన డబ్బంతా మనదేననుకున్నాం. కాని ఇప్పటికే 12లక్షల50వేల కోట్ల దాకా వచ్చాయి. ఇంకా 20రోజుల గడువుంది. ఆ మిగతా డబ్బులు కూడా వస్తే మన ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌ అవుతుందన్నాడు. ఆ మాటతో మోడీ ముఖం మాడిపోయింది. అక్కడున్న అందరిలోనూ ఆదుర్ధా మొదలైంది. కనీసం రెండు లక్షల కోట్లన్నా బ్లాక్‌మనీ తేల్చకుంటే మన పరువు పోతుందని మోడీ అన్నాడు. అప్పుడు వెంకయ్య... ఇలాంటి వాటిని మోయడానికి పాపాల భైరవుడు ఒకరు కావాలి. పెద్దనోట్ల రద్దును సమర్ధించిన పాపానికి హైటెక్‌రత్న చంద్రబాబుకు నగదు రహిత లావాదేవీల కమిటీ ఛైర్మెన్‌ పదవిని అంటగట్టాం. దీంతో అతని తంటాలు అతను పడుతున్నాడు. దీనికి కూడా ఏదన్నా సొల్యూషన్‌ చెబుతాడు. అతనిని పిలిపిస్తాం అని చెప్పి వెంటనే చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఢిల్లీకి రమ్మని చెప్పాడు.

రెండు గంటల తర్వాత చంద్రబాబు ప్రధాని కార్యాలయంలో వాలిపోయాడు. వెంకయ్య సమస్యను చెప్పాడు. కనీసం రెండు లక్షల కోట్లు బ్యాంకులకు రాకుండా ఆగిపోయే మార్గం చెప్పమన్నాడు. అది వినగానే చంద్ర బాబు ఏ మాత్రం ఆలోచించకుండా... ఈ మాత్రం దానికేనా నన్ను హడావిడిగా పిలిపించింది... ఫోన్‌లోనే అడిగి వుంటే చెప్పే వాణ్ణి కదా... వెరీ సింపుల్‌... కొత్త నోట్ల పంపిణీలో బ్యాంకుల ద్వారానే అక్రమాలు జరిగాయి. దేశంలోని అన్ని బ్యాంకులపై సిబిఐ, ఏసిబి, ఈడి ఎంక్వైరీలు వేయిం చండి... ముందు ఓ 500మంది బ్యాంకు

ఉద్యోగులను సస్పెండ్‌ చేయండి... వెంటనే అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతాయి. వాళ్లు బ్యాంకుల బయట ఉంటారు. కాబట్టి, ఎలాగూ బ్యాంకుల్లో డిపాజిట్లు తీసుకోరు... ఈ నెల 30దాకా

వాళ్లు సమ్మె చేస్తే చాలు... ఎలాగూ మనం కూడా అప్పటిదాకా వాళ్ల డిమాండ్లకు తలొంచకుండా సమ్మెకు దిగిన వారిలో కూడా కొందరిని సస్పెండ్‌ చేద్దాం. బ్యాంకులు మూత పడితే ఇక ఎక్కడి డబ్బు అక్కడ ఆగిపోవా ల్సిందే కదా! ఎలాగూ ఈ నెల 30వ తేదీ తర్వాత ఆ డబ్బు చెల్లదు. ఈ విధంగా రెండు లక్షల కోట్లు దాకా నిలిచిపోతుందని చెప్పాడు. బాబు స్కెచ్‌కు అక్కడున్న నాయకులందరికీ దిమ్మ తిరిగింది. పెద్దనోట్ల రద్దు చేసినోడు కాదురా గొప్పోడు... ఆ గండం నుండి బయ టేసినోడు గొప్పోడు అన్నట్లుగా వారంతా చంద్రబాబు వైపు అభిమానంగా చూసారు.

Read 422 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter